కొత్త సంవత్సరంలో జాబ్స్‌ పెరుగుతాయా? తగ్గుతాయా?

Published on Sat, 12/21/2024 - 08:51

వచ్చే ఏడాదిలో నియామకాలు జోరుగా సాగనున్నాయి. 9 శాతం మేర నియామకాలు పెరగనున్నట్టు జాబ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫౌండిట్‌ (గతంలో మాన్‌స్టర్‌ ఏపీఏసీ) వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్, టెలికం, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం మీద 10 శాతం మేర ఉపాధి అవకాశాల్లో వృద్ధి ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ధోరణి వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.

కొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార సంస్థల ప్రాధాన్యతలు 2025లో ఉద్యోగ మార్కెట్‌ తీరును నిర్ణయించనున్నట్టు ఫౌండిట్‌ పేర్కొంది. ఎడ్జ్‌ కంప్యూటింగ్, క్వాంటమ్‌ అప్లికేషన్స్, అత్యాధునిక సైబర్‌ సెక్యూరిటీ సిస్టమ్‌లు.. తయారీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో మార్పును తీసుకురానున్నట్టు వివరించింది. 2023 జనవరి నుంచి 2024 నవంబర్‌ వరకు ఫౌండిట్‌ ప్లాట్‌ఫామ్‌పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. రిటైల్‌ మీడియా నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత విశ్లేషణ టూల్స్‌తో ఈ–కామర్స్, హెచ్‌ఆర్, డిజిటల్‌ సేవల్లో నిపుణుల అవసరాల తీరును మారుతుందని పేర్కొంది. డిజిటల్‌ మార్కెటింగ్, యాడ్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌ అనలైటిక్స్‌లో నిపుణులను సంస్థలు నియమించుకుంటాయని తెలిపింది. 

ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?

ఈ ఏడాదీ నియామకాల్లో జోరు..

2023తో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది అన్ని రంగాల్లో, అన్ని పట్టణాల్లో జాబ్‌ మార్కెట్‌ బలమైన వృద్ధిని చూసినట్టు ఫౌండిట్‌ తెలిపింది. తయారీలో 30 శాతం, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో 29 శాతం, రియల్‌ ఎస్టేట్‌లో 21 శాతం చొప్పున నియామకాలు పుంజుకున్నట్టు పేర్కొంది. అధికంగా కోయింబత్తూర్‌లో 27 శాతం, జైపూర్‌లోనూ 22 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు తెలిపింది. చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటలైజేషన్‌కు మళ్లడం, పట్టణీకర సానుకూలించినట్టు వివరించింది.

Videos

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)