Breaking News

మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి

Published on Thu, 01/09/2025 - 18:39

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిమ్ కార్డును కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా చెల్లుబాటు అయ్యే చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. ఈ ఆధారాలను ఉపయోగించి కొందరు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు.

ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.

ఆర్ధిక నేరాలను తగ్గించడానికి.. ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడటానికి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (DoT) టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు లేదా ఫోన్‌ నెంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవచ్చు.

ఆధార్‌ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?
సంచార్ సతి అధికారిక వెబ్‌సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.
వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్‌లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.
మొబైల్ కనెక్షన్‌ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.
అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్‌ప్లే మీద కనిపిస్తాయి.
అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.

సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తుంటారు. ఇలాంటి నెంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడకు చెందిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేశారు.

ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!

సిమ్ కార్డులను ఉపయోగించిన తరువాత, ఎక్కడపడితే అక్కడ పడేయడం మంచిది కాదు. వాటిని కొంతమంది మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అంతే కాకుండా మీ ఆధార్ కార్డు లేదా ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించే తెలియనివారికి ఎట్టిపరిస్థితుల్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇవ్వొద్దు. వారు ఏదైనా నేరాలకు పాల్పడితే.. దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

Videos

LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి

అంబులెన్సుకు ఫోన్ చేయమంటే ఫోన్లో వీడియోలు చూస్తున్నారు

బాబు దొంగ డ్రామా.. మైక్ లేకుండా.. మైక్ పెట్టుకుని

తప్పు ప్రభుత్వానిదే పవన్ మరో ప్రాయశ్చిత్త దీక్ష ?

తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

రోజా ఫైర్...!

వైఎస్ జగన్ గూస్ బంప్స్ విజువల్స్

పుష్ప-2 టార్గెట్ రూ. 2వేల కోట్లు కాదు..

అడ్డుకున్న పోలీసులు... తగ్గేదేలే అంటూ నడుచుకుంటూ వెళ్లిన జగన్

Photos

+5

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అడ్డగింత (ఫోటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)

+5

రెండో పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన నటుడు సాయికిరణ్‌ (ఫోటోలు)

+5

డైమండ్‌ ఆభరణాలతో మహారాణిలా సితార, ‘తండ్రికి తగ్గ బిడ్డ’ అంటూ ప్రశంసలు

+5

సంక్రాంతి సంబరాల్లో మోహన్ బాబు (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట ఘటన..ఈ పాపం మీదే (ఫొటోలు)

+5

‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్‌

+5

‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కొత్త వైరస్‌ వచ్చేసింది.. మాస్క్‌ ఈజ్‌ బ్యాక్‌ (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)