బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్‌

Published on Sat, 12/21/2024 - 21:17

సంధ్య థియేటర్‌ ఘటన గురించి తన కుమారుడు అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శల పట్ల అల్లు అరవింద్‌ కూడా రెస్పాండ్‌ అయ్యారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు.

'దయచేసి అందరూ ఈ విషయం అర్థం చేసుకోండి. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో  మీరు అడిగే  ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. సుమారు మూడేళ్లు కష్టపడి పాన్‌ ఇండియా రేంజ్‌లో తీసిని సినిమాను అభిమానులతో చూద్దామని థియేటర్‌కు వెళ్లాడు.  అయితే, థియేటర్‌ వద్ద జరిగిన ఆ సంఘటనతో బన్నీ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఉంటున్నాడు. సినిమా సెలబ్రేషన్స్‌ వద్దని చెప్పాడు.

సినిమా ఇంతటి విజయం సాధించినప్పటికీ ఎలాంటి సంతోషం లేకుండానే తన అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. బన్నీ ఇంతటి స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అతనికి వచ్చిన పేరు అంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమాతో రాలేదు.  మూడు తరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నాం. ఎక్కడా కూడా చెడుగా వ్యవహరించలేదు. ఇప్ప​డు మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేంటే బాధగా ఉండటం వల్లే మీడియా ముందుకు వచ్చాం.' అని అల్లు అరవింద్‌ అన్నారు.

Videos

హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)