మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
తెలుగు నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు: అల్లు అరవింద్
Published on Fri, 02/07/2025 - 03:08
‘‘నేను నిర్మించిన ‘మగధీర’ సమయంలో రూ.40 కోట్లు బడ్జెట్ అంటే... ఈ రోజు ద్రవ్యోల్బణం తీసుకుంటే సుమారు రూ. 350 కోట్లు అవుతుంది. ప్రస్తుతం దాదాపు అందరూ ఇంత బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నారు. ఈ రోజు తెలుగు సినిమా నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు. దీనికి కారణం అలాంటి సినిమాలు చేయగల హీరోలు, దర్శకులు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వారి విజయం’’ అని అల్లు అరవింద్(Allu Aravind) తెలిపారు. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా కంట్రోల్‌లో లేని ఏరియాల్లో మా చిత్రాల విడుదలని బయటి వారికి ఇస్తాం తప్పితే మిగతా అంతా మేమే రిలీజ్ చేస్తున్నాం. మేం అనుకున్న దానికంటే ‘తండేల్’కి బడ్జెట్ ఎక్కువ అయ్యింది. నా వద్దకు బన్నీ వాసు వచ్చి ‘మన సినిమా బయటకి అమ్మేద్దామా?’ అన్నాడు. ఏం ఫర్వాలేదు.. మనమే రిలీజ్ చేస్తున్నామని చెప్పాను’’ అని పేర్కొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ–‘‘నాన్న(నాగార్జున) గారికి మా సినిమా చాలా నచ్చింది. ఆయన్ని సక్సెస్ మీట్‌కి తీసుకొస్తాం’’ అని చెప్పారు.
చందు మొండేటి మాట్లాడుతూ– ‘‘తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురుచూడటం, ఆ మనిషి తనకోసం వస్తాడనే నమ్మకం.. ఇలా చాలా అందమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీ చూశాక చైతన్య, సాయి పల్లవిలో ఎవరి నటన బాగుందనే చర్చ పెడతారు. నన్ను అడిగే చైతన్య చేసిన రాజుపాత్ర అని చెబుతాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలోపాకిస్తాన్ సీక్వెన్ ్స కోసం చందూగారు చాలా పరిశోధన చేశారు. నాగేంద్రగారు అద్భుతమైన సెట్ వేశారు’’ అని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర,పాటల రచయిత శ్రీమణి మాట్లాడారు.
Tags