YS Jagan Mohan Reddy
-
విజయవాడ : శ్రీ శృంగేరీ శారదా పీఠంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
శ్రీ శృంగేరి శారదా పీఠానికి వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం)సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదా పీఠానికి బయల్దేరి వెళ్లారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి..,శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిశారు. వైఎస్ జగన్‌కు శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీ ఆశీస్సులు అందించారు.వైఎస్ జగన్‌తో పాటు.. మల్లాది విష్ణు,వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని సందర్శించారు. -
జగన్ పై లోకేష్ ట్వీట్లు.. పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
-
రుషికొండ భవనాలకు అన్ని అనుమతులున్నాయి : మంత్రి దుర్గేశ్
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
రాజ్యాంగ హక్కులపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు సర్కార్
-
తోచిన అంకెలతో చంద్రబాబు గారడి.. ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సవాల్ చేస్తున్నదేమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నది ఏమిటి? ప్రజలను అసలు విషయాల నుంచి తప్పుదారి పట్టించడంలో చంద్రబాబు ఘనాపాటియే అని అంగీకరించాలి. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అలాంటి వారిని అరెస్టు చేస్తే,తొలుత తనను అరెస్టు చేయండని జగన్ సవాల్ చేశారు. బాబు మోసాలపై తాను ట్వీట్ చేస్తున్నానని, తన పార్టీ నేతలు, క్యాడర్ కూడా ట్వీట్ చేస్తారని, ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టండని, ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం అని జగన్ అన్నారు. బడ్జెట్లో చంద్రబాబు మోసాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియచేస్తామని, సోషల్ మీడియాలో ఎండగడతామని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు ఏమని జవాబు ఇవ్వాలి? తానుమోసం చేయలేదని చెప్పగలగాలి. జగన్ చేస్తున్న వాదన సరికాదని నిరూపించగలగాలి. అలా కాకుండా ఆయన ఏమంటున్నారో గమనించండి..ఎల్లో మీడియాలో వచ్చిన కధనం ప్రకారం శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ' కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా!పశువులా!తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనమో లెక్క?అని అన్నారట.ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రజలను తప్పుదారిటీడీపీ పట్టించే యత్నమా?కాదా?ఎవరు ఎవరి తల్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు?ఎంత అన్యాయంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు!పోనీ ఫలానా వ్యక్తి అని చెప్పకుండా, ఏదో పత్రికలలో ఎవరిమీదనో అన్యాపదేశంగా వార్తలు రాసినట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయవచ్చా?అన్నది ఆలోచించుకోవాలి.చంద్రబాబు మరో వ్యాఖ్య చూడండి.. కూటమిలోని నేతలు , కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరని, ఒకవేళ పెడితే శిక్షిస్తామని ఆయన అన్నారు. ఇందులో లేశమంతమైనా వాస్తవం ఉందా? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా టీడీపీ ప్రత్యేకించి ఐటీడీపీ పేరుతోనో,మరో పేరుతోనో కొంతమంది కార్యకర్తను సోషల్ మీడియా కోసం వినియోగించింది..అందులో ఎందరు దారుణమైన వికృత పోస్టింగ్ లు పెట్టింది తెలియదా?వారికి స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లే మద్దతు ఇచ్చింది అవాస్తవమా?సీఎంగా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా జగన్ ను ,ఆయన కుటుంబ సభ్యులను దూషించి, అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినవారిపై ఒక్కరి మీద అయినా కేసులు పెట్టారా?కనీసం ఖండించారా?పైగా ఇప్పుడు తమవాళ్లు ఎవరూ పెట్టరని సూక్తులు చెబుతున్నారు.అంతెందుకు జగన్ అధికార టీడీపీ వెబ్ సైట్ లో తన తల్లిపైన పెట్టిన ఒక అబద్దపు పోస్టు గురించి ప్రస్తావించి చంద్రబాబు, లోకేష్‌లను అరెస్టు చేస్తారా?అని డీజీపీని ప్రశ్నించారు.అందులో రెండేళ్ల క్రిం విజయమ్మ ప్రయాణిస్తున్న ఒక వాహనం టైర్ పంక్చర్ అయితే ఆమె రోడ్డుపక్క నిలబడి ఉన్న ఫోటోని తీసి, ఈ మధ్యే జరిగినట్లు, జగన్ ఆమెను చంపడానికి ఇలాంటి కుట్ర చేశారని టీడీపీ వెబ్ సైట్ లో పెటిన విషయాన్ని ఆధారాలతో సహా తెలిపితే, చంద్రబాబు అది నిజమా?కాదా? అన్నది ఎందుకు చెప్పలేదు?అంతే!అదే చంద్రబాబు స్టైల్. తను చేసే తప్పులను కూడా ఎదుటివారిపై పెట్టడంలో ఆయన నేర్పరి అని అంటారు.మరో వైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా శాసనమండలిలో మాట్లాడుతూ తన అమ్మను అవమానించారు..వారిని సహించాలా అని ప్రశ్నించారు. ఎవరూ సహించాలని చెప్పరు.అసెంబ్లీలో ఎవరూ అలా మాట్లాడకపోయినా,నెపం నెట్టి ప్రచారం చేశారన్నది వైఎస్సార్సీపీవారి వాదన. ఆ వంకతో రాజకీయాల కోసం పదే,పదే అదే విషయాన్ని ప్రస్తావించడం అమ్మకు గౌరవమా?అన్నది ఆలోచించాలి.అదే టైమ్ లో జగన్ భార్య భారతి మీద, వారి కుటుంబ సభ్యులపైన పెట్టిన దారుణమైన అనుచిత పోస్టింగ్‌ల మాటేమిటి?మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కొడాలి నాని తదితరుల కుటుంబ సభ్యులపై ఎంత అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారో సాక్ష్యాలతో సహా చెప్పినా, అసలుఏమీ జరగనట్లు చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరిస్తున్నారే! వీటిపై చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎక్కడా నోరు విప్పరు.జగన్ ఏపీ బడ్జెట్ పై వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేశారు..15వేల మంది బెవరేజెస్ ఉద్యోగులను తీసేశారు..నిరుద్యోగులకు మూడువేల భృతి ఎగవేస్తున్నారు.తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేను వేల చొప్పున ఇవ్వడానికి 13 వేల కోట్లు అవసరమైతే,ఎంత మొత్తం పెట్టారని ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు..అలా చేయలేదు..ఇవన్ని మోసాలా?కాదా?అని జగన్ అడిగారు.వీటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబుకాని, ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కాని నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు.చంద్రబాబు మాత్రం యధాప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, విధ్వంసం చేసిందని ఆరోపించారు. రాత్రికి రాత్రే అధ్బుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని చేతులెత్తేశారు.ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అన్నీ అద్బుతాలే చేస్తామని,సంపద సృష్టిస్తామని చెప్పడం అబద్దాలాడినట్లే కదా?అప్పుడు చెప్పినవాటి గురించి , హామీల గురించి ప్రశ్నిస్తే వారిమీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం తప్పుకాదా?జగన్ బడ్జెట్ పుస్తకాలలో ఉన్న అప్పుల లెక్కల గురించి ప్రస్తావించి, తన హయాంలో అప్పులు 14 లక్షల కోట్లకు వెళ్లాయని అబద్దాలు చెప్పినట్లు కూటమి బడ్జెట్ లోనే తేలింది కదా అని అన్నారు. మొత్తం అప్పు ఏడు లక్షల కోట్ల లోపే ఉన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం అంగీకరించింది కదా అని అన్నారు. అందులోను విభజన నాటికి ఉన్న అప్పు, తదుపరి చంద్రబాు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు పోను అంతా కలిపి తమ హయాంలో మూడు లక్షల కోట్ల అప్పే కదా అని అడిగారు.అందులో కూడా రెండేళ్లు కరోనా సమస్య ఉందన్న సంగతి గుర్తు చేశారు.దీనికి చంద్రబాబు ఆన్సర్ ఇవ్వలేదు సరికదా..మళ్లీ పాత విమర్శలనే చేశారు.తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనేమో ఆరున్నర లక్షల కోట్లు అని చెబుతారు. ఉపన్యాసంలో మాత్రం జగన్ పాలన పూర్తి అయ్యేసరికి 9.74 లక్షల కోట్లు అని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పద్నాలుగు లక్షల కోట్లు అనడంపై ఎక్కడా వివరణ ఇవ్వరు. అదే చంద్రబాబు విలక్షణ సరళి అని చెప్పుకోవాలి. జగన్ టైమ్ లో జిఎస్టి, జిఎస్‌డిపి,తలసరి ఆదాయం అన్నీ పెరుగుదల చూపినా, వాటినన్నిటిని తోసిపుచ్చుతూ తనకు తోచిన అంకెలతో చంద్రబాబు గారడి చేశారు. జగన్ టైమ్ లో విద్యుత్ చార్జీలు కొద్దిగా పెరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గగ్గోలుగా ప్రచారం చేసేవారు. ఎల్లో మీడియా పూనకం వచ్చినట్లు ఘీబెట్టేది. అదే చంద్రబాబు టైమ్ లో ఏకంగా యూనిట్ కు రూపాయిన్నర వరకు పెరిగినా, అందుకూ జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెరగవని, పైగా తగ్గిస్తానని చెప్పారుగా అని ఎవరైనా అడిగితే,ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా?అని కేసులు పెట్టే పరస్థితి ఏర్పడింది.వీటిపై జగన్ నిలదీసినా చంద్రబాబు కాని ఆయన మంత్రులు కాని నోరుపారేసుకోవడం తప్ప సమాధానం ఇవ్వడం లేదు.జగన్ అసెంబ్లీలో తనకు ఎలాగూ అవకాశం ఇవ్వరని, సవివరంగా తన ఆఫీస్ నుంచే బడ్జెట్ పై మాట్లాడి అనేక ప్రశ్నలు సంధించారు .చంద్రబాబువి అన్నీ మోసాలేనని ,సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, జగన్ స్పష్టం చేస్తూ అదే ప్రకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు కూడా అలాగే పోస్టు చేశారు.దానిపై మాత్రం చంద్రబాబు మాట్లాడరు.కాని అసభ్య పోస్టులు అంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారు.చంద్రబాబు ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?ఏమో పరిస్థితి చూస్తే అలాగే ఉంది.జగన్ అడిగేవాటికి జవాబులు చెప్పలేనప్పుడు చంద్రబాబుకు ఇదొక్కటే మార్గమా!కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్
సాక్షి,తాడేపల్లి:వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం(నవంబర్ 18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడారు.‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్ జగన్‌ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.కొమ్మూరి కనకారావు కామెంట్స్...మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడువర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారుముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదేమాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారురెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడుపెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదుమరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్‌ను దూషించడంంకరెక్టు కాదువైఎస్ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారుఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్ జగన్ ఇచ్చారుచంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారుచర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్ జగన్ పెన్షన్లు ఇచ్చారుచంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు -
కనకదాసు చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
కనకదాసుకు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శ్రీకృష్ణ భగవానుడికి కనకదాస గొప్ప భక్తుడని, ఆధునిక కవిగా ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా, సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు.. ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం అని తన ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు, ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం. pic.twitter.com/lq9enqM7Br— YS Jagan Mohan Reddy (@ysjagan) November 18, 2024 అంతకు ముందు.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కనకదాస జయంతి కార్యక్రమం జరిగింది. కనకదాస చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ టి.ఎన్.దీపిక, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం?
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుంది. దేశంలో ఇంతలా జాప్యం జరిగిన ప్రాజెక్టు ఇంకోటి ఉండదేమో. ఇన్నేళ్ల తరువాతైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ముహూర్తం దగ్గరపడిందని అనుకుంటూ ఉండగానే పిడుగులాంటి వార్త ఇంకోటి వచ్చిపడింది. ప్రాజెక్టు ఎత్తును నాలుగున్నర మీటర్ల మేర తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్న ఈ వార్త ఆందోళన కలిగించేదే. తొలిదశలో నీటిని నిలబెట్టడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే, ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది. అలాగే.. డీపీఆర్‌లోని తప్పుల కారణంగా కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ముందుగా ఈ రెండు కాల్వల ద్వారా 17500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించాలని అనుకున్నారు. కానీ 2017లో డీపీఆర్ తయారీ సమయంలో జరిగిన తప్పుల కారణంగా కుడి కాల్వలో 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వలో ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పారేందుకు అయ్యే నిర్మాణ ఖర్చును మాత్రమే కేంద్రం ఇస్తానందట. దీంతో ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గించుకోవడం లేదంటే.. రూ.4500 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాల్వలను ముందనుకున్న ఆలోచనల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటిది కాదు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్.టి.రామారావు, టంగుటూరి, అంజయ్య వంటివారు ఈ ప్రాజక్టు పురోగతికి ప్రయత్నించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది వేగంగా ముందుకెళ్లిందనేది వాస్తవం. నిర్వివాదాంశం. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన, ముంపు ప్రాంతాల్లో భూ సేకరణ, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాల్లో ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిది. అప్పట్లో ప్రాజెక్టు పూర్తయితే భూ సేకరణ కష్టమవుతుందన్న అంచనాతో ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలలో భూ సేకరణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వారితో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలు ఏమిటని ఎద్దేవ చేసేవారు. అయినా వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు అన్ని అనుమతులు వచ్చి, ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైమ్‌కు ఆయన మరణించడం ఆంధ్రప్రజల దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికే ఐదేళ్లు తీసుకున్నాయి. అంతలో రాష్ట్ర విభజన సమస్య ముందుకు వచ్చింది. ఆ టైమ్ లో ఆంధ్ర ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చి పూర్తి చేయడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. అంతకు ముందు ఎంపికైన కాంట్రాక్టర్‌ను మార్చడం, తమకు కావల్సిన వారితో పనులు చేయించడం, అవి కాస్తా అవినీతి అభియోగాలకు గురి కావడం తదితర పరిణామాలు సంభవించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ మాదిరి మారిపోయిందని వ్యాఖ్యానించడం ఇక్కడ మనం గుర్తుకు చేసుకోవాలి. నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సకాలంలో పూర్తి కావని, ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఆయన మైనర్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే భారీ ప్రాజెక్టులు చేపట్టకపోతే ప్రజలలో అప్రతిష్టపాలు అవుతామని భావించి, వారిని నమ్మించడానికి ఎన్నికలకు కొద్దికాలం ముందు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేవారు.ఆ తర్వాత వాటిని వదలి వేశారు.1999 ఎన్నికలకు ముందు ఇలా ఆయన శంకుస్థాపన చేసి, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టిన ప్రాజెక్టుల శిలాఫలకాల వద్ద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూలు పెట్టి వచ్చిన ఘట్టాలు కూడా జరిగాయి. 2014 లో మరోసారి సీఎం. అయిన తర్వాత సోమవారం పోలవారం అంటూ కథ నడిపారు. ఈ ప్రాజెక్టు తన కల అని ప్రచారం చేసుకునే వారు. జయము, జయము చంద్రన్న అంటూ పాటలు పాడించడం, వేలాది మందిని ప్రాజెక్టు సందర్శనకు తీసుకు వచ్చామని చెబుతూ కోట్ల రూపాయల బిల్లులను మాత్రం చెల్లించడం ప్రత్యేకతగా తీసుకోవాలి. స్పిల్ వే పూర్తి కాకుండా, ఒక గేట్ మాత్రం అమర్చి, అప్పర్, లోయర్ కాఫర్ డామ్ ల నిర్మాణం కంప్లీట్ చేయకుండా, డయాఫ్రం వాల్ నిర్మించి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కీలకమైన డామ్ ,రిజర్వాయిర్ మాత్రం పూర్తి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో సుమారు రూ.800 కోట్ల మేర ఆదా చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్పిల్ వేని పూర్తి చేసి, 48 గేట్లను అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో భారీ ఎత్తున వరదలు రావడంతో చంద్రబాబు టైమ్‌లో కాపర్ డామ్ కోసం వదలిపెట్టిన గ్యాప్‌ల గుండా నీరు ప్రవహించి, డయాఫ్రం వాల్ ను దెబ్బ తీసింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా? లేక పాతదాన్ని పునరుద్దరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం పట్టింది. కాఫర్ డామ్ పూర్తిగా కడితే, వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గాప్ లను వదలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నెపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నించాయి. జగన్ టైమ్ లో తొలిదశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపి ప్రాజెక్టును ఒక దశకు తీసుకు రావాలని తలపెడితే, చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వచేసే విధంగా రిజర్వాయిర్ పనులు సంకల్పించారు. అదే టైమ్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కూడా వేగంగా సాగాయి. కరోనా రెండేళ్ల కాలంలో కూడా పోలవరం పనులు జరిగేలా కృషి చేశారు. అయినా డయాఫ్రం వాల్ కారణంగా జాప్యం అయింది. ఈ లోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైమ్ లో ఒడిషా, చత్తీస్గడ్ లలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఎటూ బిజెపినే అధికారంలో ఉంది. ఆ కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, చత్తీస్ గడ్, తెలంగాణలలోని కొన్ని భూ భాగాలు ముంపునకు గురి అవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది. చత్తీస్ గడ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడలు నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాలలో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని భావించాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ, జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్లకే ప్రాజెక్టును పరిమితం చేయడానికి ఒప్పించాయని భావిస్తున్నారు. అందువల్లే కేంద్ర క్యాబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28 నే తీర్మానం చేసినా, అందులో టీడీపీ క్యాబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడుగా ఉన్నా, ఆయన నోరు మెదపలేదట. దీనిని టీడీపీ,బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఎలాగైతేనేం అక్టోబర్ ఆఖరు నాటికి ఈ విషయం బయటకు వచ్చింది. దానిపై సమాధానం ఇవ్వడానికి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు నమిలారు. మామూలుగా అయితే సుదీర్ఘంగా ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఈ అంశం జోలికి వెళ్లినట్లు లేరు. దీనిని బట్టే ఎంత గుట్టుగా ఈ వ్యహారాన్ని సాగించాలని అనుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకు వెళ్లడం కష్టసాధ్యం అవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రిజర్వాయిర్ గానే ఇది మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించే సీఎం కాని, మంత్రులు కాని, దీనిపై నోరు మెదపడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి సుమారు పాతిక వేల కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికి మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాలలో ఇబ్బంది లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్తారం ఇస్తున్నారనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు.అంతకుముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు. కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు.కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.మరో వైపు, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి.ఇదీ చదవండి: జిల్లాలవారీగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాల వివరాలు.. -
జగన్ పిలుపు.. మార్మోగుతున్న సోషల్ మీడియా
వైఎస్ జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో.. -
మార్మోగుతున్న ఎక్స్.. వైఎస్ జగన్ పిలుపుతో పోస్టుల వెల్లువ
-
వైఎస్ జగన్ ఆదేశాలు.. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ప్రత్యేక బృందాలు
-
నేను అండగా ఉంటా.. జగన్ పరామర్శ
-
అదంతా.. ఐ–టీడీపీ పైశాచికమే
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలతో దమనకాండకు తెగబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. వారం రోజుల్లోనే ఏకంగా 147 కేసులు... 49 మంది అరెస్టులు...680 మందికి నోటీసులతో రాష్ట్రంలో అరాచకాలకు తెర తీసింది. తన దమననీతిని సమరి్థంచుకునేందుకు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రభుత్వ పెద్దలు శ్రీరంగ నీతులు చెబుతుండటం పచ్చ కుట్రలకు పరాకాష్ట. కానీ వాస్తవం ఏమిటంటే... ఐ–టీడీపీ.. ఆది గురువు! పైశాచికత్వానికి నాంది పలికింది... విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది... మారి్ఫంగ్ ఫొటోలతో మహిళలు, పిల్లలపై జుగుప్సాకర పోస్టులు పెట్టే విష సంస్కృతిని వ్యవస్థీకృతం చేసింది టీడీపీనే అన్నది అక్షర సత్యం. అందుకోసం చంద్రబాబు బృందం వేలాది మందితో తయారు చేసిన సోషల్ మీడియా పిశాచ గణ విభాగమే ‘ఐ–టీడీపీ’. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నెలకొల్పిన ఆ విష వృక్షం దశాబ్దకాలంలో వేళ్లూనుకుని పచ్చ రాక్షస మూకతో విశృంఖలత్వాన్ని సృష్టిస్తూ విరుచుకుపడుతోంది. అసభ్య పదజాలం... పచ్చి బూతులు... జుగుప్సాకర పోస్టులు... మహిళలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేస్తూ ఐ–టీడీపీ వెగటు రాజకీయాలకు బరి తెగిస్తోంది.ఫేక్ ఐడీలతో దేశ, విదేశాల నుంచి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టుల వరద పారిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో ఫేక్ ఖాతాలను సృష్టించి ఏకంగా మహానేత వైఎస్సార్ కుటుంబ సభ్యులనే కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట. ఈ కుట్రలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులు ఛేదించినా సరే... ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు ఖాకీలు పచ్చ ముఠా కుట్రకు కొమ్ముకాస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. దశాబ్దకాలంగా సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకర విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఐ–టీడీపీ తాజాగా కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మరింతగా పేట్రేగిపోతోంది. సోషల్ మీడియా పిశాచ గణం... టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’ వికృత రాజకీయానికి, జుగుప్సాకర సంస్కృతికి తెరతీసింది. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీపై దు్రష్పచారం కోసం ఓ వేదికగా టీడీపీ ప్రారంభించిన ఈ ఐ–టీడీపీ పదేళ్లుగా విశృంఖలత్వాన్ని పెంచి పోషించి వ్యవస్థీకృతం చేసింది. హైదరాబాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కేంద్రగా ఈ పిశాచాల ముఠా సోషల్ మీడియా ద్వారాదుష్ప్రచారనికి, వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేసుకుని పుంఖాను పుంఖాలుగా అసభ్య పదజాలం, బూతులు, దూషణలతో కూడిన పోస్టులను వైరల్ చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఐ–టీడీపీ సోషల్ మీడియా అరాచకాలు మరింత పేట్రేగిపోయాయి. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంతగా బరితెగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులతోపాటు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారీ్టలో క్రియాశీలంగా వ్యవహరించే మహిళలు, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాడు మంత్రులుగా ఉన్న అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని తదితరులను కించపరుస్తూ... వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ పోస్టులు పెట్టారు. ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ యూట్యూబ్ చానళ్లలో వీడియోలు వైరల్ చేశారు. నాడు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైఎస్ జగన్ ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ పోస్టులు పెట్టడం పచ్చ పిశాచాల బరి తెగింపునకు నిదర్శనం. ఇక 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఐ–టీడీపీ విశృంఖలత్వం వెర్రి తలలు వేసింది.ఈసారి ఏకంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి సోషల్ మీడియా ఖాతాలు తెరిచింది. ఆ ఐడీల నుంచే జుగుప్సాకరమైన పోస్టులతో బరితెగించింది. దాంతో చూసేవారికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే ఆ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని నమ్మించడమే లక్ష్యంగా ఈ కుట్రను కొనసాగించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ... వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ ఐ–టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తోంది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన బాధితుడినే.. తాజాగా నిందితుడిగా చూపిస్తూ..! తాజాగా చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో అసభ్యకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే అవే పోస్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులే ప్రస్తుతం వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం విస్మయం కలిగిస్తోంది. మరి అలాంటప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన కేసు సంగతి ఏమైనట్లు..? టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఈ ఉదంతం ద్వారా మరోసారి రుజువవుతోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇరికించే కుట్ర...! టీడీపీ పెద్దల ఆదేశాలతో పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురి చేసి వేధించారు. ఆయన చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు 40 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు, యూట్యూబ్ చానళ్ల ద్వారా తాము అసభక్యకర పోస్టులను వైరల్ చేసినట్టు వర్రా రవీంద్రారెడ్డి తన దర్యాప్తులో అంగీకరించారని పోలీసులు ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేయడం గమనార్హం. ఈ అక్రమ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఇరికించేందుకు కూడా పోలీసులు పన్నాగం పన్నడం గమనార్హం. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన పీఏ రాఘవరెడ్డి రాసిన పోస్టులను తాము సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి వెల్లడించారని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ భారతి పీఏ కాదు... ఇక వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి పీఏ అంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఆమె వద్ద పీఏగా పని చేయలేదు. అయితే టీడీపీ దురుద్దేశపూరితంగానే ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ అప్పటికే ఫేక్ సోషల్ మీడియా ఖాతాను సృష్టించింది. ఆ ఖాతా నుంచి అసభ్యకర పోస్టులను వైరల్ చేస్తోంది. షరి్మల, నర్రెడ్డి సునీతను కూడా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ కుట్రకు పరాకాష్ట. దీన్ని వైఎస్సార్ కుటుంబ సభ్యులపైనే నెట్టివేసేందుకే టీడీపీ ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. వాస్తవం ఏమిటంటే వర్రా రవీంద్రారెడ్డి ఏనాడూ వైఎస్ భారతి వద్ద పీఏగా పని చేయలేదు. ఆయన కూడా తాను పీఏనని ఏనాడూ చెప్పుకోలేదు కూడా!ఐ–టీడీపీ అరాచక పోస్టుల్లో కొన్ని...⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ వారి ఫొటోలను ఐ–టీడీపీ ముఠాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆత్మలతో మాట్లాడతారని చంద్రబాబు, లోకేశ్ దారుణంగా దు్రష్పచారం చేయడం... దాన్ని ఐ–టీడీపీ మారి్ఫంగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ చేసి కించపరిచింది. ⇒ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పాముల పుష్పశ్రీవాణితోపాటు పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.⇒ అంబటి రాంబాబు, ఆయన సతీమణి, కుమార్తెలతో ఉన్న ఫొటోను అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ మారి్ఫంగ్ ఫొటోలతో వేధించారు. ⇒ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణిని కించపరుస్తూ.. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు. ఫేక్ ఐడీలతో వైఎస్సార్ కుటుంబంపై పోస్టులుపోలీస్ విచారణలో ఐ–టీడీపీ దారుణాలు బహిర్గతం ఈ వికృత క్రీడకు టీడీపీ ఎంతగా బరితెగించిందంటే... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీలతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కుట్రలకు దిగజారింది. షర్మిల, సునీత తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఐ–టీడీపీ కుట్ర దాగి ఉందని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడి కావడమే దీనికి నిదర్శనం. వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించింది.ఆ ఖాతాల నుంచి వైఎస్సార్ కుటుంబ సభ్యులను, ప్రధానంగా మహిళలను కించపరుస్తూ పోస్టుల వరద పారించింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ తక్షణమే స్పందించి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి సోషల్ మీడియాలో జుగుప్సాకర పోస్టులు పెడుతున్నారంటూ వర్రా రవీంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో ఐ–టీడీపీ దారుణాలు బట్టబయలయ్యాయి. ఈక్రమంలో విశాఖపటా్ననికి చెందిన ఐ–టీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్‌ను అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రరెడ్డి పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీ నుంచే షరి్మల, నర్రెడ్డి సునీతలను కించపరుస్తూ అతడు పోస్టులు పెట్టినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. న్యాయమూర్తి దృష్టికి పోలీస్ అరాచకాలు వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి ఎదుట వాస్తవాలను వెల్లడించడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. పోలీసులు తనను తీవ్రంగా హింసించారని... తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రంగా కొట్టారని... తాను చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలంగా నమోదు చేశారని వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి వద్ద మొర పెట్టుకోవడంతో పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్‌లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్‌తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
వైఎస్ జగన్ ఆదేశం.. వైఎస్సార్సీపీ ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’
తాడేపల్లి : ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు అక్రమ అరెస్టులు చేస్తూనే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, భరోసా కల్పించడం, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తాజాగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పని చేయనుంది.జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలుశ్రీకాకుళం : సీదిరి అప్పలరాజు, శ్యామ్విజయనగరం: బెల్లాని చంద్రశేఖర్, జోగారావువిశాఖపట్నం : భాగ్యలక్ష్మి, కెకె రాజుతూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీతపశ్చిమ గోదావరి : కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపి)కృష్ణా : మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తిగుంటూరు : విడదల రజని, డైమండ్ బాబుప్రకాశం : టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డినెల్లూరు : రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)చిత్తూరు : గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్రెడ్డిఅనంతపురం : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్గౌడ్కడప : సురేష్‌బాబు, రమేష్యాదవ్కర్నూలు హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి -
వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
తాడేపల్లి : ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు నర్రెడ్డి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. బాధితునికి అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్‌ను కోరారు. అదే సమయంలో పార్టీ అండగా ఉంటుందని నర్రెడ్డి లక్ష్మారెడ్డికి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్కాగా, నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గూండాలు.. వైఎస్సార్సీపీ నేత లక్ష్మారెడ్డిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డిని అంతమొందించాలనే రాజకీయ కుట్రలో భాగంగా టీడీపీ ఊరి చివరి కాపు కాసి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను పిడుగురాళ్ళలోని పల్నాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నర్రెడ్డి లక్ష్మారెడ్డిని ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
-
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన YSRCP అధినేత YS జగన్
-
ఏపీలో అరాచకం.. ‘ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆగదు’
ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులతో వేధిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాత పాత పోస్టుల ఆధారంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల.. వాళ్ల మనుషులతో ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు వేయించి.. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇరికిస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు.. శారీరకంగా హింసించడం లాంటివి చేస్తోంది. -
అరెస్ట్ చేయడం మొదలు పెడితే నా నుంచే..!