బ్యాంక్లపైనే ఆధారపడొద్దు
ముంబై: నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలని, బ్యాంక్‌లపై ఆధారపడడాన్ని పరిమితం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలకు) ఆర్బీఐ సూచించింది. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లు పటిష్టం చేసుకుని, మోసాలు, డేటా చోరీల నుంచి రక్షణ కలి్పంచుకోవాలని కోరింది.
దేశ బ్యాంకింగ్ రంగం, ఎన్బీఎఫ్సీలు బలంగా ఉన్నాయంటూ.. అధిక నగదు నిష్పత్తి, మెరుగుపడిన ఆస్తుల నాణ్యత, లాభాల్లో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పరస్పర అనుసంధానత పెరిగిన నేపథ్యంలో.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలి. బ్యాంక్‌లపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. కస్టమర్లకు సేవల విషయంలో మరింత కృషి చేయాలి’’అని ఆర్బీఐ కోరింది.
సైబర్ దాడుల రిస్క్
నూతన టెక్నాలజీల అమలు నేపథ్యంలో సైబర్ దాడులు, డేటా చోరీ, నిర్వహణ వైఫల్యాలు పెరిగినట్టు పేర్కొంది. మెరుగైన పాలన, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లను పటిష్టం చేసుకుని, పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను చేరుకునే విధంగా ఉండాలని కోరింది. ‘‘ఈ విధమైన సాంకేతిక, సైబర్ భద్రతా రిస్క్‌లను గుర్తించి, వాటి ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. బలమైన గవర్నెన్స్, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం
చేసుకోవాలి’’అని సూచించింది.