Breaking News

ఓటీటీ కంటే ముందే టీవీలోకి రాబోతున్న కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ

Published on Wed, 02/05/2025 - 09:07

ఈ మధ్యకాలంలో ఓ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయినా సరే నాలుగైదు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే థియేటర్‌లో రిలీజ్‌ అయిన రెండు వారాలకే ఓటీటీల్లోకి వదిలేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమా టీవీల్లోకి వచ్చేస్తుంది.  ముందు థియేటర్‌ తర్వాత ఓటీటీ, చివరిగా శాటిలైట్‌.. కొనుగోలు చేసినప్పుడు ఈ విధంగా ఒప్పందం చేసుకుంటారు. ఏ సినిమా అయినా సరే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినా తర్వాతే టీవీల్లో ప్రసారం అవుతాయి. కానీ ఓ సూపర్‌ హిట్‌ సినిమా మాత్రం ముందుగానే టీవీల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

యూఐ బాటలో మ్యాక్స్‌
కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'(Max Movie). వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్‌ కానుకగా గతేడాది డిసెంబర్‌ 25న థియేటర్స్‌లో రిలీజ్‌ అయిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాకిస్తూ.. టీవీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్‌ చేశారు. అంటే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా టీవీలో ప్రసారం కానుంది. 

ఈ మూవీ శాటిలైట్‌ హక్కులను జీ నెట్‌వర్స్‌ సొంతం చేసుకుంది. దీంతో  ఈ మధ్యే జీ కన్నడ ఛానెల్ లో 'మ్యాక్స్' మూవీ త్వరలోనే అంటూ ఓ ప్రోమో తీసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ మూవీ డిజిటల్‌ హక్కులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందనే విషయంలోనూ స్పష్టత లేదు. ఓటీటీ కంటే ముందే టీవీలో వచ్చే అవకాశం ఉంది. కన్నడలో మ్యాక్స్‌ ఒక్కటే కాదు మరో పెద్ద సినిమా కూడా నేరుగా టీవీల్లోకే రాబోతుంది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన నటించిన ఈ చిత్రం కూడా జీ ఛానెల్‌లోనే ప్రసారం కానుంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్‌ చేసింది.

మాక్స్‌ కథేంటంటే..
సస్పెండ్‌ అయిన సీఐ అర్జున్‌ అలియాస్‌ మాక్స్‌(సుదీప్‌ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్‌ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్‌ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్‌లో ఉన్న మంత్రుల  కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్‌ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్‌ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్‌ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూప(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌), గ్యాంగ్‌స్టర్‌ గని(సునీల్‌) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్‌(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)

+5

పొలిమేర భామ పోజులు చూశారా.. కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)