Breaking News

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Thu, 01/09/2025 - 09:54

గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 528.28 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 77,620.21 వద్ద, నిఫ్టీ 162.45 పాయింట్లు లేదా 0.69 శాతం నష్టంతో 23,526.50వద్ద నిలిచాయి.

బజాజ్ ఆటో, నెస్లే ఇండియా (Nestle India), హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో  ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు నష్టపోయి 23,602కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 267 పాయింట్లు దిగజారి 77,890 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 109 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌(Crude Oil) బ్యారెల్‌ ధర 76.2 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.16 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.06 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్‌ బాండ్లపై రాబడులు 4.68 శాతానికి చేరుకోవడంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్‌ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్‌ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి

అంబులెన్సుకు ఫోన్ చేయమంటే ఫోన్లో వీడియోలు చూస్తున్నారు

బాబు దొంగ డ్రామా.. మైక్ లేకుండా.. మైక్ పెట్టుకుని

తప్పు ప్రభుత్వానిదే పవన్ మరో ప్రాయశ్చిత్త దీక్ష ?

తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

రోజా ఫైర్...!

వైఎస్ జగన్ గూస్ బంప్స్ విజువల్స్

పుష్ప-2 టార్గెట్ రూ. 2వేల కోట్లు కాదు..

అడ్డుకున్న పోలీసులు... తగ్గేదేలే అంటూ నడుచుకుంటూ వెళ్లిన జగన్

Photos

+5

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అడ్డగింత (ఫోటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)

+5

రెండో పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన నటుడు సాయికిరణ్‌ (ఫోటోలు)

+5

డైమండ్‌ ఆభరణాలతో మహారాణిలా సితార, ‘తండ్రికి తగ్గ బిడ్డ’ అంటూ ప్రశంసలు

+5

సంక్రాంతి సంబరాల్లో మోహన్ బాబు (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట ఘటన..ఈ పాపం మీదే (ఫొటోలు)

+5

‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్‌

+5

‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కొత్త వైరస్‌ వచ్చేసింది.. మాస్క్‌ ఈజ్‌ బ్యాక్‌ (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)