-
handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్ బాయ్ తుడిచేస్తాడు!
కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయిస్‌గా నియమించుకుంటున్నాయి. ఏడ్పించి... కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్‌తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. టోక్యోకు చెందిన ‘క్రైయింగ్ వర్క్‌షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్కు వచ్చిన ఐడియానే వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్ షాపులు నిర్వహించి ఈ వీపింగ్ బాయ్‌ను అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయిస్‌ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్‌షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయిస్‌ను వీపింగ్ బాయిస్‌గా ఎంచుకున్నాడు. అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు. -
అందగాళ్లకు అన్నీ కష్టాలే..!
టింగురంగళ్లలా తయారయ్యే అందగాళ్లను చూస్తే చాలామందికి కాస్తంత అసూయగానే ఉంటుంది. అందగాళ్లను అంతా అబ్బురంగా చూస్తారు. అమ్మాయిలూ ఎక్కువగా వారి వెంటే పడతారు. ఇలాంటి సహజ పరిణామాలన్నీ అందగాళ్లకు కాస్తంత ఆనందాన్నే ఇస్తాయి. మరి, వాళ్లకు కష్టాలేమిటి అనుకుంటున్నారా? అందగాళ్లకు బయట ఫాలోయింగ్ ఎలా ఉన్నా, కెరీర్లో మాత్రం ఇబ్బందులు తప్పవని లండన్ వర్సిటీ కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అమెరికాలోని మేరీలాండ్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అందగాళ్ల పట్ల వాళ్ల బాస్‌లకు కాస్తంత బెదురు ఉంటుందని, వీలైనంతగా వాళ్లను అణగదొక్కడానికే ప్రయత్నిస్తారని అంటున్నారు. అయితే, అందగత్తెలైన మహిళలకు కెరీర్లో ఇలాంటి సమస్యలేవీ ఎదురుకావని కూడా వారు చెబుతున్నారు. బాస్‌ల అసూయ కారణంగానే అందగాళ్లు కెరీర్లో నష్టపోతారని, ఏడాదిపాటు జరిపిన తమ అధ్యయనంలో ఈ విషయం తేలిందని వెల్లడిస్తున్నారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటో వైరల్
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
ప్రియుడితో అలాంటి సీన్స్.. అదే కావాలంటోన్న మిల్కీ బ్యూటీ!
నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి
బంగారం, వెండి కొనచ్చా.. ధరలు ఎలా ఉన్నాయంటే..?
పంజాబ్‌లో రైలు ప్రమాదం.. ఇద్దరు లోకోపైలట్ల పరిస్థితి విషమం
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
బాహుబలి వర్సెస్ బుజ్జి
నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
Advertisement