Mercenary work
-
ప్రిగోజిన్ మృతి.. రష్యా అధికారిక ప్రకటన..
పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు జన్యు పరీక్షల రిపోర్టును బహిర్గతం చేసింది. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడనే వార్తల అనంతరం అనేక పుకార్లు వెలుగులోకి వచ్చాయి. ప్రిగోజిన్ మరణం వెనక రష్యానే కుట్ర పన్నిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల అనంతరం క్రెమ్లిన్ జన్యు పరీక్షలకు అనుమతినిచ్చింది. 'విమాన ప్రమాద ఘటన ద్యర్యాప్తులో భాగంగా జన్యు పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో ప్రిగోజిన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారు.' అని ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌తో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో డిమిత్రి ఉట్కిన్ ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా ఇంటెలిజెన్స్‌లో పనిచేసి, ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ నిర్వహణలో ప్రధాన వ్యక్తిగా అయన్ను చెప్పుకుంటారు. విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ఉల్లంఘణలపై రష్యా దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విమాన ప్రమాదం.. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్.. రష్యాలోని మాస్కో నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి విమానం గాల్లో నుంచి కూలిపోయింది. ఈ ఘటనలో చెలరేగిన మంటల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యా మీడియా వెల్లడించింది. ఇందులో ప్రిగోజిన్‌తో పాటు ఆయన అనుచరులు మొత్తం పది మంది ఉన్నట్లు మీడియా తెలిపింది. "The plane will fall apart in mid-air", a video of Prigozhin predicting his death has appeared. 💬"You better kill me, but I won't lie. I have to be honest: Russia is on the brink of disaster. If these cogs are not adjusted today, the plane will fall apart in mid-air", Prigozhin… pic.twitter.com/sG8beb2HLp — Anton Gerashchenko (@Gerashchenko_en) August 27, 2023 పుకార్లపై క్రెమ్లిన్ రియాక్షన్.. తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై క్రెమ్లిన్ ఇటీవల స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. ప్రస్తుతం ఆ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇదీ చదవండి: Biden On Yevgeny Prigozhin Death: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్ -
సీఎం కేసీఆర్ కూలి పనికి ఏర్పాట్లు
అసెంబ్లీ లాబీల్లో తెలిపిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ కూలి దినాలు’లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను కూలీ చేయడానికి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ కోసం రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త దాకా కూలి పనిచేసి ఖర్చుల సొమ్ములు సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం విధితమే. దీనిలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కూలి పనుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కూడా కూలి పనిచేయడానికి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరును ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని, కూలి పనికి కూడా ఏర్పాట్లు చేశామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది వరికోతల సమయం కావడంతో వరికోసే పనిని చూశామని, అయితే ఈ పనికి రైతుల నుంచి ఏమీ తీసుకోబోమని అన్నారు. తొర్రూరు వ్యాపార వర్గాల నుంచి సీఎం కూలి పనికి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. కనీసం రూ.20 లక్షల కూలీ సొమ్ము వచ్చేలా చూస్తున్నామన్నారు. కాగా, అదే రోజు సీఎం కేసీఆర్ పాలకుర్తి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పాలకుర్తి, బమ్మెర, రాఘవపురం గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు.