Breaking News

Birthright Citizenship మరోసారి బ్రేక్‌: భారతీయులకు భారీ ఊరట

Published on Fri, 02/07/2025 - 10:41

అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు,  ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ  జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు.  ఈ ఆదేశాల అమలుపై  దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.

ట్రంప్  బాధ్యతలు చేపట్టి, తొలి  రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు  అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని  అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు.  14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్‌ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో  భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్‌ ప్రణాళికలకు  ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.

కాగా  బర్త్‌రేట్‌ సిటిజిన్‌ షిప్‌ ఆర్డర్‌ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి  అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి.  అంతేకాదు  అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.


Birthright Citizenship  అంటే ఏంటి?
అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్‌ జారీ చేసిన ఆర్డర్‌ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.

ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికే

H-1B (వర్క్ వీసాలు)
H-4 (డిపెండెంట్ వీసాలు)
L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)
F (స్టూడెంట్ వీసాలు)
 

ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్‌ అంబానీ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌


 

Videos

మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ

అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్

Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం

ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..

కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్

ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు

కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Photos

+5

పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి (ఫోటోలు)

+5

హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)

+5

చూపులతోనే మైమరిపిస్తున్న కృతి శెట్టి...! (ఫోటోలు)

+5

వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్

+5

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

+5

#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్‌ (ఫొటోలు)

+5

లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)