Auto biography
-
శరద్ పవార్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా!
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత శరద్ పవార్ తాను అప్పుడే ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విషయం సూటిగా చెప్పినట్టు తన ఆత్మకథ 'లోక్ మాఝే సంగతి' పుస్తకంలో కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. పవార్ ఆత్మకథ బుధవారం విడుదలైన సందర్భంగా అందులోని విషయాలు తెరపైకి వచ్చాయి. ఆ పుస్తకంలో పవార్ తాను 2019 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీని కలిశానని రాశారు. అప్పుడూ బీజేపీ ఎన్సీపీతో పొత్తుకు అవకాశం ఉందా? అనే దాని గురించి అన్వేషించిందని, కానీ తాను ఆసక్తి కనబర్చ లేదన్నారు పవార్. ఐతే బీజేపీతో మాత్రం అధికారిక చర్చలు జరగలేదని, కేవలం బీజేపీ మాత్రమే బంధాన్ని కోరుకున్నదని చెప్పారు. కానీ ఇరు పార్టీల నుంచి ఎంపిక చేసిన నాయకుల మధ్య మాత్రం అనధికారిక చర్చలైతే జరిగాయని పవార్ పుస్తకంలో తెలిపారు. తాను ఆ సమావేశం సమయంలోనే మోదీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లీయర్‌గా చెప్పేశానని పుస్తకంలో పేర్కొన్నారు. అంతేగాదు మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై అనిశ్చిత ఏర్పడిన తర్వాత ఎన్సీపీ, బీజేపీ నేతల మధ్య చర్చలు జరిగాయని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి టైంలో కూడా.. అంతేగాదు అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలో కూడా ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాని బీజేపీ కోరుకున్నట్లు పేర్కొన్నారు. 2014లో కాషాయ పార్టీ అసలు రంగు బయటపడిందని తెలిపారు. అందుకే ఆ పార్టీని విశ్వసించలేమని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కానీ మెజార్టీకి దూరమైందన్నారు. ఆ సమయంలోనూ బీజేపీ తమ పార్టీతో చర్చలు జరిపిందని, అయితే, ఆ సమయంలో తాను లేనని చెప్పుకొచ్చారు పవార్. ఈక్రమంలోనే ప్రభుత్వంలో భాగమైన శివసేనతో హఠాత్తుగా బీజేపీ బంధాన్ని ఏర్పరుచుకుందని చెప్పారు. ఈ పరిణామాల తర్వాత మా నాయకులు రియలైజ్ అయ్యి బీజేపీని విశ్వసించమని చెప్పినట్లు పుస్తకంలో వెల్లడించారు శరద్ పవార్. (చదవండి: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా? కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్) -
'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'
శుబ్‌మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20లో సుడిగాలి శతకంతో అలరించిన గిల్ తాను టి20ల్లో కూడా ఎంత ప్రమాదకారి అనేది చెప్పకనే చెప్పాడు. అతని ప్రదర్శనపై టీమిండియా దిగ్గజాలు సహా కోహ్లి, రోహిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రెండేళ్ల కిందట ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కోహ్లి, గిల్ల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. ''మార్చి 2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లో ఉన్నాం.నరేంద్ర మోదీ స్టేడియంలో అదే మొదటి మ్యాచ్. అదీ కాకుండా భారత్‌లో జరిగే రెండో డే నైట్ టెస్టు. అప్పటికీ మనకు ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు కాలేదు. ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం. పింక్ టెస్టు కావడంతో స్టేడియంలో సీట్లకు పింక్ కలర్ వేశారు. కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందికి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. ఒక చైర్‌కు పింక్ కలర్ వేసి మరో చైర్‌ను నార్మల్‌గా వదిలేశారు.ఈ విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది. పింక్ బాల్ టెస్టులో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి ఏ దిశలో వస్తుందో పసికట్టడం చాలా కష్టం. అందుకే ఫీల్డింగ్ సెషన్ సమయంలో విరాట్ కోహ్లీ, నాతో కలిసి క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సెషన్లో దాదాపు 200 క్యాచులను అందుకున్నాడు కోహ్లి. రేపు టెస్టు అనగా ప్రాక్టీస్ సెషన్స్‌లో అంత కష్టపడడం రిస్క్ అని నేను చెప్పినా వినలేదు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు శుబ్‌మన్ గిల్ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతను కూడా వచ్చి క్యాచ్ ప్రాక్టీస్‌లో పాల్గొనాలనుకున్నాడు. గిల్ అక్కడికి రాగానే విరాట్ కోహ్లీ నవ్వుతూ అతని వైపు చూసి.. ''నీకు పదేళ్లు ఇస్తా.. తమ్ముడు! ఇందులో సగం క్యాచులైనా నువ్వు పట్టుకో చూద్దాం'' అంటూ నవ్వాడు. విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచులు అలాంటివి. అప్పటికి సెషన్స్ సమయం ముగియడంతో అందరం కలిసి టీమ్ బస్సులో బయలుదేరి పది నిమిషాల్లో హోటల్‌కి చేరిపోయాం'' అంటూ రాసుకొచ్చాడు. చదవండి: తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్ అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ -
Darshi Chenchaiah: ఆయన జీవితమే ఒక సందేశం
ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన పోరాటం అనన్యం. ఏకైక తెలుగు ‘గదర్’ వీరుడు. వ్యవసాయ శాస్త్రం చదవడానికని విదేశాలకు వెళ్ళి సమాజంలో అసమాన తలు చూసి చలించిపోయి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు. తెలుగులోనే కాదు, యావత్ దేశంలోనే ప్రప్రథమ అరాచకవాద (అనార్కిస్ట్) తత్వవేత్తల్లో ఒకరు. విస్తృతమైన జీవితాను భవాలను అక్షరీకరించి ‘నేనూ–నా దేశం’ పేరిట అద్వితీయమైన ఆత్మకథను తెలుగు ప్రజకి అందించాడు. ఆయనే దరిశి చెంచయ్య. సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించి అసామాన్య యోధుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ నిత్య పఠనీయం. యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా దేశంలో ఆనాడు ఆయన్ని ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రోద్యమంలో అతివాద టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడమే కాక కాంగ్రెస్ నాయకుడిగా, గాంధేయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, సాహిత్యకారుడిగా, సామా జిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా చెంచయ్య ప్రజ్ఞ బహుముఖం. చెంచయ్య ఆత్మకథ... అనేకమంది విప్లవ వీరులూ, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల సమాహారం. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీన చరిత్రను రికార్డు చేసిన గ్రంథం. అందుకే తెలుగులో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఇది నిలుస్తుంది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం... 1952 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన ‘నేను–నా దేశం’ గ్రంథాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైపోయిన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగుకూ, ఆయన భార్యకీ అంకితం ఇచ్చారు. నాకు తెలిసి తెలుగులో ఒక పంజాబ్ విప్లవ దంపతులకు అంకితమిచ్చిన ఏకైక తెలుగు స్వీయచరిత్ర ఇదే. అందుకే నార్ల ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ, ‘‘శ్రీ చెంచయ్య గారి ‘నేనూ – నా దేశం’ నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందిన ఆత్మకథ. నిజానికి అది ఆయన ఆత్మకథ కాదు; మన దేశ చరిత్ర. పోయిన అర్ధ శతాబ్దిలో మన దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన ప్రతి మహోద్యమం చెంచయ్య జీవిత దర్పణంలో తన ప్రతిబింబాన్ని మిగిల్చింద’’ని అంటారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘ప్రభవ’ పత్రిక వ్యవస్థాపకులు గద్దె లింగయ్య మొదటిసారి ముద్రించిన నాలుగొందల పుటల ఈ స్వీయచరిత్ర అద్భుతమైన విప్లవకారులు జితేంద్ర నాధ లాహిరీ నుండి మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు, గొప్ప బౌద్ధ, భౌతికవాద రచయిత లాలా హర్ దయాళ్ వరకూ; జోధ్ సింగ్, చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మ చారి... వంటి అనేకమందీ మనకి పరిచయం అవుతారు. మొదటి వైశ్య వితంతు వివాహం మొదలు కొని వితంతు శిశు శరణాలయాల స్థాపన దాకా; ‘మా భూమి’ నాటక ప్రదర్శనలు, అమెరికా, జపాన్, చైనా, రష్యా, సింగపూర్ దేశాలలోని పరిస్థితులు, విప్లవ రాజకీయాల్ని కూడా ఇందులో మన కళ్ళకు కడతారు. ఇదంతా ఒక ఎత్తయితే మహామేధావి డాక్టర్ కేబీ కృష్ణతో చెంచయ్యకి ఉన్న అమితమైన స్నేహం ఒక్కటీ ఒకెత్తు. జైలులో ఉన్న సమయంలో కేబీ కృష్ణ మార్క్స్ ‘కేపిటల్’ గ్రంథం మీద అందరికీ క్లాసులు చెప్పే వారంటూ, ‘ఆయన శక్తి మాకు ఆశ్చర్యం కలిగించింది... ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో పారంగతుడు; వేదాంత శాస్త్రంలో అసమాన పాండిత్యం కలవాడు.. వారి సహాయంతో డిటెన్యూల క్యాంపు ఒక సర్వకళాశాలగానూ, విప్లవ కళాశాలగానూ మారిందని’ అంటారు చెంచయ్య. ‘నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్త్రీల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి, చేసి పూర్తిగా సాధించలేక పోవడం వల్ల కలిగిన అసంతృప్తి..’ అని రాసుకున్నారాయన. పది సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు కాలేకపోయానని నిజాయితీగా రాసుకున్న నిజమైన కమ్యూనిస్టు ఆయన. బీడీ కార్మికులు, చుట్ట కార్మికులు, స్పెన్సర్ కంపెనీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు వంటివారు చేసిన పోరాటాలు అన్నిం టిలోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొన్న ఆయన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ మొదలు ‘ప్రజానాట్యమండలి’ వరకూ అనేక ప్రజా సంఘాలతో మమేకమై పని చేశారు. వాటిల్లోని లోపాలను కూడా చాలా సూటిగా చెప్పారు, రాశారు. కనుకనే స్వీయచరిత్ర ముగిస్తూ ఈ దేశానికి, మన సమాజానికి, ‘ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమము’ అవసరం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. (చదవండి: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, ఎవరి దగ్గరా చేయి చాచలేక ఇంట్లో సామానులు అమ్ముకున్న వైనం మనల్ని కదిలిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి చెంచయ్యకు తెలుగు నేలపై ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదనడం అవాస్తవం కాదు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన స్వీయ చరిత్ర ‘నేనూ– నా దేశం’ లోని కొంత భాగాన్నయినా విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయాలి. - గౌరవ్ చెంచయ్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు (దరిశి చెంచయ్య స్వీయచరిత్ర ‘నేనూ – నా దేశం’తెలుగు లోకానికి అంది 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా) -
'మరో మూడు వారాల్లో పూర్తిగా తెలుసుకుంటారు'
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆటబయోగ్రఫీ త్వరలోనే విడుదల కానుంది. ''ఫాఫ్: థ్రూ ఫైర్(Faf: Through Fire)'' పేరిట ఆటోబయోగ్రఫీ అక్టోబర్ 28న బుక్ రిలీజ్ జరగనుంది. ఈ సందర్భంగా డుప్లెసిస్ తన జీవితచరిత్ర గురించి ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఒక క్రికెటర్‌గా మాత్రమే మీకు తెలుసు. నేనొక మూసిన పుస్తకాన్ని. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా నా జీవితం, క్రికెట్ లైఫ్ గురించి నాకు తెలిసినవాళ్లకు తప్ప ఎక్కడా బయటపెట్టలేదు. మరో మూడు వారాల్లో నా జీవితం గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. 'Faf: Through Fire'.. నా స్వీయ చరిత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది'' అంటూ ముగించాడు. ఇక డుప్లెసిస్ సౌతాఫ్రికా తరపున విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు పొందాడు. కెప్టెన్‌గా డుప్లెసిస్ విన్నింగ్ పర్సంటేజ్ 73.68 శాతం ఉండడం విశేషం. సౌతాఫ్రికా తరపున అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన డుప్లెసిస్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా తరపున డుప్లెసిస్ 69 టెస్టుల్లో 4,163 పరుగులు, 143 వన్డేల్లో 5,507 పరుగులు, 50 టి20ల్లో 1528 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ ఖాతాలో టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 12 సెంచరీలు, టి20ల్లో సెంచరీ ఉన్నాయి. సౌతాఫ్రికా తరపున మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా డుప్లెసిస్ రికార్డులకెక్కాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు డుప్లెసిస్ 2021లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డుప్లెసిస్ అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇక టెంబా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్-2లో పాకిస్తాన్, టీమిండియా, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫయింగ్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. I’ve always been a closed book. I haven’t really shared my journey through life and cricket with the people outside of my circle. In three weeks, you will get to be a part of my circle. Pre-order here 👇https://t.co/J9cpr3Gi2Nhttps://t.co/FujCqdIuJy#ThroughFire #ComingSoon pic.twitter.com/rUggbyc0bj — Faf Du Plessis (@faf1307) October 7, 2022 చదవండి: 'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు' -
ఎదురుగా పులులు కనిపిస్తున్నా.. అందరి కళ్లు ద్రవిడ్‌పైనే!
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ ''బ్లాక్ అండ్ వైట్'' ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్.. శనివారం.. ఐపీఎల్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు తన చెంప పగులగొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్.. ప్రస్తుత భారత హెడ్‌కోచ్ ద్రవిడ్‌తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాస్ టేలర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్ వార్న్ సహా రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న టేలర్.. అప్పట్లో బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నాడు. ''2011 ఐపీఎల్ సందర్భంగా ఒకసారి ద్రవిడ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కును సందర్శించా. ఈ సందర్భంగా ద్రవిడ్‌ను.. మీరెన్ని సార్లు పులులను సందర్శించారు. అని అడిగాను. దానికి ద్రవిడ్.. లేదు ఇంతవరకు ఒక్క పులిని కూడా దగ్గరి నుంచి చూడలేదు. ఇది 21వ సపారీ అనుకుంటా.. కానీ ఒక్క పులిని కూడా చూడలేకపోయా అని చెప్పాడు. దీంతో ఏంటి 21 సార్లు సఫారీకి వచ్చినా ఒక్కసారి కూడా పులిని చూడకపోవడం ఏంటి. అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత అందరం కలిసి ఎస్యూవీ మోడల్ ఓపెన్ టాప్ కారులో సఫారీకి వెళ్లాం. దాదాపు 100 మీటర్ల దూరంలో ఒక aపులిని చూశాం. ద్రవిడ్.. నావల్ల ఈరోజు నువ్వు పులిని దగ్గర్నుంచి చూశావు.. దానికి థ్యాంక్స్ చెప్పాలి అని పేర్కొన్నాను. ఇక మా మధ్య ఏవో మాటలు సందర్బంలో వచ్చాయి. ఈ సమయంలోనే నేనొక అద్భుత విషయాన్ని గమనించా. అది చూశాకా భారత్‌లో క్రికెటర్లను ఇంతలా ఎందుకు అభిమానిస్తారా అని ఆశ్చర్యమేసింది. అదేంటంటే.. మేము వెళ్తున్న వాహనం వెనకాల వస్తున్న మరో సఫారీ వాహనంలో కొంతమంది వస్తున్నారు. అప్పటిదాకా కనిపిస్తున్న పులులను తమ కెమెరాల్లో బందిస్తున్న వాళ్లు.. అది ఆపేసి ఒక్కసారిగా కెమెరాలన్నింటిని ద్రవిడ్‌వైపు తిప్పారు. అంటే ఒక జాతీయ పార్క్‌కు వచ్చి.. ఎదురుగా అరుదైన పులి జాతి సంపద కనిపిస్తున్నా సరే.. అందరు ద్రవిడ్‌నే చూడడం నాకు ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా ఒక విషయం కోట్ చేయలానుకున్నా.. 'ప్రపంచంలో సుమారు 4వేల పులులు ఉండుంటాయి.. కానీ వాటికి మించిన ప్రత్యేకం రాహుల్ ద్రవిడ్' అన్న విషయం కచ్చితంగా చెప్పగలను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Asia Cup 2022: ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం -
సల్మాన్‌ఖాన్ కోసం యాంకర్‌గా మారిన ఆలియా!
సల్మాన్ ఖాన్ జీవితం గురించి ఆలియా భట్ న్యారేట్ చేయనున్నారట. ఆలియా మాత్రమే కాదు.. కొందరు తారలు కూడా ఈ కండలవీరుడి కోసం యాంకర్‌గా మారనున్నారని సమాచారం. సల్మాన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘బియాండ్ ది స్టార్’ (స్టార్డమ్ వెనక) డాక్యుమెంట్ సిరీస్ కోసమే ఇదంతా. సల్మాన్ జీవితాన్ని న్యారేట్ చేసే పాత్రలో ఆలియా భట్ కనిపిస్తారని తెలిసింది. ఈ నెల ప్రారంభంలో ఈ సిరీస్ చిత్రీకరణ ఆరంభమైంది. సల్మాన్ వ్యక్తిగత, నటజీవితం నేపథ్యంలో దర్శకుడు విరాఫ్ సర్కారీ ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ తల్లిదండ్రులు, సోదరుల పాత్రలు కూడా సిరీస్‌లో కనిపిస్తాయి. ఇప్పటికే తండ్రి సలీం ఖాన్, సోదరులు సోహైల్ ఖాన్, అర్భాజ్ ఖాన్లు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. అలాగే సల్మాన్ స్నేహితులు, నటులు జాకీ ష్రాఫ్, సంజయ్ దత్ తదితరులు కూడా కనిపిస్తారని భోగట్టా. దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, సాజిద్ నడియాడ్ వాలా, డేవిడ్ ధావన్, సూరజ్ బర్జాత్యా, కరణ్ జోహార్ వంటివారు కూడా నటించారట. వచ్చే ఏడాది ఈ సిరీస్ విడుదల కానుంది. -
చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యా.. ఎవరికీ తెలియకుండా ఏడ్చా: నటి
చిన్న పిల్లలపై లైగింక వేధింపులు జరుగుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలా బలపోయిన వారిలో ఎంతో మంది బయటికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి వాటికి సెలబ్రిటీలు సైతం అతీతులు కాదు. తాజాగా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్ నటి నీనా గుప్తా. సర్దార్ కా గ్రాండ్ సన్, పంగ, సందీప్ ఔర్ పింకీ పరార్, ముల్క్, బదాయిహో వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నీనా గుప్తా. తాజాగా ‘సచ్ కహు తో’ అనే పేరుతో ఆటో బయోగ్రఫీని విడుదల చేసింది. అందులో ఎన్నో వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి చర్చించింది. పసి వయస్సులో ఓ డాక్టర్, టైలర్ లైంగికంగా వేధించిన విషయాన్ని అందులో రాసుకొచ్చింది. ‘నా సోదరుడితో కలిసి కళ్ల ఇన్ఫెక్షన్కు ట్రిట్మెంట్ కోసం ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతను నా బ్రదర్‌ని వెయిటింగ్ రూమ్‌లో ఉండమని చెప్పి.. నా కళ్లను చెక్ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూనే కొద్ది సేపు తర్వాత ఇతర పార్ట్‌పై చేయి వేయడం ప్రారంభించాడు. దీంతో భయంతో వణికిపోయిన నేను ఇంటికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఏడ్చాను. అలాగే ఇంకోసారి ఓ టైలర్ దగ్గరికి వెళ్లగా ఇలాగే జరిగింది. ఈ విషయాలను మా అమ్మకు చెప్పలేదు. ఎందుకంటే వాటికి కారణం నేనే అంటుందని. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇలాంటి విషయాలను కచ్చితంగా పెద్దలకు చెప్పేలా పిల్లలను ప్రోత్సాహించాలి’ అని నీనా పేర్కొంది. అంతేకాకుండా ఇలాంటి ఎంతో మంది తన ఫ్రెండ్స్‌తో ఎక్స్పీరియన్స్ చేసినట్లు తెలిపింది. చదవండి: విక్కీతో కత్రినా టైట్ హగ్.. వీడియో వైరల్ -
అమ్మ ఆత్మకథ కలిచివేసింది: మసాబా
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించేవారు. నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. కాగా నీనా ఆటో బయోగ్రఫీలోని ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె కూతురు, ఫ్యాషన్ డిజైనర్ మసాబా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రిచర్డ్స్‌తో విడిపోయాక.. మసాబా జన్మించే సమయానికి తన దగ్గర కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, దీంతో తాను సాధారణ ప్రసవం కోసం చూసినట్లు నీనా తన ఆత్మకథలో రాసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా మసాబా షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకథ చదివానని, దానిని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. బుక్‌లోని ఈ పేజీని షేర్ చేస్తూ.. ‘అమ్మ నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో.. మా అమ్మ నాకు జన్మనిచ్చే సమయంలో తన వద్ద కేవలం బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 2 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమె సాధారణ డెలివరి కావాలని కోరుకుంది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అంటే 10 వేల రూపాయలు కావాలని. లక్కీగా సమయానికి ట్యాక్స్ రీయింబర్స్మెంట్ పెరగడంతో తన ఖాతాలో 9 వేలు జమ అయ్యాయి. చివరకు తన డెలివరి సమయానికి బ్యాంకులో 12 వేల రూపాయలు అయ్యాయి. ఇప్పుడు నేను సీ-సెక్షన్ శిశువు. తన ఆత్మకథ చదివి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను నన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఎంతటి కష్టాలు భరించిందో తెలుసుకున్నాను. ఆ సంఘటన నన్ను కలిచివేసింది. అందుకే నా జీవితంలో ప్రతి రోజు.. ప్రతి క్షణం ఆమె రుణం తీర్చుకునేందుకే కష్టపడతాను’ అంటూ మసాబా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) -
విరాట్‌లో మార్పు తెచ్చిన పుస్తకం
విరాట్ కోహ్లి... యంగ్ జెనరేషన్‌కు రోల్‌మోడల్. ఆయనకు బాగా నచ్చిన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ‘జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసిన పుస్తకం’ అని కోహ్లి అంటున్న ఈ పుస్తకంలో ఏముంది?‘క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వీల కన్నా, జ్ఞానమార్గాన్ని అనుసరించే వారి కన్నా, కర్మమార్గాన్ని అనుసరించే వారికన్నా యోగి ఉన్నతుడుగా భావించబడతాడు. ఓ అర్జునా...నువ్వు యోగివి కమ్ము’ అంటూ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. పరమహంస యోగానంద (1893–1952) అచ్చంగా అలాంటి యోగి. ఆయన ఆత్మకథ ఈ పుస్తకం. యోగానంద అద్భుతమైన బాల్యానుభవాలు, జ్ఞాని అయిన ఒక గురువు కోసం యవ్వనంలో ఆయన చేసిన అన్వేషణలో తారసపడిన అనేకమంది సాధుసంతులతో జరిగిన విలువైన పరిచయాలు, దైవసాక్ష్యాత్కారం పొందిన గురుదేవుల ఆశ్రమంలో పదిసంవత్సరాలు సాగిన శిక్షణా, రెండు శరీరాలున్న సాధువులు, టైగర్స్వామి, నిద్రపోని సాధువు, గ్రహాల్ని ఓడించడం, సన్యాస స్వీకరణ, క్రియాయోగశాస్త్రం, యుక్తేశ్వర్ పునరుత్థానం, గాలిలో తేలే సాధువు, హిమాలయాల్లో మహాభవన సృష్టి, నిరాహార యోగిని, సనాతన భారతీయ ధ్యానప్రక్రియ విశ్వవ్యాప్తం చేసే కృషి...ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు పుస్తకంలో మనల్ని కట్టిపడేస్తాయి. యోగుల గురించి ఒక యోగి స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాఠకులను ఆకట్టుకుంది. గోరఖ్‌పూర్‌లో పుట్టిన ముకుందలాల్ ఘోష్ పరమహంస యోగానందగా పరివర్తన చెందిన క్రమమే ఈ పుస్తకం. మనసు, ఆత్మకిటికీలు తెరిచే అద్భుతమైన పుస్తకం. -
రిషీ కపూర్ అనే నేను
షో బిజ్ లో ఒకలాంటి డాబు ఉంటుంది. తప్పక కృత్రిమంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో మాటలకు షుగర్ కోటింగ్ వేసి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కొందరు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. రిషీ కపూర్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేయడమే. నచ్చింది చెప్పేయడమే. తన బయోగ్రఫీలోనూ అదే పాటించారు. మనసుకు ఫిల్టర్ వేయకుండా మనసులో ఉన్నదంతా ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. 2017లో ఈ పుస్తకం విడుదలైంది. ఆటోబయోగ్రఫీ ‘ఖుల్లమ్ ఖుల్లా: రిషి కపూర్ అన్ సెన్సార్డ్’ పుస్తకంలో రిషి కపూర్ రాసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం. నేను అదృష్టవంతుణ్ణి మా కుటుంబం కూడా ఆకాశం లానే. ఇంట్లో ఎంతో మంది స్టార్స్. నా జన్మ నక్షత్రం కూడా అద్భుతమైనది. నేను అదృష్టవంతుణ్ణి. పృథ్వీ రాజ్ కపూర్ కి మనవడిని అయినందుకు, రాజ్ కపూర్ లాంటి తండ్రికి కొడుకు అయినందుకు, నీతూ లాంటి భార్య ఉన్నందుకు, రిద్ధిమా, రణ్ బీర్ లాంటి పిల్లలు పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని. నేనెప్పుడూ అదృష్టవంతుడినే. నా బాల్యం నా బాల్యం అంతా సినిమాలతోను, సినిమాల చుట్టూను తిరిగింది. సినిమా కథలు వింటూనే పెరిగాను. కపూర్ ఫ్యామిలీ మొత్తంలో అతి చిన్న వయసులో కెమెరా ముందుకు వచ్చింది నేనే. నాన్నగారు నటించిన ‘శ్రీ 420’ సినిమాలోని ‘ప్యార్ హువా...’ పాటలో వచ్చే ముగ్గురు పిల్లల్లో చిన్నవాణ్ణి నేను. మిగతా ఇద్దరు రణ్ ధీర్ కపూర్, రీతూ కపూర్. ఆ పాట మొత్తం వర్షంలో సాగుతుంటుంది. వర్షపు నీరు నా కంట్లో పడటంతో ఏడ్చేవాణ్ణి. ‘మీ నాన్న గారు చెప్పింది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా’ అని నాతో ఆ సన్నివేశం పూర్తి చేయించారు ఆ సినిమా హీరోయిన్ నర్గీస్ జీ. ఆదివారం మాత్రమే ఆ సినిమా చేశా నాన్నగారు ప్లాన్ చేసిన ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర నాతో చేయించాలనుకున్నారు. అయితే మా అమ్మ మాత్రం కొన్ని షరతులతో నన్ను సినిమాలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకున్నారు. అవేంటి అంటే.. నా చదువుకి ఇబ్బంది కలగకూడదు, స్కూల్లో నా అటెండెన్స్ తగ్గకూడదు. ‘షూటింగ్ మొత్తం ఆదివారం చేస్తా’ అన్నారు నాన్న. వాళ్ల సంభాషణ చాలా క్యాజువల్ గా సాగింది. కానీ నాకు మాత్రం చెప్పలేనంత సంతోషం కలిగింది. స్క్రిప్ట్ తీసుకొని నా రూమ్ లోకి వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత సంతకం ఎలా పెట్టాలో నేర్చుకున్నా. సూపర్ స్టార్ అయ్యాక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. కందిన చెంపతో ఏడ్చాను ‘మేరా నామ్ జోకర్’లో ఓ సన్నివేశంలో నా తల్లి పాత్ర చేసిన ఆమె నా చెంప చెళ్లుమనిపించాలి. ఆ సీన్ సరిగ్గా రావడానికి 9 టేకులయింది. దెబ్బకు నా చెంప ఎర్రగా కందిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను.. మా నాన్న తన పనిలో నిమగ్నమైపోయారు. అప్పుడు అర్థమయింది.. సెట్లోకి అడుగుపెట్టేంతవరకే ఆయన నా తండ్రి అని అడుగు పెట్టాక ఫిలిం మేకర్ అని. పాకెట్ మనీ ట్రిక్ రాజ్ కపూర్ పిల్లలంటే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ముంబయి లోని ఓ పాపులర్ హోటల్ కి నాన్నగారు తరచూ వెళ్లే వారు. నేను ఆ హోటల్ కి వెళ్తే బిల్ ఆయన అకౌంట్ లో చెల్లించడం అలవాటు. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లినా బిల్ ఆయన ఖాతాయే. కానీ మా ఫ్రెండ్స్ మధ్య రూల్ ఏంటంటే.. ఎప్పుడూ బిల్ షేర్ చేసుకోవాలి. వాళ్ల వాటా డబ్బులు నేను తీసుకొని బిల్ మొత్తం నాన్న అకౌంట్ లో కట్టేసేవాడిని. ఫ్రెండ్స్ వాటా డబ్బులు పాకెట్ మనీలా నా జేబులో వేసుకునేవాణ్ణి. నీతూని నిందించాను 1980లో నీతు, నా పెళ్లి జరిగిన తర్వాత నా సినిమాలు ‘కర్జ్, జమానా కో దికానా హే’ దారుణంగా విఫలమయ్యాయి. పెళ్లి అవడంతో నా రొమాంటిక్ హీరో ట్యాగ్ పోయిందనుకున్నాను. దానికి కారణం నీతూనే అని తనని నిందించాను. డిప్రెషన్లోకి వెళ్లా. కెమెరాకు, పబ్లిక్‌కి మొహం చూపించే ధైర్యం లేకుండా పోయింది. అప్పుడు నీతు కడుపుతో ఉంది. నా డిప్రెషన్ ని ఎలా తట్టుకుందో అని ఆశ్చర్యంగా ఉంటుంది. నాతో ఇన్నాళ్లు కలసి ఉన్నందుకు నీతూకి అవార్డు ఇవ్వాలి అని మా అమ్మ, అక్క అంటుంటారు. అది నిజమే. నా తీరుని మార్చాలని తను ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా చిరాకుని తట్టుకుంది. నా మూడ్ కి తగ్గట్టు తను ఉండేది. ఎంతో సహనం వహించింది. నేను, నీతు గొడవపడేవాళ్లం (అందులో చాలాసార్లు తప్పు నాదే అయ్యుంటుంది). కొన్నిసార్లు 6 నెలల వరకు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సమస్యలను కలిసే పరిష్కరించుకున్నాం. నాలో పురుషాహంకారి ఉన్నాడు పెళ్లికి ముందు మా ఇద్దరిలో ఒకరు సంపాదిస్తూ, మరొకరు పిల్లలను చూసుకోవాలనుకున్నాం. నీతు యాక్టింగ్ మానేస్తా అన్నప్పుడు మాట వరసకు కూడా నేను వద్దనలేదు. ‘తన భార్య పని చేయకూడదని నాలో ఉన్నపురుషాహంకారి అలా చేశాడేమో?’. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం (పుస్తకం రాస్తున్నసమయానికి) చాలా మారింది. అవార్డు కొన్నందుకు సిగ్గుపడుతున్నా అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయంతే. నా ‘బాబీ’ విడుదలైన సంవత్సరం (1973)లోనే అమితాబ్ బచ్చ¯Œ ‘జంజీర్’ కూడా విడుదలైంది. ‘బాబీ’ సినిమాకి నాకు బెస్ట్ అవార్డు వచ్చినందుకు అమితాబ్ బాధపడతాడని అనుకున్నాను. ఎందుకంటే ‘జంజీర్’ కోసం తనకి అవార్డు రావాలనుకుని ఉంటాడేమో. అయితే నేను అవార్డు కొనుక్కున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజానికి అవార్డు కొని, మ్యానిపులేట్ చేయాలనుకునే వ్యక్తిని కాదు నేను. అయితే దేని గురించీ ఆలోచించని వయసులో ఉన్నాను. అవార్డు ప్రతినిధి ‘30వేలు ఇవ్వండి. అవార్డు మీది అవుతుంది’ అనడంతో, వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేశా. అలా అవార్డు దక్కించుకున్నందుకు ఎప్పటికీ గిల్టీగా ఉంటుంది. నా ప్రాధాన్యత ఎప్పుడూ రిషీయే ‘‘ఎప్పుడైనా రిషి నుంచి విడిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’ అని నన్ను అడిగితే ‘‘చాలాసార్లు. ప్రతిరోజూ’’ అని సమాధానం చెబుతాను నేను సరదాగా. ఎందుకంటే.. ఇతనితో తప్ప నేను వేరే ఎవ్వరితోను ఉండలేనేమో? ఎందుకంటే... తెలుసుకున్న కొద్దీ గొప్పగా కనిపించే వ్యక్తి రిషి. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అతని గొప్ప లక్షణాల ముందు అతని చెడ్డ అలవాట్లు కనిపించనంత చిన్నగా మారిపోతున్నాయి. నా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే.. రిషీని పెళ్లి చేసుకోవడం. రిషి చాలా కష్టమైన మనిషి. అది ఆయన్ను అర్థం చేసుకునేంత వరకే. కొత్తవాళ్లను సులభంగా నమ్మడు. అందుకే అతని చుట్టూ ఎప్పుడూ పాత ముఖాలే. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ఇవాళ్టికి (పుస్తకం రాస్తున్న సమయానికి) నేను , రిషి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం చాలా మారింది. ఆయన ముఖంలో చిన్న మార్పు చూసి ఆయన మనసును అర్థం చేసుకోగలను. నేను పెట్టుకున్న ఫస్ట్ రూల్ ఏంటి అంటే రిషీయే నాకు ఎక్కువ. అతనితో పోలిస్తే ఎవ్వరూ ఎక్కువ కాదు. బాబ్ (రిషీని నీతూ అలానే పిలుస్తారు)కి సినిమాలంటే పిచ్చి. కుటుంబం అంటే పిచ్చి. నా కుటుంబమే నాకు ప్రపంచం. అందుకే సినిమాలా? కుటుంబమా? అని ప్రశ్న ఎదురైనప్పుడు ఇష్టంగా ఇంట్లోనే ఉండాలనుకున్నా. నాన్నతో మరింత టైమ్ గడిపి ఉండాల్సింది (తండ్రి ఆటోబయోగ్రఫీ ముందు మాటలో రణ్ బీర్ పేర్కొన్న విషయాలివి) నాకు మా నాన్నతో కంటే అమ్మతో దగ్గరితనం ఎక్కువ. నాన్నతో చాలా గౌరవమైన బంధమే ఉండేది. కానీ కొన్నిసార్లు నాన్నతో ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది అనిపించేది. ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కూడా ఉంది. ఏదో ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగి ఉండాల్సింది అనిపిస్తుంటుంది. మా పిల్లలతో నేను ఇలా ఉండను.. కచ్చితంగా వారికి సమయం కేటాయిస్తాను. ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా అంటున్నప్పటికీ మా నాన్న అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ‘మన ఫ్యామిలీని బలంగా కలిపి ఉంచినది, మన అందరి జీవితాలను సులభం చేస్తున్నది మీ అమ్మ (నీతూ కపూర్) మాత్రమే’ అని చాలా స్పష్టంగా చెప్పేవారు నాన్న. వాళ్ల ఇద్దరి నుంచే ప్రేమ అంటే ఏంటి? మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి? అనే విషయాలు నేర్చుకున్నాను. చేసే పనిని ఎలా ప్రేమించాలో నేర్పించారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో నాన్న నాకంటే ఉత్సాహంగా షూటింగ్స్ కి వెళ్లడం చూశాను. నా మీద ఆయనకు ఉన్న గౌరవం చూస్తే భయంగా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. -
‘కాంగ్రెస్‌లో చేరడం పొరపాటో లేక తప్పిదమో చెప్పలేను’
సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌రాణెపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివనేన నుంచి రాణె కాంగ్రెస్‌లో చేరడాన్ని పొరపాటు అనాలో లేక ఘోర తప్పిదం అనాలో చెప్పలేనని వ్యాఖ్యానించారు. నారాయణ్‌రాణె ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2005లో రాణె శివసేన నుంచి బయటికి వద్దామనుకున్నారు. అప్పుడాయనకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి ఎన్సీపీ. రెండోది కాంగ్రెస్. అయితే, ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. అది పొరపాటు నిర్ణయమో. లేక తప్పిదమో చెప్పలేను’అన్నారు. ‘కాంగ్రెస్‌లో చేరితే సీఎం పదవి ఇస్తానన్నారని రాణె చెప్పారు. కానీ, అప్పుడే చెప్పాను. ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కాంగ్రెస్ నైజంలో లేదు అని. వినలేదు. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌లోనే గడిపాను కదా’అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. ఆవేశపరుడిగా పేరున్న రాణె కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేన పార్టీలోనారాయణ్‌రాణె చాలాకాలం పనిచేశారు. బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో బాల్ థాకరే ఆయనకు 1999లో మహారాష్ట్ర సీఎంగా అవకాశమిచ్చారు. అయితే, రాజ్‌థాకరేకి పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో నారాయణ్‌రాణె అసమ్మతి గళం వినిపించారు. దాంతో ఏడాది కాలానికే రాణె సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2005లో కాంగ్రెస్‌లో చేరి 12 ఏళ్లపాటు పనిచేశారు. అయితే, కాంగ్రెస్‌లో నాయకులతో ఆయనకు పొసగక పోవడంతో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు. సోనియా కనికరించడంతో తిరిగి పార్టీలో చేరారు. చివరికి ‘మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష’ పేరుతో 2018లో పార్టీ పెట్టారు. -
‘అప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’
ఆస్కార్‌తో తన సత్తా చాటిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కెరీర్లో ఎదురైన అనుభవాలను పీటీఐ వార్త సంస్థతో పంచుకున్నారు. ‘నా 25వ ఏట వరకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించేవాడిని. నా తండ్రిని కొల్పోయిన తర్వాత ఎదురైన పరిణామాలు నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేశాయి. కానీ నా ప్రయాణం నాకు చాలా నేర్పింది. చావు అనేది అనివార్యమైంది. ప్రతి దానికి ఓ అంతం ఉంటుంది.. కాబట్టి దేనికైనా భయపడటం ఎందుకు?. నా తండ్రి మరణించిన సమయంలో నేను ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆ సమయంలో నాకు 35 సినిమా అవకాశాలు రాగా.. నేను రెండు మాత్రమే చేశాను. నేను ఎలా రాణిస్తానని చాలా మంది ఆశ్చర్యపోయార’ని రెహమాన్ తెలిపారు. నా అసలు పేరు నాకు ఇష్టం లేదు ‘నేను 12 నుంచి 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే జీవితంలో అన్ని కోణాలను చూశాను. నాకు అన్ని నార్మల్‌గా అనిపించడంతో.. వాటిని చేయాలని అనిపించేది కాదు. నా అసలు పేరు దిలీప్ కుమార్ అంటే నాకు ఇష్టం లేదు. నేను దానిని ఎందుకు ద్వేషిస్తానో అర్థం అయ్యేది కాదు. నాకు ఆ పేరు సరిపోదేమోనని అనిపించేది. నేను గతాన్ని పూర్తిగా చెరిపేయాలని అనుకున్నాన’ని రెహమాన్ వెల్లడించారు. కాగా, సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రం రోజా విడుదలకు ముందు రెహమాన్ తన కుటుంబంతో కలిసి ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. కృష్ణ త్రిలోక్ రచించిన రెహమాన్ బయోగ్రఫీ ‘నోట్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకాన్ని ఆయన శనివారం రోజున ముంబైలో అవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
సవతి కొడుకు గురించి హేమ మాలిని
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలియని వారుండరేమో. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఉండగానే నటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే మతం మారి మరి ఆయన హేమను వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అదంతా ట్రాష్ అంటూ వాటిని ధర్మేంద్ర ఖండించారు కూడా. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమారులైన సన్నీ, బాబీ డియోల్‌లు.. హేమ మాలిని-ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. అసలు వీరు కలవటం అనేది కూడా చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ, గ్యాప్ గురించి బాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కూడా. అయితే ఫస్ట్ టైమ్ ధర్మేంద్ర మొదటి భార్య పిల్లల గురించి హేమ మాలిని ఓపెన్ అయ్యారు. వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత రాజ్ కమల్ ముఖర్జీ రచించిన ఆమె ఆత్మకథ హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్ గర్ల్ పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా మధ్య బంధం ఎంతో అందమైంది. ముఖ్యంగా నాకు ఎప్పుడు ఏం సాయం కావాలన్న ధర్మేంద్రతోపాటు సన్నీ కూడా ముందుంటాడు’’ అని ఆమె చెప్పారు. 2005లో రాజస్థాన్‌లో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమను ముందుగా పరామర్శించటంతోపాటు.. తోడుగా సన్నీ డియోల్ నిలిచాడంట. ఆమె వెంటే ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు సన్నీడియోల్ రాకపోయినప్పటికీ.. రమేష్ సిప్పీ, జూహి చావ్లా,సుభాష్ ఘాయ్, నటి దీపికా పదుకునే, మాలిని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
నేను.. నా కథ!
తెలంగాణ ఆకాంక్ష.. అక్షరబద్ధం ►ఆత్మకథ రాస్తున్న సీఎం కేసీఆర్ ►ఉద్యమం నుంచి రాష్ట్రావిర్భావం దాకా.. ►పుస్తకంలో అనేక కీలక ఘట్టాలు, మలుపులు ►రాజకీయ ప్రస్థానంపై పూర్తి వివరాలు.. పూర్వీకుల స్థానికతపై వివరణ ►సహకారం అందిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి ►సంచలనాత్మకంగా నిలుస్తుందంటున్న గులాబీ నేతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుడికారంతో ఆయన మాట్లాడే ప్రతీ మాటా.. పేలే ఒక తూటా ! పల్లెజనం భాషలో వారి మనసుల్లోకి సూటిగా విషయాన్ని చేర్చగల మాటల మాంత్రికుడు.. కటువైన పదజాలం వాడకుం డానే విమర్శలు ఎక్కుపెట్టే నేర్పరితనం.. సమ కాలీన రాజకీయాల్లో సంచలన నేతగా పేరు పడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో సంచలనానికి తెరలేపనున్నారు. టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకా రం.. సీఎం ఆత్మకథ రాసే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ అనుభవాలు, పోరాటం, కలిసొచ్చిన దోస్తులు.. మధ్యలో చేయిచ్చిన నేస్తాలు.. తన పుట్టుక.. బాల్యం, రాజకీయ అరంగేట్రం.. కాంగ్రెస్, టీడీపీల్లో తన రాజకీయ జీవితం.. ఆ పార్టీలను వీడటానికి దారి తీసిన పరిస్థితులు.. టీఆర్ఎస్ ఏర్పాటు.. ప్రత్యేక రాష్ట్ర పోరాటం.. పూర్వీకుల స్థానికతపై నడిచిన వివాదం.. హస్తిన రాజకీయాలు.. సోనియాతో ఒప్పందాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో కీలక మలుపులకు అక్షర రూపం ఇవ్వ నున్నారు. ఈ క్రతువులో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి రచనా సహకా రం అందిస్తున్నారని సమాచారం. తెలంగాణ పోరాట నేపథ్యంలోనే కేసీఆర్ ఆత్మకథ రాస్తు న్నారని, ఇందులో ఇప్పటిదాకా వెలుగు చూడని అనేక అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టనున్నారని అంచనా. వంశవృక్షంపై పూర్తి సమాచారం తెలంగాణ ఉద్యమంలో స్థానిక–స్థానికేతర అంశాల చర్చ జరిగినప్పుడు .. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. తన పూర్వీకుల స్థాని కతపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చేందుకు ‘వంశ వృక్షం’ పూర్తి వివరాలను పుస్తకంలో పొందుపరుస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ లో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న కేసీఆర్ తర్వాత టీడీపీలో ప్రజాప్రతినిధిగా పూర్తిస్థాయి రాజకీయ జీవితం మొదలు పెట్టారు. మంత్రి పదవి దక్కనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచా రం జరిగింది. తాను టీడీపీ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? టీఆర్ఎస్ ఆవి ర్భావానికి దారితీసిన పరిస్థి తులను ఆత్మ కథలో వివరించనున్నారు. పద్నా లుగేళ్ల పాటు అడ్డంకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ నడిపిన తెలంగాణ ఉద్యమంలో అనేక మలు పులు, రాజకీయ వ్యూహాలు, ఎత్తు గడలు, ఫలి తాలు, విఫల ప్రయోగాలు, గుణ పాఠాలను సవివరంగా పొందుపరుస్తున్నారని తెలిసింది. సమకాలీన తెలంగాణ ఉద్యమకారులు ఎంత గా ఆయన వ్యూహాల్ని వేలెత్తి చూపినా.. గత పోరాటాలకు భిన్నంగా పూర్తిగా ‘లాబీయింగ్ ’ మంత్రాన్ని నూటికి నూరుశాతం నమ్మడం, అందుటో భాగంగానే నాడు కేంద్రంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ వద్ద జరిపిన మం త్రాంగం, ఢిల్లీ పెద్దలతో సంబంధాలు.. ఏకాభి ప్రాయం సాధనలో ప్రాంతీయ పార్టీ నేతల మద్దతు కోరడం, ఇందులో కలిసొచ్చిన వారు, చివరల్లో చేయిచ్చిన వారు.. తదితర అంశాలకు అక్షర రూపం ఇస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ పోరాట చరిత్రలో దాగున్న అనేక చీకటి కోణాలను బయట పెట్టడంతో పాటు.. రాష్ట్రావిర్భావం తర్వాత ‘బంగారు తెలంగాణ’ నిర్మాణం కోసం ప్రణాళికలు, చేసిన కసరత్తు తదితరాలకు కేసీఆర్ ఆత్మకథలో చోటు ఉంటుందం టున్నారు. తమ అధినేత రాస్తున్న ఆత్మకత కచ్చితంగా సంచలనాత్మకమవుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు. -
ఓ శృంగార పురుషుడి ‘జ్ఞాపకాలు’
అలనాటి హాలీవుడ్ శృంగారతార మార్లిన్ మన్రో ఇచ్చిన ఓ ముద్దు అతని జీవిత ధ్యేయాన్నే నిర్దేశించింది. నిత్యం శృంగారకేళీ విలాసాల్లో విహరిస్తూ ఏకంగా శృంగార సామ్రాజ్యాన్నే నెలకొల్పి రేరాజులా వెలిగిపోతున్నాడు. అతనే అమెరికాకు చెందిన 68 ఏళ్ల డెన్నీస్ హాఫ్. అర్థరాత్రి ప్రసారమయ్యే హెచ్‌బీవో ఛానల్ రియాలిటీ షోలో కనిపిస్తూ గొప్ప సెలబ్రిటీ అయ్యాడు. ఇప్పుడు సామాజిక వెబ్ సైట్లలోనూ కనువిందు చేస్తున్నాడు. తన ప్రేమపురాణాన్ని పుస్తకరూపంలో తీసుకొస్తున్నాడు. వ్యభిచారిణులతో తన సాంగిత్యాన్ని జ్ఞాపకాల రూపంలో వివరిస్తున్న ‘ది ఆర్ట్ ఆఫ్ ది పింప్’ పుస్తకాన్ని మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేస్తున్నాడు. అప్పుడే తన పుస్తకం బుకింగ్‌లు మొదలయ్యాయని చెబుతున్నాడు. డెన్నీస్ 1990లో నేవడ రాష్ట్రంలోని లియాన్ కౌంటీలో రూ. 6 కోట్లకు ఓ వ్యభిచార గృహాన్ని కొనుగోలు చేశాడు. దానికి అనుబంధంగా బార్లు, రెస్టారెంట్లు, క్యాసినోలను నెలకొల్పుతూ శృంగార సామ్రాజ్ఞాన్ని విస్తరించాడు. ఇప్పుడు ఆయన సామ్రాజ్యంలో ఏ క్షణమైనా 200 మందికి పైగా వ్యభిచారిణులు అందుబాటులో ఉంటారట. మగువల మనసెరిగిన వాడిని కావడంతో.. వారికి విటులను ఎంచుకోవడం దగ్గరి నుంచి లావాదేవీలు మాట్లాడుకోవడం వరకు అన్ని విషయాల్లో స్వేచ్ఛ కల్పించానని చెప్పాడు. వారికి సీఎల్స్, సిక్ లీవ్‌లు ఇవ్వడమే కాకుండా, వారు సంపాదించిన సొమ్ముతో బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించానని, తన కంపెనీల్లో వాటాలిచ్చానని తెలిపారు. ఇంతకు...డెన్నీస్కు మార్లిన్ మాన్రో ఎప్పుడు, ఎక్కడ ముద్దు పెట్టింది?...ఆమె ఆరిజోనా స్టేట్ ఫేర్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌కి వచ్చినప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో తనను ముద్దు పెట్టుకొందని, ఆదీ తన బుగ్గ మీదని డెన్నీస్ తన పుస్తకంలో వివరించాడు. అయినా ఆ ముద్దును ఇప్పటికీ మరువలేదని చెప్పాడు. అమెరికాలో చట్టబద్ఢంగా వ్యభిచారాన్ని అనుమతిస్తున్న ఏకైక రాష్ట్రం నేవడ. రాష్ట్రంలో మొత్తం 16 కౌంటీలు ఉండగా, ఎనిమిది కౌంటీల్లో మాత్రమే ఇప్పటి వరకు వ్యభిచారాన్ని నిషేధించారు. మిగతా కౌంటీల్లో కూడా నిషేధించే ప్రయత్నాలు జరిగాయి. వీటి వల్ల సామాజిక నష్టం ఉందని వాదించేవాళ్లు, సాంస్కృతికంగా ఈ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని, రేప్‌లు లాంటి అసాంఘిక సంఘటనలు జరుగకుండా వ్యభిచార గృహాలు తోడ్పడుతున్నాయని వాదించేవాళ్లు ఎన్నోసార్లు కోర్టులకెక్కారు. చివరకు వ్యభిచారాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టే తీర్పు చెప్పడంతో ప్రస్తుతం ఎలాంటి వాదనలు పెద్దగా వినిపించడం లేదు. -
నా పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకోండి
ముంబై: మహిళలు తన ఆటోబయోగ్రఫీ ‘అన్బ్రేకబుల్’ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ల కలలను సాకారం చేసుకోవాలని భారత మేటి బాక్సర్ మేరీకామ్ పిలుపునిచ్చింది. ‘మహిళల సమస్యల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను కూడా వాటిని ఎదుర్కొన్నా. అవి ఏమిటనేవి నా పుస్తకంలో కూలంకషంగా వివరించా. సవాళ్లను ఎదురించి కలలను నిజం చేసుకోవడానికి ఇతర మహిళలు ఈ పుస్తకాన్ని ప్రేరణగా తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని సోమవారం రాత్రి పుస్తకం విడుదల కార్యక్రమంలో మేరీకామ్ వ్యాఖ్యానించింది. తన జీవితంలో బయటకు చెప్పుకోలేని ఎన్నో కథనాలను ఈ పుస్తకంలో పొందుపర్చానంది. ‘ఓ మహిళ జీవితంలో పురుషుడి మద్దతు ఎలా ఉంటుందన్నదే ఈ బుక్ సారాంశం’ అని ఈ మేరీకామ్ వివరించింది.