ఆరు నెలలు కాలేదు జనం నడ్డి విరగ్గొట్టారు
Breaking News
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
Published on Sat, 12/21/2024 - 20:25
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో.. ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపులు లభించనున్నట్లు.. ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు. అయితే ఈ మినహాయింపు.. ఫిన్‌టెక్ సేవలకు వర్తించదు.
రుణగ్రహీత రుణ నిబంధనలను పాటించనందుకు, అంటే.. ఈఎంఐ చెల్లింపు లేదా రీపేమెంట్ షెడ్యూల్‌లను ఉల్లంఘించిన్నప్పుడు బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా విధిస్తుంది. అయితే ఈ జరిమానాలపై కూడా ఎటువంటి జీఎస్టీ విధింపు ఉండదని సీతారామన్ ప్రకటించారు.
ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదా
బీమా ప్రీమియంపై జీఎస్టీ వాయిదా
జీఎస్టీ కౌన్సిల్.. ఆరోగ్య, జీవిత బీమాతో సహా ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలకు GST తగ్గించడంపై చర్చ జరుగుతుండగా.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత చర్చ అవసరమని అన్నారు. తరువాత జనవరిలో జరగనున్న సమావేశంలో బహుశా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Tags