Breaking News

భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న యానిమల్ బ్యూటీ.. డైరెక్టర్ ఏమన్నారంటే?

Published on Tue, 02/04/2025 - 18:06

యానిమల్‌ మూవీతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఫేమస్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు వెతక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ.

అయితే ఇటీవల త్రిప్తి డిమ్రీ రొమాంటిక్ హిట్ సిరీస్‌ ఆషికి-3లో ఆఫర్‌ కూడా దక్కించుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. కానీ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌ తప్పుకుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు మొదలయ్యాయి. ఆమెకున్న బోల్డ్‌ ఇమేజ్ వల్లే నిర్మాతలు త్రిప్తి ఎంపికపై నిర్ణయాన్ని మార్చుకున్నారని ఊహగానాలొచ్చాయి.

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడంపై ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించారు.  ఆమె ఎందుకు తప్పుకుందో తననే అడగాలని అన్నారు. నా సినిమాలో చేయకపోయినా ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని.. నటిగా ఆమె అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తేదీలే సమస్య అయి ఉండవచ్చని అన్నారు.  ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని.. త్రిప్తి ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మా సినిమాకు టైటిల్ పేరేంటో నాకు తెలియదు.. మేము హీరోయిన్‌ను ఇంకా ఖరారు చేయలేదని.. వారం రోజుల్లో ప్రకటిస్తామని అనురాగ్ బసు పేర్కొన్నారు. కాగా.. అనురాగ్ బసు బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్, బర్ఫీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో చిత్రాలకు ఫేమస్ అ‍య్యారు.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)