మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
కందిపోయిన సుందరి
Published on Fri, 02/07/2025 - 02:36
ఎండ తాకిడిని లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొంటున్నారు జాన్వీ కపూర్. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభమైంది. సిద్ధార్థ్, జాన్వీలతోపాటు ప్రధాన తారాగణంపాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
అయితే అక్కడి లొకేషన్స్‌లో తీవ్రమైన ఎండ ప్రభావం కారణంగా తన చర్మం కందిపోయినట్లుగా సోషల్ మీడియాలో ‘బర్ట్ట్న్’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు జాన్వీ కపూర్. ఈ ఫోటోను బట్టి ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తీవ్రమైన ఎండ వేడిమిని కూడా తట్టుకుంటూ షూటింగ్లోపాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మా సుందరి కందిపోయిందన్నట్లుగా కొందరు నెటిజన్లు, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, సౌత్ అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.
Tags