నయనతారకు అహంకారం.. అందుకే అలాంటి కామెంట్‌ చేసింది: సింగర్‌

Published on Sat, 12/21/2024 - 19:24

నటి నయనతారకు ధన అహంకారం పెరిగిందని, సంచలన గాయని నటి సుచిత్ర పేర్కొన్నారు. ఇంతకుముందు పేరుతో పలువురు ప్రముఖ అంతరంగిక విషయాలను బయటపెట్టి కలకలం సృష్టించిన ఈమె కొద్దిగా సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మళ్లీ తన మార్కు విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా నటి నయనతారపై విరుచుకుపడ్డారు. నటి నయనతార ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌ భేటీలో పాల్గొన్నారు. దానిపై గాయని సుచిత్ర స్పందిస్తూ నటి నయనతార ఇటీవల నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ విడుదల చేసిన ప్రకటనను తాను చూశానన్నారు. అందులో ధనుష్‌పై ఉన్న ఆరోపణలన్నీ నయనతార వెల్లడించారన్నారు. దీంతో తాను నయనతారను అభినందించానన్నారు. 

అయితే ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న వివాదం ధనవంతులైన ఇద్దరి (నటుడు ధనుష్‌, నయనతార) మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. మీ ఇద్దరి ఇళ్లల్లోనూ డబ్బు రూ.కోట్లలో మూలుగుతోందన్నారు. ఈ ఇద్దరికీ డబ్బు అహంకారం పెరిగిపోయిందన్నారు. కాగా నటి నయనతార చాలా గౌరవప్రదంగా మాట్లాడే వారిని అయితే ఇటీవల ఆమె ఒక యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే తన డాక్యుమెంట్‌ చిత్రాన్ని ప్రేక్షకులు అధికంగా చూశారని పేర్కొనడం నయనతారలో ఎంత అహంకారం పెరిగిన దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోఫ్రా గత రెండేళ్లుగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారని, ఆమె ప్రముఖులను మోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 

అలాగే ఆమె నటి నయనతారను పొగడ్తలు ముంచేశారన్నారు. అందుకు ఆమె భారీగా డబ్బు పొందినట్లు తెలిసిందన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నటి నయనతార ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతలా తాను నటుడు ధనుష్‌ ను ఢీకొంటున్నట్లు చెప్పడంతో పాటు, జవాన్‌ చిత్రం తర్వాత హిందీలో మరో అవకాశం రాకపోవడంతో అక్కడ అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని గాయని సుచిత్ర పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Videos

జగనన్న కటౌట్ కే వణికిపోతున్నారు.. రోజా మాస్ స్పీచ్

కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన తెలపనున్న YSRCP

అల్లు అర్జున్ ఇష్యూపై స్పందించిన డీజీపీ జితేందర్

రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమాలకు అడ్డుపడుతున్న అల్లు అర్జున్!

అక్క కళ్లలో ఆనందం కోసం అత్తను హత్య చేసిన తమ్ముడు

గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

రాజోలులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

భారతీయుల ఆశలపై ట్రంప్ పిడుగు

ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం

Photos

+5

బార్బీ డ్రెస్‌లో జాన్వీ కపూర్‌.. క్రిస్మస్‌ స్పెషల్‌ పిక్స్‌ వైరల్‌

+5

‘చేంజ్ మేకర్’ అవార్డుల ప్రధానోత్సవంలో సీనీ తారల సందడి (ఫోటోలు)

+5

NMACC: ఆర్ట్స్ కేఫ్‌ ప్రివ్యూ ఈవెంటెలో బాలీవుడ్‌ తారల సందడి (ఫోటోలు)

+5

17 ఏళ్ల హీరోయిన్.. తొలి సినిమానే ఆస్కార్ బరిలో.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

క్లాసిక్‌ లుక్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ న్యూ మోడల్‌ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 22-29)

+5

మానుషి చిల్లర్ బెడ్రూం పోజులు.. డైమండ్ లాంటి నవ్వు (ఫొటోలు)

+5

అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్‌లో చిల్ అవుతూ! (ఫొటోలు)

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)