Breaking News

Thandel Twitter Review: నాగచైతన్య 'తండేల్‌' ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 02/07/2025 - 07:18

అక్కినేని హీరో నాగచైతన్య  తండేల్ మూవీతో ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో ట్విటర్‌ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు తోడు ఈ మూవీలో సాయి పల్లవి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెల కొన్నాయి. మత్స్యకార బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన తండేల్‌ మూవీకి ప్రధాన బలం సంగీతం అంటూ ఎక్కువమంది దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. 

సినిమా కథ చెప్పడంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. కథలో చాలా బలం ఉన్నప్పటికీ కొన్ని సీన్ల విషయంలో బాగా విసుగుతెప్పించాడని డైరెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, కొందరు కావాలనే పనికట్టుకుని మరీ సినిమాపై నెగటివిటిని తీసుకొస్తున్నారని తెలుపుతున్నారు. 'లవ్‌స్టోరి' హిట్‌ తర్వాత ఈ జోడి మరోసారి భారీ విజయం అందుకుందని తెలుపుతున్నారు.

తండేల్‌ ప్రయాణంలో నాగచైతన్య, సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్‌ మాత్రం దుమ్మురేపారని చెబుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది. తెరపై ఆయన్ను చూసిన ఆభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సీన్‌లో ఏంతమాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.

తండేల్‌ సినిమాకు మరో బలం దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అంటూ కొందరు చెబుతున్నారు. ప్రతి సీన్‌లో బీజీఎమ్‌తో గూస్‌బంప్స్‌ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా  బుజ్జి తల్లి పాటతో సినిమాను మరింత పీక్స్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. సినిమా విషంయలో ఒకటి లేదా రెండు నెగటివ్‌ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడేకాని కనిపించడం లేదు. ట్విటర్‌లో సినిమాపై బాగుందనే ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్‌ కథ సూపర్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదీ 'లవ్‌స్టోరి' బ్లాక్‌ బస్టర్‌ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్‌లో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి రివ్యూ గురించి మరి కొన్ని గంటల్లో తెలుసుకుందాం.

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి (ఫోటోలు)

+5

హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)