p gannavaram
-
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉడుమూడి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారి పక్కన ట్రాక్టర్ ఫై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోగా, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. -
పేదల్ని మోసం చేసినవాళ్లకు ఎవరైనా ఓటేస్తారా?: సీఎం జగన్
డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, సాక్షి: పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని, జగన్‌కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారాయన. సోమవారం మధ్యాహ్నాం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. పేదవాడికి మంచి చేయడం మీ బిడ్డ జగన్ నైజం. ఇప్పుడు జగన్ ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. మరోవైపు కూటమి ఉంది. జగన్ ఒకవైపు.. మోసాల చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీరావు, నోటాకు వచ్చినన్ని సీట్లు రాని బాబు కాంగ్రెస్ పార్టీ. వీళ్లందరితో మనం యుద్ధం చేయబోతున్నాం. మరో రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర యుద్దానికి పి.గన్నవరం సిద్ధమా?. బాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుంది. రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. బాబును నమ్మామంటే విష సర్పాన్ని నమ్మడమే. పేదల్ని గెలిపించాలని జగన్ తపన పడుతున్నాడు. ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎనుకున్నేందుకు మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ బిడ్డ జగన్13 సార్లు బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జమ చేశాడు. మరి ఈ జగన్‌ను ఓడించాలని చంద్రబాబు కోరుతున్నారు అని సీఎం జగన్ నిలదీశారు.చంద్రబాబూ.. ఎందుకు జగన్‌ను ఓడించాలి?పెన్షన్లు అందకుండా చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇంటింటికి పెన్షన్లు అందించింది జగన్.. అలాంటి జగన్‌ను ఓడించాలా?పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు జగన్‌ను ఓడించాలా?గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 58 నెలల పాలన కాలంలో సంక్షేమం అదించినందుకా? జగన్‌ను ఓడించాలిఅక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచినందుకా? జగన్‌ను ఓడించాలిప్రజలకు మంచి చేసేందుకు జగన్‌ను ఓడించాలా చంద్రబాబూ?లేదంటే.. చంద్రబాబు కోసం జగన్‌ను ఓడించాలా?గతంలో ఇదే కూటమి ముఖ్యమైన హామీలంటూ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వచ్చింది. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ పేర్లతో.. ఫొటోలతో మేనిఫెస్టో ప్రకటించారు. మరి అందులో ఒక్క హామీ అయినా అమలు చేశారా?. చంద్రబాబుకి ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అని సీఎం జగన్ అన్నారు. ఇంటింటికి బెంజ్ కారు అంట. సూపర్ సిక్స్ అంట. చంద్రబాబుకి అసలు ఓటేందుకు వేయాలి? అనేది.. మేనిఫెస్టో ద్వారా ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబుకి అసలు ఎవరైనా ఓటేస్తారా?. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? అని సీఎం జగన్ ప్రజల్ని ప్రశ్నించారు.వలంటీర్లు ఇంటికి రావాలన్నా.. మన చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగుపడాలన్నా.. రెండు బటన్లు ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు. సిద్ధమేనా?.. అని సీఎం జగన్ అశేష ప్రజావాహిని ఉద్దేశించి అన్నారు.మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులతో.. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిలబడుతున్న విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపాక వర ప్రసాదరావులను గెలిపించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ఇంట్లో వాళ్లతో కూర్చుని చర్చించండి. ఆలోచించి ఓటేయండి. మనం ఒక సినిమా చూస్తాం. సినిమాలో హీరో, విలన్ ఎవరో మనకు తెలియదు. అందులో హీరో మనకు నచ్చుతాడు. కేవలం మంచి చేస్తాడు.. మానవత్వం ఉంది కాబట్టే హీరో నచ్చుతాడు. కానీ, విలన్ మోసాలు చేస్తాడు. అబద్ధాలు చెప్తాడు. కుట్రలు చేస్తాడు. అందుకే విలన్ నచ్చడు. నిజజీవితంలో హీరో ఎవరో, విలన్ ఎవరో ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఆలోచన చేయండి’’ అంటూ పేరుపేరునా ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రసంగం ముగించారు. -
మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అంటే వెన్నుపోటు.. వెన్నుపోటు అంటే చంద్రబాబు.. ఎన్నికల సమయంలో బాబు వెన్నుపోటు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. తాజాగా టికెట్ విషయంలో మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పి.గన్నవరం టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుండి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. విజయవాడలో పి.గన్నవరం సీటును జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి టికెట్ కేటాయించారు. పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌ను చంద్రబాబు ప్రకటించారు. మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని స్ధానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాసేన రాజేష్‌ను పి.గన్మవరంలో పర్యటించకుండా జనసేన నేతలు అడ్డుకున్నారు. మహాసేన రాజేష్‌కు టికెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేశాయి. వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన చేశారు. కొన్ని రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ మళ్లీ ప్రకటన చేశారు. ఇదే సమయంలో మహాసేన రాజేష్‌కు వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం టికెట్ జనసేన పార్టీకి కేటాయించారు చంద్రబాబు. మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టికెట్ పవన్ కల్యాణ్ ఇచ్చారు. సత్యనారాయణకి నియామక పత్రాలు పవన్ కల్యాణ్ అందించారు. -
తోకముడిచిన మహాసేన రాజేష్.. బరి నుంచి ఔట్
సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ-జనసేన అభ్యర్థి సరిపెళ్ల రాజేష్(మహాసేన రాజేష్) తోకముడిచారు. పి.గన్నవరం ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. పి. గన్నవరం నియోజకవర్గానికి రాజేష్ పేరు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహాసేన రాజేష్‌ను బరి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేటలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో జనసేన కార్యకర్తలు రచ్ఛ రచ్చ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జ్ హరీష్ మాధుర్ కారును కూడా జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించి తప్పుకుంటున్నట్టు రాజేష్ ప్రకటించారు. మరోవైపు వివాదాస్పదుడైన మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం టికెట్‌ను కేటాయించడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు శుక్రవారం విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. రాజేష్‌కు టికెట్ ఇవ్వడం అంటే బ్రాహ్మణులను టీడీపీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు. మహాసేన రాజేష్‌కు టీడీపీ ఇచ్చిన పి.గన్నవరం టికెట్‌ను వెంటనే రద్దు చేయాలని కర్నూలులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది. కాగా, మరో వైపు, రాజేష్‌కు టికెట్ ఇచ్చిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పలు హిందూ సంఘాల హెచ్చరిస్తున్నాయి. హిందూ దేవుళ్లు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్‌పై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాజేష్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ -
కోనసీమ జిల్లా: ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థత
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే అస్వస్థతకు గురికావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. వెంటనే అంబులెన్సులో హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తనయుడు వికాస్ తెలిపారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
ఏసీబీ వలలో ఎంపీడీవో
పి.గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కె.ఆర్.విజయ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ మంజూరు కోసం మండల పరిషత్ నుంచి 10 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మండలంలోని రాజులపాలెంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.1.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించాలని పంచాయతీలో నిర్ణయించారు. ఎంపీ లాడ్స్ మంజూరుకు ముందుగా గ్రామ పంచాయతీ నుంచి 10 శాతం, మండల పరిషత్ నుంచి 10 శాతం సొమ్ము మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంది. మండల పరిషత్ మ్యాచింగ్ గ్రాంటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉప సర్పంచ్ ఎన్.విజయలక్ష్మి ఇటీవల ఎంపీడీవో విజయను కోరారు. అనుమతి ఇచ్చేందుకు ఎంపీడీవో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ నెల 6న విజయలక్ష్మి ఎంపీడీవోకు రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము కూడా ఇవ్వాలని ఎంపీడీవో ఒత్తిడి చేయడంతో ఉప సర్పంచ్ తమను ఆశ్రయించినట్టు ఏసీబీ ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయలక్ష్మి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో విజయను పట్టుకున్నట్టు చెప్పారు. తమ పరీక్షల్లో ఎంపీడీవో నగదు తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఎంపీడీవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అరెస్టు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో సీఐలు వి.పుల్లారావు, బి.శ్రీనివాస్, వై.సతీ‹Ù, ఎస్ఐ ఎస్.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మృతి
సాక్షి, కోనసీమ జిల్లా : పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి (68) గురువారం తెల్లవారుజామున అమలాపురం ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్‌మన్‌గా పనిచేసిన నారాయణమూర్తి 1996లో జరిగిన నగరం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది 1999 వరకూ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి చెందారు. 2014లో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొంది 2019 వరకు సేవలు అందించారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రవికుమార్, నలుగురు కుమార్తెలున్నారు. పులపర్తి పార్థివదేహానికి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళులు అర్పించారు. ముంగండ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని) -
విద్యా కానుక కిట్స్ అందజేసిన సీఎం వైఎస్ జగన్
-
స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం
-
‘జగనన్న విద్యా కానుక’ ప్రారంభించిన సీఎం జగన్
అప్ డేట్స్: మనబడి నాడు-నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి సీఎం జగన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని, పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' కింద బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ► పి. గన్నవరం హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ.. స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను రూపొందించామని పేర్కొన్నారు. ► మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని చెప్పారు. తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశామని, రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌కు వివరించారు. ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్‌ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్ పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్ పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్ ఆవిష్కరించి సీఎం జగన్ ప్రారంభించారు. ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్ జగన్ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్ ప్రారంభించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు సీఎం జగన్ కిట్లు పంపిణీ చేయనున్నారు. సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు స్థానిక జెడ్పీ హైస్కూలులో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు శనివారం పరిశీలించారు. అధికారులకు మంత్రులు పలు సూచనలిచ్చారు. తరగతి గదులు, ఫర్నిచర్, పెయింటింగ్స్, మరుగుదొడ్లను, ‘నాడు–నేడు’ పైలాన్‌ను పరిశీలించారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు సరిపడేలా చిన్న సైజు మాస్కులు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. ‘నాడు–నేడు’లో భాగంగా 10 రకాల మౌలిక సదుపాయాలు బాగా ఏర్పాటు చేశారని మంత్రి సురేష్ ప్రశంసించారు. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షాలు అడ్డంకిగా మారినప్పటికీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పాఠశాల ఆవరణలో భారీ వాటర్ ప్రూఫ్ షెడ్డును నిర్మించారు. షెడ్డు పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు ఏర్పాటు చేసి తోడుతున్నారు. వర్షాలకు పాఠశాల ఆవరణ చిత్తడిగా మారింది. పాఠశాల ముఖద్వారం వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ వరకూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అమలాపురం ఆర్డీఓ వసంత రాయుడు, డీఎస్పీ వై.మాధవరెడ్డి, డీఈఓ ఎస్.అబ్రహం తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
టీడీపీ పాలనంతా గ్రాఫిక్స్‌తో మాయ: మంత్రి ఆదిమూలపు
పి.గన్నవరం: పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏటా విద్యారంగానికి రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. నాడు నేడు మొదటి విడత కార్యక్రమంలో రూ.3,600 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 15,715 పాఠశాలల రూపురేఖలను మార్చివేశామని వివరించారు. పి గన్నవరం ఉన్నత పాఠశాల నుంచి సీఎం జగన్ ప్రజలకు అంకితం చేయనున్నారని ప్రకటించారు. ఈనెల 16వ తేదీన సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హైస్కూల్లో శనివారం అభివృద్ధి పనులు, సభ ప్రాంగణాన్ని మంత్రి సురేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో మాయ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ కబంధ హస్తాలు అందించిందని ఆరోపించారు. ఇక రెండో విడతగా రూ.4,800 కోట్ల వ్యయంతో మరో 16 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమం కింద గతేడాది రూ. 650 కోట్లతో 42 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ అందించినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోవడoతో కొత్తగా ఆరు లక్షల మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. వారందరికీ రూ.800 కోట్ల విలువైన జగనన్న కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. -
నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
-
సమరయోధుల పురిటిగడ్డ నాగుల్లంక
సాక్షి, పి.గన్నవరం : స్వాతంత్య్ర సంగ్రామంలో పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. 22 మంది పోరాట యోధులను స్వాతంత్య్ర ఉద్యమానికి అందించిన ఘనత ఈ గ్రామానికి దక్కుతుంది. నాగుల్లంకకు చెందిన ఉద్యమకారులు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర వహించి చరిత్రలో నిలిచారు. వీరిలో పలువురు జైలుశిక్ష కూడా అనుభవించారు. దీంతో పలువురికి నాటి ప్రభుత్వాలు తామ్రపత్రాలను అందించాయి. స్వాతంత్య్ర పోరాటంలో వీరి త్యాగానికి చిహ్నంగా 2002లో అప్పటి ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా నాగుల్లంకలో ‘స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపాన్ని’ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆరుమిల్లి వెంకటరత్నం, ఆరుమిల్లి విశ్వేశ్వరర రావు, ఆరుమిల్లి సుబ్బారావు, అడబాల నర్శింహ మూర్తి, గ్రంధి సూరన్న, ఆరుమిల్లి చౌదరి, ఆరుమిల్లి తాతయ్య, బద్దే ప్రకాశ రావు, గ్రంధి శ్రీరామ మూర్తి, గ్రంధి మూలాస్వామి, గ్రంధి సత్యం, కడలి పద్దయ్య, శ్రీఘాకోళపు వీరరాఘవులు, వలవల వీరన్న, మద్దా పెరుమాళ్లస్వామి, చిట్టినీడి మంగయ్య నాయుడు, ఆరుమిల్లి వెంకన్న, మీనపల్లి వెంకటరత్నం, చెన్ను ముత్యం, ఆకుల రఘుపతి, అద్దేపల్లి నర్సింహ మూర్తి, గద్దే లచ్చన్న పేర్లను ఈ స్థూపంపై చెక్కించారు. అప్పటి నుంచి ప్రతి ఆగస్టు 15న ఈ స్థూపం వద్ద గ్రామస్తులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఉద్యమకారులను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. -
కల్యాణం.. ‘కవలీ’యం
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వివాహమంటే కనుల పండుగ. అందులోనూ కోనసీమలో చేసే సందడి అంతాఇంతా కాదు. ఓ వేదికపై అంతకుమించిన సంబరంతో.. సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పెచ్చెట్టివారిపాలెం గ్రామం ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట మండలం మాచవరం శివారు పోతాయిలంకకు చెందిన మట్టపర్తి నాగేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ధర్మారావు, దుర్గారావు అనే కవలలు జన్మించారు. వారికి కవల వధువులతోనే వివాహం జరిపించాలనేది తమ తల్లి ధనలక్ష్మి కోరిక అని ఆమె పెద్ద కొడుకు లక్ష్మణ్ తెలిపారు. కొంతకాలం క్రితం ఆమె మరణించగా.. ధర్మారావు, దుర్గారావు వివాహ బాధ్యతను అన్నా వదినలైన లక్ష్మణ్, కళావతి తీసుకున్నారు. తండ్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కవల వధువుల కోసం వెతకసాగారు. సమీప గ్రామమైన పెచ్చెట్టివారి పాలెంలో కొప్పిశెట్టి బాలాజీ, శ్రీలక్ష్మి దంపతులకు జ్యోతి, స్వాతి అనే కవలలు ఉన్నారని తెలియటంతో వారింటికి వెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఆదివారం రాత్రి కవలలైన ధర్మారావు, దుర్గారావులకు కవల వధువులు స్వాతి, జ్యోతినిచ్చి వివాహం జరిపించారు. కవల వరులలో పెద్దవాడిగా భావించే ధర్మారావు హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుండగా.. దుర్గారావు బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహానికి హాజరైనవారు కవల జంటల్ని చూసి ఎవరు ధర్మారావు, ఎవరు దుర్గారావు, ఎవరు జ్యోతి, ఎవరు స్వాతి తెలుసుకోవడంలో ఒకింత తికమకపడ్డారు. -
మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం
-
జగన్నాథం.. ఏంటీ పని?
సాక్షి, పి. గన్నవరం: ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో సభ్యుడిగా కొనసాగుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఒక నాయకుడు తన స్థాయిని మరచిపోయారు. స్టేజ్ ఎక్కేసరికి సర్వం మర్చిపోయి ఓ మహిళతో కలసి స్టెప్పులేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు డొక్కా జగన్నాథం (నాధ్ బాబు) చేసిన ఈ పని చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. పి.గన్నవరంలో ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి పెద్దిరాజు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన స్థాయిని మరిచిపోయి స్టెప్పులు వేశారు. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సినీ ఆర్కెస్ట్రాలో ఓ మహిళతో ఆయన డాన్స్ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి బోర్డు సభ్యుడిగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఈరకంగా ప్రవర్తించడం అందరిని విస్మయానికి గురి చేసింది. పెళ్లిలో ఈయన వేసిన చిందులు కాస్తా సోషల్ మీడియా, వాట్సాప్‌ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. టీడీపీలో అందరికీ నీతిసూత్రాలు బోధించే జగన్నాథం స్టేజ్ ఎక్కేసరికి సర్వం మరచి స్టెప్పులు వేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం -
పి.గన్నవరంలో టీడీపీకి భారీ షాక్..!
సాక్షి, తూర్పుగోదావరి : ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న వేళ జిల్లాలో టీడీపీకి భారీషాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పిఠాపురంలో శనివారం జరిగే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు నారాయణమూర్తి అనుచరగణం వెల్లడించింది. పి.గన్నవరం టికెట్‌ను ఈసారి నేలపూడి స్టాలిన్‌కు కేటాయించడంపట్ల నారాయణమూర్తి తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంలో పడడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ఎమ్మెల్యేను బుజ్జగించే యత్నం చేశారు. రాబోయేరోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇప్పిస్తామని నచ్చజెప్పారు. ఇదే విషయాన్ని నేడు కాకినాడ రానున్న సీఎం చంద్రబాబుతో కూడా హామీ ఇప్పిస్తామని చెప్పారు. అయినప్పటికీ నారాయణమూర్తి తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. -
నీకోసం వెలిసిందీ.. ప్రేమ మందిరం!
అయినవిల్లి (పి.గన్నవరం): ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితంలో అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో మెలిగారు ఆ దంపతులు. ఏడాది కిందట భార్య మరణించగా ఆమె తీపి గురుతులు మరువలేని భర్త.. సంవత్సరీకాన్ని పురస్కరించుకొని భార్యకు ప్రేమ మందిరాన్ని నిర్మించాడు. ఊరు, వాడా.. ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు పంచాడు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువుకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోటూరి భైరవస్వామి భార్య సత్యవతి ఏడాది కిందట మృతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం గ్రామంలో ప్రేమ మందిరాన్ని రూ.3.5 లక్షలతో నిర్మించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ వెళ్లి ‘నా భార్య ప్రసాదాన్ని తిని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీర్వదించాలని కోరాడు. తన భార్య మృతి చెందిన సమయంలో అవయవ దానం కోసం అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి దేహాన్ని అప్పగించామని, మరణానంతరం తన దేహన్ని కూడా అమలాపురం కిమ్స్ వైద్యశాలకు దానం ఇచ్చేందుకు అంగీకార పత్రం రాసిచ్చానన్నారు. తన భార్య 55 ఏళ్ల ప్రేమ, అనురాగాలతో నడుచుకుందని, ఇందుకు నిదర్శనంగా ఈ ప్రేమ మందిరాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మించానని చెప్పారు. -
చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తున్నారు
-
ప్యాంటు తడిపేసుకున్న చంద్రబాబు!
సాక్షి, పి.గన్నవరం: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. షర్టు చేతులు పైకి మడిచి ఆయన యుద్ధం చేయబోతున్నారు.. మోదీని కడిగేసి, నిలదీస్తాడు... మిగతా ముఖ్యమంత్రులకు కనుసైగలు చేసి ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరిస్తారు... అంటూ ఆయన అనుకూల ఎల్లో మీడియా ఊదరగొట్టింది. ఈ ప్రేలాపలను చూసి మనకు మహాభారతంలోని ఉత్తరకుమారుడు గుర్తొస్తాడు. కౌరవులను ఇరిచేస్తా, తలపాగా కుచ్చిళ్లను తెంపుకొస్తా అని పెద్ద మాటలు మాట్లాడిన ఉత్తరకుమారుడు.. తీరా యుద్ధరంగానికి వెళ్లి ప్యాంటులోనే అన్నీ కార్చేసుకుంటాడు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశంలోనూ చంద్రబాబుది ప్యాంటు తడిపేసుకున్న పరిస్థితే!’’ అని ఎద్దేవా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 192వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చిలక-మోదీ గొరింక: ప్రత్యేక హోదా లేని కారణంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో చెప్పి, కేంద్రం నుంచి అందాల్సినవి డిమాండ్ చేయాల్సింది పోయి, ఉల్టా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పడంలోనే ఆయన ఆంతర్యం బయటపడుతుంది. ఇక్కడేమో హోదా కోసం పోరాటాలు, ధర్మదీక్షలు అంటాడు. తీరా ఢిల్లీకి పోయి వంగి వంగి మోదీకి సలాం చేస్తాడు. షేక్ హ్యాండ్ ఇవ్వకున్నా.. ప్రధాని ఎడమచేతిని పట్టుకోడానికి పాకులాడుతాడు. ఇక్కడేమో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినా, బీజేపీని ఆకాశానికెత్తేస్తూఉంటారు టీడీపీ ఎంపీలు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్తను చంద్రబాబు పక్కన పెట్టుకుంటాడు. బాలకృష్ణ సినిమా షూటింగ్‌కి వెంకయ్య నాయుడు వస్తారు. ఇదెక్కడి విడాకుల పర్వమో అర్థంకాదు! నాలుగేళ్లపాటు చిలకా గోరింకలు సైతం చిన్నబోయేలా సంసారం చేసి, హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి, ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటకాలకు తెరలేపారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగితే, ఈ పాటికి హోదా వచ్చేది. అది చేయకపోగా, రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దుర్మార్గుడికి బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బాబు పాలనలో కష్టాల కూపంలా కోనసీమ: గడిచిన నాలుగురోజులుగా ఇక్కడి రైతన్నలు, రైతు కూలీలు నన్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు. అన్నపూర్ణలాంటి కోనసీమ నుంచి ప్రజలు హైదరాబాద్, తమిళనాడు ప్రాంతాలకు వలసలు పోతున్నారని విని బాధపడ్డాను. తూర్పుగోదావరి జిల్లాలో 1.25లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట ఉంటే, అందులో 90 శాతం వాటా కోనసీమదే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొబ్బరి రేటు 4వేల రూపాయలు కిందకు పడిపోయిందని రైతులు చెబుతున్నారు. ప్రఖ్యాత అంబాజీపేట మార్కెట్లో ఒకప్పుడు 600 కొబ్బరి దుకాణాలుండేవి.. బాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల ఇప్పుడా దుకాణాల సంఖ్య 10కి పడిపోయింది. మహానేత వైఎస్సార్ హయాంలో కొబ్బరిపై ఉన్న నాలుగు శాతం పన్నును ఎత్తేశారు. ఇప్పుడేమో జీఎస్టీ పేరుతో 5శాతం పన్ను బాదుతున్నారు. కొబ్బరి వొలిచే కూలీల బతుకులైతే మరీ దయనీయం. మహానేతను స్మరించుకుంటున్న జనం: గోదావరి ఎంత వరమో, వరదలప్పుడు అంతే నష్టం చేస్తుంది, ప్రమాదాలు జరగొద్దంటే యేటి గట్లు కోతకు గురికాకుండా కాపాడుకోవాలి, ఆ విషయాన్ని ఎవరైన పట్టించుకున్నారంటే ఒక్క మహానేత వైఎస్సారే అని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. యేటి గట్ల పటిష్ఠత కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఘనత వైఎస్సార్‌ది. అదే గడిచిన నాలుగేళ్లలో చిన్న పనులు కూడా చేయట్లేదు. మంచి చేసినవారిని జనం ఎంతగా గుర్తుపెట్టుకుంటారో, ఏమీ చేయని వారిని అంతకంటే ఎక్కువే తిట్టుకుంటారన్నది వాస్తవం. నగరం స్మార్ట్ సిటీ హామీ ఏమైంది?: పచ్చగా ఉండ కోనసీమ గుండెల్లో అలజడి కూడా అంతే.. చమురు, సహజ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేస్తారు. గ్యాస్ పంపిణీ కోసం పొలాల మధ్య నుంచి పైపు లైన్లు. 2014లో నగరంలో గ్యాస్ లీకై 22 మంది చనిపోయి, 9 మంది తీవ్రంగా కాలిపోయిన పరిస్థితి. బీజేపీ-టీడీపీ దంపతులు నగరం గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా చేస్తామని చెప్పారు. 18 డిమాండ్లు నిరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ఆస్పత్రి అప్‌గ్రేడేషన్, శుద్ధీకరించిన మంచినీటి సరఫరా, ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు తదితర హామీలున్నాయి. కానీ ఇవాళ్టికీ కాలిన గాయాలతో ఆ 9 మంది కుటుంబాలు బాధపడుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీకి డబ్బులిస్తామన్న ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది’’ అని వైస్ జగన్ పేర్కొన్నారు. -
పి.గన్నవరంలో గడపగడపకు వైఎస్ఆర్సీపీ
తూర్పుగోదావరి: జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో శనివారం గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలైంది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. టీడీపీ హామీల వైఫల్యం, అవినీతిపై ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.