ఒకే ఓవర్‌లో 38 పరుగులు

Published on Tue, 06/25/2024 - 11:25

ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ కౌంటీ క్రికెట్‌లో చెత్త​ రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్‌లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్‌ వేసిన బౌలర్‌గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్సెస్టర్‌షైర్‌కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.

బషీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 128వ ఓవర్‌లో సర్రే బ్యాటర్‌ డాన్‌ లార్సెన్‌ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్‌.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 38 పరుగులు వచ్చాయి. 

కౌంటీ చరిత్రలో ఓ సింగిల్‌ ఓవర్‌లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్‌లో అలెక్స్‌ ట్యూడర్‌ కూడా ఓ ఓవర్‌లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 34 పరుగులు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్‌ చేసింది. డాన్‌ లారెన్స్‌ (175) భారీ సెంచరీతో.. డామినిక్‌ సిబ్లీ (76), జేమీ స్మిత్‌ (86), బెన్‌ ఫోక్స్‌ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్‌లో 490 పరుగులకు ఆలౌటైంది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్‌ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్‌ లిబ్బీ (61), బెన్‌ అల్లీసన్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు.

Videos

యాంకర్ పై ఫన్నీ ప్రాంక్.. మేము చిరంజీవి గారి తాలూకా..

ఆరు నెలలు కాలేదు జనం నడ్డి విరగ్గొట్టారు

జగనన్న కటౌట్ కే వణికిపోతున్నారు.. రోజా మాస్ స్పీచ్

కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన తెలపనున్న YSRCP

అల్లు అర్జున్ ఇష్యూపై స్పందించిన డీజీపీ జితేందర్

రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమాలకు అడ్డుపడుతున్న అల్లు అర్జున్!

అక్క కళ్లలో ఆనందం కోసం అత్తను హత్య చేసిన తమ్ముడు

గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

రాజోలులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

Photos

+5

బార్బీ డ్రెస్‌లో జాన్వీ కపూర్‌.. క్రిస్మస్‌ స్పెషల్‌ పిక్స్‌ వైరల్‌

+5

‘చేంజ్ మేకర్’ అవార్డుల ప్రధానోత్సవంలో సీనీ తారల సందడి (ఫోటోలు)

+5

NMACC: ఆర్ట్స్ కేఫ్‌ ప్రివ్యూ ఈవెంటెలో బాలీవుడ్‌ తారల సందడి (ఫోటోలు)

+5

17 ఏళ్ల హీరోయిన్.. తొలి సినిమానే ఆస్కార్ బరిలో.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

క్లాసిక్‌ లుక్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ న్యూ మోడల్‌ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 22-29)

+5

మానుషి చిల్లర్ బెడ్రూం పోజులు.. డైమండ్ లాంటి నవ్వు (ఫొటోలు)

+5

అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్‌లో చిల్ అవుతూ! (ఫొటోలు)

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)