Breaking News

కెరీర్‌లో ఎక్కువ ఫ్లాపులే.. ఆస్తులు మాత్రం కోట్లలో..

Published on Wed, 02/05/2025 - 12:41

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. చాన్స్‌ల కోసం ఏళ్లుగా ఎదురుచూసే వాళ్లు చాలానే ఉంటారు. బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లకి మాత్రం ఫస్ట్‌ చాన్స్‌ ఈజీగా వచ్చేస్తుంది. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే..వాళ్లను కూడా పట్టించుకోరు. వారసత్వంగా వచ్చి.. వెనక్కి వెళ్లిన నటులు చాలా మందే ఉన్నారు. 

మరికొంతమందికి మాత్రం ఎన్ని ఫ్లాపులు వచ్చిన అవకాశాలు వస్తునే ఉంటాయి. వరుస సినిమాలు తీస్తూ కోట్ల ఆస్తులను కూడబెడుతుంటారు. అలాంటి వారిలో అభిషేక్‌ బచ్చన్‌(Abhishek Bachchan) ఒక్కరు. ఆయన సీనీ కెరీర్‌లో అత్యధిక ఫ్లాపులే ఉంటాయి. కానీ ఆస్తుల విషయంలో మాత్రం స్టార్‌ హీరోలకు ఏ మాత్రం తగ్గలేదు. నేడు(ఫిబ్రవరి 5) అభిషేక్‌ బచ్చన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తులపై ఓ లుక్కేద్దాం.

విశాలవంతమైన విల్లాలు
అభిషేక్‌ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగా ఉంటుందట. ఇందులో ఎక్కువగా సొంతంగా సంపాదించుకున్నదే అట. తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తులు కలిపిస్తే..ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సినిమాలపై వస్తే డబ్బును ఎక్కువగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో  పెట్టుబడిగా పెట్టాడట. అలాగే దుబాయ్‌లో ఓ విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశాడు. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ‘బాంద్రా-కుర్లా’ కాంప్లెక్స్, 5 BHK అపార్ట్‌మెంట్‌తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఈ హీరోకి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్టనర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్‌బాల్) పెట్టుబడి పెట్టారు.

లగ్జరీ కార్లు
అభిషేక్‌ దగ్గర రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, బెంట్లీ కాంటినెంటల్‌ జీటీ(3.29 కోట్లు), ఆడి ఏ8ఎల్‌, మెర్సిడెస్‌-బెంజ్‌, ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 130X లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే రియల్‌ ఎస్టేట్‌పై కూడా భారీగా డబ్బు పెట్టాడల. ముంబైలో పలు చోట్ల ఓపెన్‌ ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారట. మొత్తంగా అభిషేక్‌ ఆస్తులు 280 కోట్లకు పైనే ఉంటుందట. అయితే భార్య ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai)తో పోలీస్తే మాత్రం అభిషేక్‌ ఆస్తులు విలువ చాలా తక్కువేనట. ఐశ్వర్య మొత్తం ఆస్తుల విలువ రూ.776 కోట్ల వరకు ఉంటుందట.

నటనకు ప్రశంసలు కానీ..
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్‌.. కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాపులనే చవి చూశడు. ఆయన తొలి సినిమా రెఫ్యూజీ బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ టాక్‌ సంపాదించుకుంది. అయితే నటన పరంగా మాత్రం అభిషేక్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్‌ నటించిన 8 సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. అయినా కూడా అభిషేక్‌ని చాన్స్‌లు వచ్చాయి. ధూమ్‌ సినిమాతో అభిషేక్‌కి తొలి బ్లాక్‌ బస్టర్‌ దక్కింది. బంటీ ఔర్‌ బబ్లీ మూవీతో సోలో హీరోగా హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్యాపులు వచ్చాయి. ధూమ్‌ 3, హ్యాపీ న్యూ ఇయర్‌, ఐ వాంట్‌ టు టాక్‌ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన గులాబ్‌ జామున్‌, డ్యాన్సింగ్‌ డాడ్‌తో పాటు ధూమ్‌ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)