Breaking News

థియేటర్లలో గేమ్ ఛేంజర్‌.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!

Published on Thu, 01/09/2025 - 18:31

అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ‍ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్‌లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.

అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్‌ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్‌ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.


ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్‌ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు  బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్‌లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్‌ చిత్రాలు..

థియేటర్స్..

గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10
ఫతే(హిందీ సినిమా)-జనవరి 10

ఓటీటీ సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్

యాడ్‌ విటమ్-  జనవరి 10
బ్లాక్ వారెంట్ -జనవరి 10
ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10


డిస్నీ+ హాట్‌స్టార్

గూస్‌బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10


జీ5
సబర్మతి రిపోర్ట్- జనవరి 10


ఆహా

హైడ్‌ అండ్ సీక్- జనవరి 10

 

హోయ్‌చోయ్‌

నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10

Videos

ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఎస్పీ, ఈవోనే కారణం: రోజా

ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఎస్పీ, ఈవోనే కారణం: రోజా

సేమ్ లుక్.. సేమ్ స్టైల్.. యష్ 'టాక్సిక్' టీజర్ పై ట్రోల్స్..!

ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకటేష్

పవన్ పరామర్శ కోసం గేమ్ ఛేంజర్ బాధిత కుటుంబాల పడిగాపులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తవ్వేస్తాం.. దోచేస్తాం అంటున్న తెలుగు తమ్ముళ్లు!

తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం: చిర్ల జగ్గిరెడ్డి

ఏసీబీ విచారణకు హాజరైన BLN రెడ్డి

రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు

Photos

+5

వైకుంఠ ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

పండగొచ్చింది.. పల్లెబాట పట్టిన పట్నంవాసులు (ఫొటోలు)

+5

విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట విషాదం.. పద్మావతి హాస్పిటల్ వద్ద దృశ్యాలు

+5

కడప : యోగి వేమన విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అడ్డగింత (ఫోటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)

+5

రెండో పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన నటుడు సాయికిరణ్‌ (ఫోటోలు)