ప్రమాణాలు నెలకొల్పడంలో సత్తా చాటాలి

Published on Sat, 12/21/2024 - 12:34

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలిగే సత్తా తమలోనూ ఉందని గుర్తించి, ముందుకెళ్లాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. విభిన్న ఆవిష్కరణలతో సంస్థలు మెరుగైన ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి టాప్‌ అయిదు దేశాల జాబితాలో యూరప్‌ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఆ లిస్టులో భారత్‌ లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణమైనవి కాకపోయినప్పటికీ మిగతా దేశాలు నెలకొల్పిన ప్రమాణాలను మనం పాటించాల్సిన అవసరం వస్తోందని నిధి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ విషయంలో భారత్‌లో గణనీయంగా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడంలో వెనకబడినట్లు చెప్పారు. అయితే, ఆ అంశంలో ముందుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి: ఓఎన్‌జీసీ నుంచి పవన్‌ హన్స్‌కు భారీ ఆర్డర్‌

గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం)తో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)ను అనుసంధానం చేయడం సహా నాణ్యతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు టెస్టింగ్‌ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రైవేట్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం మొదలైన వాటిపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు.
 

Videos

హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)