జగనన్న కటౌట్ కే వణికిపోతున్నారు.. రోజా మాస్ స్పీచ్
Breaking News
యూట్యూబ్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్ ఇచ్చే వారికి హెచ్చరిక
Published on Sat, 12/21/2024 - 15:30
యూట్యూబ్.. ప్రపంచంలో ఎక్కువమంది ఇందులో సమయం గడుపుతుంటారు. వారికి నచ్చిన కంటెంట్ కోసం వెతుకుతుంటారు కూడా. అయితే, ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోవాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను తప్పుదారి పట్టిస్తుంటాయి. వీడియోలో ఉన్న కంటెంట్‌తో యూట్యూబర్స్ పెట్టే థంబ్‌నైల్స్, టైటిల్స్ ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా వ్యూస్ కోసం వారిని తప్పుదోవ పట్టించడం వంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై కంటెంట్‌కి వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ పెడితే ఖాతాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.
థంబ్‌నైల్‌లో ఒక సినిమా పేరు ఉంచి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారు. దానిని క్లిక్ చేస్తే మరో సినిమా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు ఉంచి ఎలాంటి సంబంధంలేని అడ్డమైన థంబ్‌నైల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి చర్యల వల్ల యూజర్లు బాగా విసిగెత్తిపోతున్నారని యూట్యూబ్ గుర్తించింది. ఇలాంటి సందర్భాలలో యూజర్ల సమయం వృథా అవుతుంది. ఆపై ఆ ఫ్లాట్‌ఫామ్‌పై విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో యూట్యూబ్ పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
యూజర్లను తప్పుదోవ పట్టించేలా క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్‌ను ఎవరైనా ఉపయోగిస్తే.. ఆ యూట్యూబ్ అకౌంట్‌లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ హెచ్చరిక తర్వాత కూడా వారిలో మార్పులు రాకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతల గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్న క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తుంటారు. కంటెంట్ నిజమే అనుకొని యూజర్లు లోపలికి వెళ్తే.. అక్కడ ఏమీ ఉండదు. ఇలా లెక్కలేనన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టించడంతో వారిని విసిగిస్తున్నారు. దీంతో అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు సిద్ధమైంది.
Tags