రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమాలకు అడ్డుపడుతున్న అల్లు అర్జున్!
Breaking News
అఫ్గాన్ ఆల్‌రౌండర్ చీటింగ్.. ఐసీసీ సీరియస్!? రూల్స్ ఇవే
Published on Wed, 06/26/2024 - 08:43
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 పరుగులతో తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తొలి సారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే బౌలింగ్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ సత్తాచాటింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.
అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వర్షం మొదలయ్యే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలవనుంది.
అయితే వర్షం మొదలైనప్పటికి అంపైర్లు మాత్రం ఆ ఓవర్‌ను ఫినిష్ చేయాలని భావించారు. ఈ క్రమంలో అపట్టికే నాలుగు బంతులు వేసిన నూర్ ఆహ్మద్‌ను అంపైర్లు ఓవర్ పూర్తి చేయమని ఆదేశించారు.
అయితే రెండు బంతలు మిగిలుండడంతో బంగ్లా బ్యాటర్ బౌండరీ బాదితే.. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజవేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్‌కోచ్ ట్రాట్ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు కన్పించాడు. సరిగ్గా ఆ సమయంలో ఊపందుకోవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశాడు. ఫిజియో వచ్చి నైబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్‍గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.
దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్‌లు చేస్తున్నారు.
రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?
కాగా నైబ్ వ్యవహరాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా సమయం వృదా చేయకూడదు.
అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్‌లకు ఉంటుంది.
కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్‌లో అంపైర్‌లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు.
Tags