మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
LED Light Therapy: అన్ని రోగాలకు దివ్యౌషధం..!
Published on Fri, 02/07/2025 - 10:29
ముడతలు, సోరియాసిన్, మచ్చలు, ఎండతాకిడికి దెబ్బతిన్న చర్మానికి మంచి చికిత్సగా ‘లెడ్‌లైట్ థెరపీ’ ఉత్తమమని చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు. కొందరైతే ‘లెడ్‌లైట్ థెరపీ’ అనేది అన్ని రకాల రోగాలకు దివ్యౌషధం అని ప్రచారం చేస్తున్నారు. లెడ్‌లైట్ థెరపీని లో–పవర్డ్ లేజర్ థెరపీ, కోల్డ్ లేజర్ థెరపీ, ఎల్‌ఈడీ లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు.
నొప్పి, మంట, కణజాల నష్టాన్ని తగ్గించడంలో, నోటిపూతలు, మచ్చలు, కాలిన గాయాలను నయం చేయడానికి, కొన్ని రకాల అల్సర్‌లను నయం చేయడానికి లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పార్కిన్సన్, అల్జీమర్స్, మల్టిపుల్ స్లిరోసిస్, ఆర్థరైటిస్, ఆటిజం ఉన్న రోగులకు కూడా లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ఈ చికిత్స సులువైనది. నొప్పి ఉండదు.
లెడ్‌లైట్ థెరపీలో కూర్చున్న లేదా పడుకున్న పేషెంట్‌ను పదిహేను నిమిషాల పాటు లెడ్‌లైట్‌కు ఎక్స్‌పోజ్ చేస్తారు.
‘సరిగ్గా వినియోగించినప్పుడు లెడ్‌లైట్ చికిత్స చాలా సురక్షితం’ అంటున్నారు నిపుణులు.
‘అన్నిరకాల సమస్యలకు లెడ్‌లైడ్ థెరపీ పనిచేయకపోవచ్చు’ అంటున్నారు వైద్య అవసరాల కోసం లైట్, లేజర్‌ల ఉపయోగాలకు సంబంధించిన ఎక్స్‌పర్ట్, వోరల్ బయాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రవీణ్ అరణి.
ఆందోళన నుంచి ఉపశమనం, కండరాల పనితీరును మెరుగుపరచడం, ఆటల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడం, చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు...మొదలైన వాటికి సంబంధించి లెడ్‌లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేలు జరుగుతుందనే విషయంలో లోతైన అధ్యయనాల కొరత కనిపిస్తుంది.
(చదవండి: ఆ... భరణం అచ్చం అలాగే!)
Tags