Breaking News

తెలంగాణలో తండేల్‌ షోలు.. అంత బెనిఫిట్‌ మాకొద్దు: అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్

Published on Thu, 02/06/2025 - 21:13

నాగచైతన్య హీరోగా వస్తోన్న తండేల్ చిత్ర టికెట్ ధరలపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదని అన్నారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల  పెంపు కోసం అడిగామని తెలిపారు. తెలంగాణలో తండేల్ బెనిఫిట్‌ షోలు లేవని.. అంత బెనిఫిట్‌ కూడా వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో రూ.295, రూ. 395 టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయని అల్లు అరవింద్‌ తెలిపారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా టికెట్‌ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగాం. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయి. తండేల్ సినిమాకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు లేవు. అంత బెనిఫిట్ కూడా మాకొద్దు. ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసు, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామని అడిగారు. కానీ నేను సినిమా చూశాక మనమే విడుదల చేద్దామని చెప్పా' అని అన్నారు.

కాగా.. అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్‌, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి (ఫోటోలు)

+5

హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)