మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
Published on Fri, 02/07/2025 - 04:30
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.
మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.
‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)
దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్‌ప్రైజ్ గిప్ట్)
ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
Tags