policy review
-
సాక్షి మనీ మంత్రా: ఆర్బీఐ బూస్ట్, సెన్సెక్స్ హైజంప్
Today Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల నార్జించిన సూచలు ఆర్బీఐ వడ్డీరేటు నిర్ణయంతో మరింత చీరప్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 19,653.50 వద్ద ముగిసాయి. క్యూఐపీ ద్వారా 10కోట్ల నిధుల సమీకరణ ప్లాన్ల నేపథ్యంలోబజాజ్ ఫిన్ సర్వ్ , బజాజ్ ఫైనాన్స్ షేర్లు జోరు నెలకొంది. రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, ఆటో, పవర్, హెల్త్‌కేర్ 0.4-1 శాతం చొప్పున పెరిగాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నష్టపోయిన వాటిలో హెచ్‌యుఎల్, ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ , ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 83.25తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 83.24 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటినుంచి (4వ తేదీన) ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అక్టోబర్ 6వ తేదీన (శుక్రవారం) ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని ఆర్బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం. -
గుడ్ న్యూస్ యథాతథంగా కీలక వడ్డీరేట్లు
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం అనంతరం గురువారం కీలక వడ్డీరేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2022-23లో జీడీపీ 7శాతం పెరిగిందని, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని గవర్నర్ అన్నారు. గ్లోబల్ ఎకానమీ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్-జూన్ 2023లో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. (ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు) తాజా రివ్యూలో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభి ప్రాయపడ్డారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రికార్డు స్థాయిలో 6.75 శాతానికి పెరగనుందనే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. -
RBI Policy review: రెపో రేటు పెంపు, ఈఎంఐలు మరింత భారం!
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు అనుగుణంగానే రెపో రేటు పావు శాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. అలాగే ఎంఎస్ఎప్ రేట్లు 25 బీపీఎస్ పాయింట్లు పెరిగి 6.75శాతానికి చేరింది. జీడీపీ వృద్ధి అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. 2023-24లో GDP వృద్ధిని 6.4శాతంగా అంచనా వేసింది ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం (ఫిబ్రవరి8, 2023) ద్రవ్య విధాన ప్రకటనను ప్రకటించారు. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటు, తాజా పెంపుతో కలిపి 250 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరగనున్న రుణ భారం తాజా రేట్ల పెంపు ప్రభావం అన్ని రకాల రుణాల రేట్లపై భారం పడనుంది. ఇప్పటికే వరుసగా పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా రుణ వినియోగదారులపై భారం పడుతున్న సంగతి తెలిసిందే -
గ్లోబల్ ట్రెండ్, ఆర్బీఐ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలరు జోరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సిరీస్ షురూ సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. పలు అంశాలు.. ఆర్బీఐ, ఎఫ్‌అండ్‌వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్‌పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు. ఎఫ్‌పీఐలు ఓకే పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. -
ఆర్బీఐ షాక్: ఇక ఈఎంఐలు భారమే!
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో 50 బీపీఎస్ పాయింట్లు మేర రెపోరేటును నిర్ణయాన్ని ఏకగగ్రీవంగా తీసుకున్నారు. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచకుండా ఉండవు. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్‌కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో సమస్య తప్పదు. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూలంగా ఉండనుంది. (చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్ హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి? -
ఆర్బీఐ పాలసీ రివ్యూ: 5.4 శాతానికి రెపో రేటు
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్లు మేర పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5.15 శాతానికి సర్దుబాటు చేసింది. జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని ఆయన చెప్పారు. కాగా గత మూడు నెలల్లో రెపో రేటును పెంచడం ఇది వరుసగా మూడోసారి. గవర్నర్ శక్తికాంత దాస్ నేృత్వత్వంలో మూడు రోజుల సమావేశాల అనంతరం కమిటీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రేటు పెంపునకే మొగ్గు చూపింది. -
హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం (ఎంపీసీ) ఆగస్టు 3 బుధవారం ప్రారంభం కానుంది. అయితే రెపో రేటు బాదుడు తప్పదనే అంచనాల మధ్య హోం లోన్ రేట్లు ఎంత పెరుగుతాయోననే ఆందోళన వినియోగదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ చెప్పేలా ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు, ఇటు నిపుణులు భావిస్తున్నారు. (నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తాజా రివ్యూలో రెపో రేట్లను పెంచే అవకాశాలపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 35-50 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. అంచనాలకనుగుణంగా రెపో రేటు పెరిగితే, అనివ్యారంగా బ్యాంకులు కూడా మొత్తం రేటు పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు పెరిగితే ఆర్బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీదే వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటిలోన్లపై భారం తప్పదు. ఉదా: రూ. 50 లక్షల రుణం, 7.65 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధితో ఉన్న లోన్‌పై వడ్డీ రేటు 0.50 శాతం పెంచితే, వడ్డీ రేటు 8.15కి పెరుగుతుంది అనుకుంటే, రుణ వ్యవధిని రెండేళ్లు పొడిగింపు ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే లోన్ కాలం రెండేళ్లు పొడిగించడంతో ఖచ్చితంగా రూ. 10.14 లక్షలు అదనపుభారం తప్పదు. ఒకవేళ చెల్లించాల్సిన కాలం కాకుండా, ఈఎంఐ భారాన్ని పెంచుకుంటే.. ఉదా: 20 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 50 లక్షల రుణంపై, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తే.. మునుపటి ఈఎంఐ రూ. 40,739తో పోలిస్తే రూ. 42,289 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈఎంఐ పెంచుకోవడమా, కాల వ్యవధిని పెంచుకోవడమా అనేది రుణగ్రహీత జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పటికే లోబడ్జెట్‌లో ఉండి ఉంటే పొదుపు, ఖర్చులపై దెబ్బపడకుండా లోన్ టెన్యూర్‌ను లేదా ఈఎంఐని పెంచుకోవడంమంచిది. అలాగే ఏ ఆప్షన్ ఎంచుకన్నా, దీర్ఘకాలిక రాబడి, భవిష్యత్తు అవసరాలకోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. పాలసీ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 5న) ప్రకటించనుంది. అయితే ఈ సారి రివ్యూలో కూడా రేటు పెంపు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మే 4, 2022 నుండి రెపో రేటును 0.9 శాతం పెంచింది. ఫలితంగా 6.72 శాతం వద్ద గృహ రుణం తీసుకున్న వారు ఇప్పుడు 7.62 శాతం చెల్లించాల్సి వస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడ్ రికార్డు స్థాయిలో 75 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచింది. అలాగే ఆ తరువాత కూడా పెంపు ఉంటుందనే సంకేతాలు అందించింది. -
కరోనా సెకండ్ వేవ్ : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్ విలయం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అంచనాకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండనుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా జీ-సాప్ 2.0 ను శక్తికాంత దాస్ ప్రకటించారు. జూన్ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నారు. ఫారిన్ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. అలానే దేశ జీడీపీని 9.5శాతంగా అంచనా వేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్ మెరుగ్గా ఉండనుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఇందుకుసకాలంలో వచ్చిన మాన్సూన్ నిదర్శనమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కన్పిస్తున్నా, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు గతంలో ఇచ్చినట్లుగా రూ.16 వేల కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు, ఆర్ధికంగా లిక్విడిటీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్! దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
మార్కెట్‌కు ఆర్బీఐ బూస్ట్ : బ్యాంకింగ్ షేర్లు దౌడు
సాక్షి, ముంబై: ఆర్బీఐ నిర్ణయం స్టాక్‌మార్కెట్‌కు మాంచి బూస్ట్‌లా పనిచేసింది. ఆరంభంనుంచి ఉత్సాహంగానే ఉన్న కీలక సూచీలు ఆ తరువాత మరింత జోష్‌గా కొనసాగు తున్నాయి. అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ విధాన నిర్ణయాన్ని వెలువరించిన వెంటనే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగిసి 49800 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 14862 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐవోబీ, కెనరా, యూనియన్ లాంటి ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అటు రియల్టీ, ఆటో రంగ షేర్లు కూడా ఉత్సాహంగా కొన సాగుతున్నాయి.డీఎల్ఎఫ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, శోభా, సుంటెక్ రియాల్టీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అశోక్ లేలాండ్, బాష్, మదర్సన్ సుమీ సిస్టమ్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ లాభపడుతున్నాయి. (RBI Monetary Policy: కరోనా ఉధృతి: ఆర్బీఐ కీలక నిర్ణయం) కాగా ఆర్బీఐ పాలసీ రివ్యు తాజా నిర్ణయంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగనున్నాయి. కోవిడ్-19 తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటుందన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటిన ఇన్వెస్టర్లుకు భరోసానిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
మార్కెట్లకు పాలసీ నిర్ణయాల ఊతం
ముంబై: పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాల సంకేతాలివ్వడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా 362 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ మళ్లీ 11,200 పాయింట్లకు చేరింది. గురువారం ఇంట్రాడేలో 558 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరికి 0.96 శాతం లాభంతో 38,025 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 11,200.15 వద్ద ముగిసింది. ‘దేశీ సూచీలు గరిష్ట స్థాయిల నుంచి తగ్గినప్పటికీ లాభాల్లోనే ముగిశాయి. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలు ఇందుకు కారణం. రేట్ల కోతపై అంచనాలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ మాత్రం రేట్లను యథాతథంగానే ఉంచింది. అయితే, వృద్ధి మెరుగుపడే దాకా ఉదార విధానాలు పాటించనున్నట్లు ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సూచనప్రాయంగా వెల్లడించింది. ఒకవేళ ద్రవ్యోల్బణం గానీ అదుపులోకి వస్తే రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానాన్ని మరికాస్త సడలించే అవకాశం ఉంది. ఆర్బీఐకి సంబంధించిన కీలక ఘట్టం పూర్తయిపోవడంతో ఇక మార్కెట్ వర్గాలు మళ్లీ కంపెనీల ఆదాయ అంచనాలు తదితర అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మిశ్రమంగా రియల్టీ, ఆటో సూచీలు.. వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంక్, రియల్టీ, ఆటోమొబైల్ స్టాక్స్ మిశ్రమంగా స్పందించాయి. బంధన్ బ్యాంక్ షేరు 3.57 శాతం, ఆర్బీఎల్ బ్యాంక్ 0.49 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.43 శాతం, ఎస్బీఐ 0.29 శాతం నష్టాల్లో ముగిశాయి. అయితే, సిటీ యూనియన్ బ్యాంక్ 2.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.97 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.24 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.44 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.39 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.19 శాతం పెరిగాయి. అటు ఆటోమొబైల్ స్టాక్స్‌లో టీవీఎస్ మోటార్ 2.22 శాతం, టాటా మోటార్స్ 1.13 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 0.49 శాతం, హీరో మోటోకార్ప్ 0.26 శాతం, అశోక్ లేల్యాండ్ 0.10 శాతం పెరిగాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా 0.75 శాతం, బజాజ్ ఆటో 0.67 శాతం, ఎంఆర్ఎఫ్ 0.42 శాతం క్షీణించాయి. బీఎస్ఈ ఆటో సూచీ 0.07 శాతం లాభపడింది. రియల్టీ సూచీ విషయానికొస్తే.. గోద్రెజ్ ప్రాపర్టీస్ 1.48 శాతం, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 1.35 శాతం, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ 0.31 శాతం క్షీణించాయి. రియల్టీ సూచీ 1.15 శాతం పెరిగింది. మరోవైపు, సెన్సెక్స్‌లో టాటా స్టీల్ అత్యధికంగా 3.82 శాతం మేర పెరిగింది. ఇన్ఫీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా తదితర షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ ఐటీ, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు పెరిగాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ రంగ షేర్ల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ సూచీలు 0.99 శాతం దాకా పెరిగాయి. అటు ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే అమెరికా డాలర్‌తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ దాదాపు గత ముగింపు స్థాయిలోనే 74.94 వద్ద క్లోజయ్యింది. గ్లోబల్ మార్కెట్లు.. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఖరారు కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు కనిపించాయి. హాంకాంగ్, టోక్యో సూచీలు నష్టపోగా, షాంఘై, సియోల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రారంభ సెషన్లో యూరప్ స్టాక్ ఎక్సే్ఛంజీలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. -
రియల్టీకి భారీ రిలీఫ్: వడ్డీరేట్లు యథాతథం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీరేట్లనుయథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్టుగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు. 5.15 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 4.90 శాతం వద్దే ఉంచింది. గురువారం ముగిసిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ కమిటీ రేట్లు యథాతథంగా ఉంచడానికే ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి రివ్యూ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యూ 4 కోసం సీపీఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 6.5 శాతానికి సవరించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాకు వివరించారు. ఇది 2020-21 మొదటి అర్ధభాగానికి 5.4-5.0 శాతం, 2020-21 మూడవ త్రైమాసికంలో 3.2 శాతం లక్ష్యాన్ని కూడా నిర్ణయించినట్టు తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ రేటు 5శాతం ఉంచింది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కరోనా వైరస్ తదితర పరిణామాల నేపథ్యంలో యథాతయథానికి మొగ్గు చూపినట్టు కమిటీ వ్యాఖ్యానించింది.. ప్రధానంగా ఉల్లి ధరలలో అసాధారణ పెరగడం ద్రవ్యోల్బణం టాప్ టాలరెన్స్ బ్యాండ్ కంటే పైకి ఎగిసిందని ఎంపీసీ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ ఈ రోజు కొన్ని చర్యలు ప్రకటించింది. ముఖ్యంగా కమర్షియల్ ఎస్టేట్ కంపెనీల ప్రాజెక్ట్ లోన్ల వ్యవహారంలో వాణిజ్య కార్యకలాపాల (డిసీసీఓ) ప్రారంభ తేదీని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. ప్రమోటర్ల నియంత్రణకు మించిన కారణాలతో ప్రాజెక్టులు ఆలస్యమైతే, సంబంధిత కంపెనీ ఆస్తి వర్గీకరణను తగ్గించకుండానే ఈ గడువును పొడిగించనుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం రియల్ రంగానికి భారీ ఊరట కల్పించిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని డిసెంబర్ 5 మధ్య జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ అసాధారణ నిర్ణయం తీసుకుంటుందా?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకోనుందా? కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో అసాధారణ అడుగు వేయబోతోందా? తాజా అంచనాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతం వద్ద అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేను ఈ సారి 0.35 శాతం లేదా 35 బేసిస్ పాయింట్లనుతగ్గించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. 0.25శాతం రేట్ కట్ ఉంటుందని ఇప్పటికే చాలామంది విశ్లేషకులు భావించినప్పటికీ ఏప్రిల్ మాస ద్రవ్యోల్బణం 2.92 శాతానికి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్ల కోతకు మొగ్గు చూపే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా మే నెలలో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి పెరగవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే గత నెలలో న్యూయార్క్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ 0.25 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేట్ కట్ ఉండవచ్చన్న ప్రసంగాన్ని సంస్థ గుర్తు చేస్తోంది. కాగా సోమవారం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్నాయి. రంజాన్ (ఈదుల్ ఫితర్) పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు . -
కీలక వడ్డీరేట్లు పావు శాతం కోత
సాక్షి, ముంబై: ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ఆధ్వర్యంలో జరిగిన తొలి సమీక్ష సమావేశంలో యథాతథ నిర్ణయానికి బ్రేక్ వేసి రేట్ కట్కు నిర్ణయించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) తీర్మానించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంనుంచి 6.25శాతానికి దిగి వచ్చింది. అలాగే బ్యాంకు రేటు 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణ అంచనాలను కూడా సవరించింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)లో నలుగురు రేటు కట్కు ఆమోదం తెలిపారని శక్తి కాంత దాస్ వెల్లడించారు. ఆరవ ద్వైమాసిక రివ్యూలో రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటు)ను 6.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో (వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.25శాతంనుంచి 6 శాతానికి తగ్గింది. దీంతోస్టాక్‌మార్కెట్లు పాజిటివ్ స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లు లాభపడుతున్నాయి. -
ఆర్బీఐ పాలసీ రివ్యూ: వడ్డీరేట్లు యథాతథం
సాక్షి, ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనకీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ నేడు (డిసెంబరు 5)న నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6.5శాతంగాను, రివర్స్ రెపో6.25శాతంగా ఉండనుంది. అయితే ఎస్ఎల్ ఆర్ రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. -
గృహ, వాహన లోన్లకు ఆర్బీఐ షాక్
సాక్షి, ముంబై: కీలక వడ్డీరేటును పెంచుతూ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం రుణగ్రహీతలకు భారంగా మారనుంది. వరుసగా రెండోసారి కూడా రెపో రేటు పెంపునకు మానిటరీ పాలసీ కమిటీ మొగ్గు చూపింది. కీలకమైన వడ్డీరేటు రెపోను పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారిటీ ప్రభుత్వం, ప్రయివేటు రంగ బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీరేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే పెంచిన వడ్డీరేట్లతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు వినియోగదారులపై మరింత భారం పడనుంది. రేటు పెంపుపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా కేంద్ర బ్యాంకు రెపో రేటును పెంచింది. గత నాలుగేళ్లలో మొదటిసారిగా గత రివ్యూలో రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయంతీసుకుంది. గత అయిదేళ్లలో రెపో పెంపు వరసగా ఇది రెండవసారి. కాగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పావు శాతం పెంచడంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. అటు రివర్స్ రెపోను 6 శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్) రేట్లను 6.75 శాతంగా నిర్ణయించింది. -
ఆర్బీఐ యాక్షన్ : మార్కెట్ల రియాక్షన్
సాక్షి, ముంబై: ఆర్బీఐ పాలసీ రివ్యూ ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న సూచీలు రెపో రేటు పెంపుతో డీలా పడ్డాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి 37,465ని, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 11,316ని తాకింది. వెంటనే తిరిగి పుంజుకున్నా ఊగిసలాట ధోరణి నెలకొంది. మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఆటో నష్టపోతుండగా, ఫార్మా, ఐటీ రంగాలు లాభపడుతున్నాయి. హిందాల్కో, వేదాంతా, ఐషర్, మారుతీ, టాటా స్టీల్, ఐబీ హౌసింగ్, యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఎయిర్టెల్ నష్టాలఓలనూ, కోల్ ఇండియా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫ్రాటెల్, ఐవోసీ, టీసీఎస్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ లాభాల్లోనూ కొనసాగుతున్నాయి. కాగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పావు శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఫలితంగా రివర్స్ రెపోను 6 శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్) రేట్లను 6.75 శాతంగా నిర్ణయించింది. -
ఆర్బీఐ కిక్: మార్కెట్లు హై జంప్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రివ్యూతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఆరంభంనుంచీ పాజిటివ్‌గా కీలక సూచీలు కీలక వడ్డీరేట్లను యథాతథంగాఉంచడంతో మరింత పుంజుకున్నాయి. సెన్సెక్స్ 552 పాయింట్లకు పైగా పుంజుకోని 33,571 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు ఎగిసి 10,308 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల షేర్లలో జోష్ నెలకొంది. నిఫ్టీ బ్యాంకు కూడా 500పాయింట్లకు పైగా ఎగిసింది. ఇంకా మెటల్, రియల్టీ, ఆటో లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటో కార్ప్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా బలాన్నిచ్చాయి. కాగా ఆర్బీఐగవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులపాటు పరపతి విధానాలను సమీక్షించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) యథాతథ విధానాల అమలుకే ఓటు వేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6 శాతంగా కొనసాగనుంది. అలాగే ఆర్బీఐ వద్ద బ్యాంకులు చేసే డిపాజిట్లపై లభించే వడ్డీ రేటు రివర్స్ రెపో సైతం 5.75 శాతంగా ఉంది. కాగా.. బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. దీంతోపాటు తొలి క్వార్టర్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. కాగా.. 2018-19లో రియల్ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషించింది. -
వడ్డీరేట్లు యథాతథం
-
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రివ్యూను ప్రకటించింది. ఆర్బీఐ చేపట్టిన త్రైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోను 6.0 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగానే ఉంచుతున్నట్టు తెలిపింది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యుల్లో అయిదుగురు యథాతథానికి ఓటు వేసినట్టు తెలుస్తోంది. దీంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పాజిటివ్ ధోరణి కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఖరి పరపతివిధాన సమీక్ష ఇది. దేశ వినియోగదారుల ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.21 శాతంతో 17 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. గ్లోబల్ అనిశ్చితి , ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల నిర్ణయంతో స్టాక్‌మార్కెట్లు స్పందిస్తున్నాయి. ఆరంభంలో డబుల్ సెంచరీ లాభాలను సాధించిన సూచీలు లాభనష్టాలమధ్య ఊగిసలాడుతూ ఫ్లాట్‌గా మారాయి. -
కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ నిర్ణయం నేడే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంక్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (బుధవారం ) పాలసీ రివ్యూను ప్రకటించనుంది. ముఖ్యంగా బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సమీక్షలో పాలసీ రేట్లను మార్చకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం మీడియా టెర్మ్ టార్గెట్‌ను రీచ్ అయినప్పటికీ కనీసం 2019 మధ్యవరకు అయినా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. ఆర్బీఐ కీలక ప్రస్తుతవడ్డీ రేట్లను కొనసాగిస్తుందని, రెపో 6 శాతం, రివర్స్ రిపో 5.75 శాతం వద్ద ఉంచుతుందనే అభిప్రాయం బడ్జెట్ ప్రకటన తర్వాత తీసుకున్న 60 మంది ఆర్థికవేత్తల పోల్‌లో వ్యక్తమైంది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో.. రాబోయే కాలంలో ధరల అదుపునకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లలో మార్పులను చేసే ఆలోచన చేయదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత 17 నెలలలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందని భావించారు. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వం ముందుగా చెప్పిన ద్రవ్య పరపతి మార్గాల నుంచి వైదొలగిందని, దీంతో ఆర్బీఐ రేట్లపెంపు ఒత్తిడి బాగా ఉందనీ, అయితే సమీప కాల వ్యవధిలో యథాతథాన్నే తాము ఆశిస్తున్నామని హెచ్డీఎఫ్సీ సీనియర బ్యాంక్ ఆర్థికవేత్త తుషార్ అరోరా పేర్కొన్నారు. బడ్జెట్లో తీసుకున్న కనీస మద్దతు ధరల పెంపు నిర్ణయం, జీడీపీ అంశాలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయని మరో ఎనలిస్ట్ శశాంక్ మెండిరట్టా వ్యాఖ్యానించారు. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాబోయే 12 నెలల్లో ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని మించకుండా ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్‌ఆయిల్ ధరలు కూడా ద్రవ్యోల్బణ పెరుగుదలకు కారణం అయింది. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచే చర్యల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచారు. అలాగే ఫిబ్రవరి 1 నాటి తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పెద్ద ఆర్థిక లోటు లక్ష్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ ఎఫెక్ట్: రికార్డ్ హైలో బ్యాంక్ నిఫ్టీ
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్బీఐ అనుసరించిన మరోసారి యథాతథ పాలసీ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్ 81 పాయింట్లు అధిగమించి 31271 వద్ద నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 9663 వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ ప్రకటన తో ప్రభుత్వ, ప్రయివేటుబ్యాంకులతోపాటు, హౌసింగ్ ఫైనాన్సింగ్ సెక్టార్లో లార్జ్ క్యాప్స్‌లో బైయింట్ ఇంట్రరెస్ట్ తో మార్కెట్లలో మంచి ర్యాలీ కనిపించింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 23,606ను తాకింది. తొలిసారి నిఫ్టీ 23,500పైన ముగిసింది. ఎస్బీఐ, పీఎన్బీ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులు పుంజుకున్నాయి. యాక్సిస్, ఐసీఐసీబ్యాంక్, కెనరా బ్యాంక్, లాభాలతో ముగిశాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లకు డిమాండ్ పుట్టింది. కేన్‌ఫిన్ హోమ్, పీఎన్బీ హౌసింగ్, జీఐసీ హసింగ్, గృహ్ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్ తదితరాలు లాభడ్డాయి. వీటితోపాటు అరబిందో ఫార్మ, ఆర్ఐఎల్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం వేదాంత లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ లాస్ట్ మినిట్‌లో లాభాల్లోకి మళ్లింది. ఐటీ ఇండెక్స్ పతనమైంది. అయితే చివరలో కొద్దిగా నష్టాలనుంచి కోలుకుంది. రిలయన్స్ లాస్ట్ మినిట్‌లో లాభాల్లోకి మళ్లి టాప్ విన్నర్‌గా నిలవడం విశేషం. అటు డాలర్ మారకంలో రుపీ 0.07 పైసల లాభంతో రూ.64.36 వద్ద ఉంది. పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో రూ.70 క్షీణించి, పదిగ్రా. రూ.29,497 వద్ద ఉంది. -
మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కిక్
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్బీఐ అనుసరించిన మరోసారి యథాతథ పాలసీ ఉదయం నుంచి వేచి చూసే దోరణితో ఉన్న ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో మిడ్ సెషన్ తరువాత ఫ్లాట్‌గా మారిన మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 82 పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 23 పాయింట్లు బలపడింది. ముఖ్యంగా పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడుతోంది. ముఖ్యంగా పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడుతోంది. దీంతో బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ స్థాయిని నమోదు చేయగా, పీఎన్బీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకు షేర్లు లాభాలనార్జిస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భారీగా పుంజుకున్నాయి. డీహెచ్ ఎఫ్‌ల్ పుంజుకుంది. ఫార్మా కూడా 1.5 శాతం లాభాలతో ఉంది. ఇంకా నిఫ్టీ దిగ్గజాలలో అరబిందో, రిలయన్స్, వేదాంతా, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్, మారుతీలా భాల్లోకొనసాగుతున్నాయి. అయితే మంగళవారం నాటి ట్రేడింగ్ లో బాగా బలపడిన ఐటీ ఇండెక్స్ నేడు కుదైలేంది. టీసీఎస్, టెక్‌మహీంద్రా, విప్రో, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ భారీగా క్షీణించాయి. -
ఆర్బీఐ పాలసీ సమీక్ష ప్రారంభం
నేడు విధాన ప్రకటన న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. బుధవారం విధాన ప్రకటన వెలువడనుంది. పావుశాతం రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6.25%)పై మిశ్రమ అంచనాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆర్బీఐ గవర్నర్ తనంతట తానుగా కాకుండా మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ ఏర్పడిన తరువాత జరుగుతున్న 3వ సమావేశం ఇది. ఎంసీపీకి ఆర్బీఐ గవర్నర్ నేతృత్వం వహిస్తున్నారు. రెపో విషయంలో కమిటీ రెండుగా చీలిపోతే, ఆయన నిర్ణయం కీలకం అవుతుంది. బీఓఎఫ్ఏ అంచనా పావుశాతం కోత... కాగా, పెద్ద నోట్ల రద్దు వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై పడిన ప్రభావాన్ని నిరోధించడానికి ఆర్బీఐ పావుశాతం రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ మంగళవారం పేర్కొంది. నోట్ల రద్దు వల్ల జీడీపీపై పావు శాతం నుంచి అరశాతం వరకూ ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని స్వయంగా ఆర్థిక సర్వే అంచనావేస్తున్న సంగతి తెలిసింది. -
కీలక వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబై: అంచనాలకనుగుణంగానే ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మంగళవారం మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో రేపోరేటు 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రేపోరేటు 6.75 శాతం నుంచి 6.50 పాయింట్లకు తగ్గించింది. రివర్స్ రెపోను పావు శాతం పెంచింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధులు) 4 శాతాన్ని యథాతథంగా ఉంచింది. రెపోరేటు 0.25 శాతం కోతతో గృహ, వాహన రుణాలు మరోసారి తగ్గడానికి మార్గం సుగమమైంది.