ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఎస్పీ, ఈవోనే కారణం: రోజా
Breaking News
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
Published on Thu, 01/09/2025 - 09:08
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.
'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు.
(ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్‌లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)
2020 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి.
స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.
Tags