Special Feature
-
అయ్యోధ రామ మందిర గంటను చూశారా.. స్పెషల్ ఏంటో తెలుసా?
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఆలయ నిర్మాణం ఎంతో సంతృప్తికరంగా సాగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర తెలిపింది. ఇక, అయోధ్యలో వచ్చే ఏడాది జనవరిలో భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రామ మందిరం కోసం గంటను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మందిరంలోకి అష్టధాతువుతో తయారు చేసిన 2,100 కిలోల గంటను తయారు చేశారు. 6' X 5' పొడువు, వెడెల్పుతో ఉన్న గంటను మందిరంలో ప్రతిష్టించేందుకు ట్యూటికోరిన్ నుంచి అయోధ్యకు తీసుకువెళ్తున్నారు. కాగా, ఈ గంట స్పెషాలిటీ ఎంటంటే.. ఒక్కసారిగా బెల్‌ను వాయిస్తే గంట శబ్ధం దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందట. ఇక, గంటను జేసీబీ సాయంతో అయోధ్యకు తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The 2100 kgs and 6’ X 5’ Bell made of "Ashtadhatu" for Ram Mandir enroute Ayodhya from tuticorin. This Bell can be heard upto 15 kms. pic.twitter.com/6A0rtj3lPj — Megh Updates 🚨™ (@MeghUpdates) February 16, 2023 -
5జీ హుజూర్.. 4జీ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడతాయా?
మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. సెల్యులార్ టెక్నాలజీ విప్లవంతో అందరి చేతుల్లోకి సెల్ఫోన్లు వచ్చాయి. సాధారణ వాయిస్ కాల్స్‌కే జనం మురిసిపోగా.. అసాధారణ అవసరాలు సైతం సెల్ఫోన్లో చేరుతున్నాయి. 1990లలో 2జీ నెట్‌వర్క్‌తో మొదలైన మనిషి సెల్‌ఫోన్ ప్రయాణం.. 3జీ, 4జీని దాటుకొని ఇప్పుడు 5జీ మెరుపు వేగాన్ని అందుకొంటోంది. మనిషి జీవనాన్ని మరో మేలి మలుపు తిప్పడానికి ఇది దోహదం చేయనుంది. 5జీ అంటే..: సెల్యులార్ టెక్నాలజీలో ఐదో జనరేషన్‌ను సింపుల్‌గా 5జీ అంటున్నారు. 1జీ: 1980లో తొలి తరం(1జీ) మొబైల్ సేవలు మొదలయ్యాయి. బ్రీఫ్‌కేస్ సైజ్ ఉన్న ఫోన్లు, అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్న గ్రూపు సభ్యుల మధ్య కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగపడేవి. 2జీ: 1990లో రెండో తరం సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభమైంది. పర్సనల్ హ్యాండ్ సెట్లు వచ్చాయి. ఇవే సెల్ఫోన్లు. వీటితో వాయిస్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం సాధ్యమైంది. క్రమేణా ఎస్ఎంఎస్లు కూడా వచ్చాయి. 2జీ కాలంలో మొదలయిన సెల్‌ఫోన్.. మనిషి జీవితంలో భాగమైంది. 3జీ: 2000 సంవత్సరానికి సెల్‌ఫోన్ జేబులో ఇమిడిపోయింది. ఇంటర్నెట్ యాక్సెస్ సాధ్యమైంది. సెల్‌ఫోను లేనిదే అడుగు వేయలేని స్థితికి వచ్చింది. 4జీ: 2010కి సెల్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది. డేటా స్పీడ్ అనూహ్యంగా పెరిగింది. ఫోన్లో యాప్ స్టోర్లు చేరాయి. సోషల్ మీడియా ఉవ్వెత్తున ఎగిసింది. 5జీ ఉపయోగాలను ఊహించలేం - 2జీ వచ్చినప్పుడు డిజిటల్ వాయిస్ కాలింగ్ 1990 దశాబ్దంలో అత్యంత ఉపయోగకరమైన అంశంగా అందరూ భావించారు. ఎస్ఎంఎస్ అప్పుడు ఓ అద్భుతం. 3జీ ప్రవేశంతో ‘ఇంటర్నెట్ యాక్సెస్’ అద్భుతమైన అంశంగా నిలుస్తుందని అనుకున్నారు. అయితే సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ యాప్‌ల దశాబ్దంగా మారింది. 4జీతో రైడ్, షేరింగ్, ఫుడ్ డెలివరీ లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు వస్తాయని భావించారు. వాటితో పాటు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాలు, వీడియో కాలింగ్ వచ్చి అంతులేని వినోదాన్ని పంచుతున్నాయి. 5జీ ఇంకేమి సౌకర్యాలను తెస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ మెరుపువేగంతో డేటా ట్రాన్స్ఫర్ మానవ జీవితాన్ని మరింతగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 4జీ కంటే 5జీలో డేటా ట్రాన్స్ఫర్ వేగం 20 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాధారణ నెట్ 100 ఎంబీపీఎస్. 5జీలో సాధారణ వేగం 4–5 జీబీపీఎస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గంట పాటు డౌన్లోడ్ చేస్తున్న గేమ్స్ లాంటి వాటిని సెకన్ల వ్యవధిలో చేయచ్చు. ఏ రంగాల్లో మార్పులు వస్తాయి? - వినోద రంగంలో వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) సౌకర్యాలు మొబైల్ ఫోన్లలోకి వస్తాయి. - విద్యా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఆన్లైన్ టీచింగ్‌లో విద్యార్థులకు క్లాస్‌రూమ్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. కంటెంట్ సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి సహాయపడుతుంది. - వైద్య రంగంలోనూ అనూహ్య మార్పులు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి 108 (అంబులెన్స్)కు కాల్ చేసిన వెంటనే అంబులెన్స్‌తో పాటు సమీపంలోని ఆసుపత్రికి కూడా సమాచారం వెళుతుంది. డాక్టర్‌ను అలెర్ట్ చేస్తుంది. వేగంగా ఆసుపత్రికి చేరే మార్గాన్ని సూచించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆసుపత్రుల వివరాలను తెలియజేస్తుంది. - టెలి మెడిసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇప్పటికే దూసుకెళుతున్నాయి. 5జీ అందుబాటులోకి వస్తే డాక్టర్, రోగి ఒక దగ్గర లేకుండా కేవలం మొబైల్లో రియల్‌టైమ్ వీడియో ద్వారా చికిత్స లభిస్తుంది. - రోబోటిక్ సర్జరీల్లో మరిన్ని సంచలనాలకు దోహదం చేస్తుంది. ఆఫీసులో ఎదురుబొదురు కూర్చొన్నట్లుగా ఉండే వర్చువల్ మీటింగ్స్‌కు అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా సిబ్బంది మొత్తం ఆఫీసుకే వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ‘రిమోట్ టీమ్ ప్రొడక్టి్టవిటీ’ని పెంచుతుంది. - వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు వస్తాయి. ఫ్లెక్సిబుల్, నమ్మకమైన, సమర్థవంతమైన వ్యాపారానికి భూమికగా నిలుస్తుంది. డిమాండ్, సప్లైని బట్టి ఉత్పత్తి సం స్థలు ఆటోమేటిక్‌గా స్పందించే రోజు వస్తుంది. - పరిశ్రమల్లో సమస్యలను ‘డిజిటల్ నమూనా’ల్లో ముందుగానే గుర్తించొచ్చు. ఫలితంగా సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి, ఒకవేళ సమస్య తలెత్తినా వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. - వస్తు రవాణాను రియల్ టైమ్‌లో పరిశీలించొచ్చు. గోదాములు, పోర్టుల్లో ప్రతి వస్తువును ట్రాక్ చేయొచ్చు. - డ్రైవర్ లేని కార్ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుంది. - ‘స్మార్ట్ గ్రిడ్’ కాన్సెప్ట్ మరింత బలోపేతం అవుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది. - వ్యవసాయంలోనూ సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. మోటార్లను ఆన్/ఆఫ్ చేయడానికే కాకుండా, పొలం తడిసిన వెంటనే అలర్ట్ చేసే రియల్‌టైం మెకానిజం చౌకగా లభిస్తుంది. - డ్రోన్ల వినియోగం అత్యంత వేగంగా పెరుగుతుంది. వ్యవసాయం మొదలు అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం సులభం, చౌక అవుతుంది. 4జీ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడతాయా? 4జీ ఫోన్లలోని ప్రాసెసర్ 5జీ నెట్‌వర్క్‌కు ఉపయోగపడదు.. ప్రాసెసర్ అప్‌గ్రెడేషన్‌కు కంపెనీలు అవకాశం ఇస్తే, ఇప్పుడున్న ఫోన్లను చౌకగా మార్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ కూడా మార్చుకోవాలి. లేదంటే 5జీ ఫోన్లు కొనుక్కోవాలి. సిమ్ కార్డు కూడా 5జీకి మార్చాలి. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలో చైనా తొలి స్థానంలో ఉంటే, మనం రెండో స్థానంలో ఉన్నాం. ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. 2025 నాటికి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ మన దేశం రెండోస్థానంలో కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ని క్రియేట్ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్బుక్, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్ ఇలా.... ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ను క్రియేట్ చేసుకోవడానికి... ♦ మీ ప్రొఫైల్లోకి వెళ్లిన తరువాత స్క్రీన్ రైట్ కార్నర్‌లోని హంబర్గర్ మెనూ క్లిక్ చేయాలి. ♦ ఎకౌంట్–అవతార్‌లోకి వెళితే ‘అవతార్ మేకింగ్ స్క్రీన్’ ఓపెన్ అవుతుంది. ♦ స్కిన్ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి. ♦ మీ అవతార్‌కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్ టాప్‌రైట్ కార్నర్‌లోని ‘డన్’ క్లిక్ చేయాలి. ♦ ఫేస్స్ట్రక్చర్, హెయిర్ స్టైల్, నోస్షేప్... మొదలైన ఆప్షన్స్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది. స్నాప్‌చాట్+లో ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ మెసేజింగ్ అండ్ అప్డేట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ‘స్నాప్‌చాట్ ప్లస్ సబ్స్క్రిప్షన్’ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్ ఫీచర్లతో యాక్సెస్ కావచ్చు. రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఫర్ఎవర్, ఘోస్ట్ ట్రయల్స్ ఆన్ స్నాప్ మ్యాప్, సోలార్ సిస్టమ్...అనే ఆరు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్ ప్లస్ బ్యాడ్జ్, స్టార్లు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ -
స్క్రీన్ షాట్లు... ఇక కష్టమే!
సాక్షి, టెక్నాలజీ : ఇకపై ఖాతాదారుడి ప్రైవసీని కట్టుదిట్టం చేయాలని సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ భావిస్తోంది. సేవ్ ఆప్షన్ లేకపోవటంతో ఇంతకాలం స్క్రీన్ షాట్ల, రికార్డింగ్‌ల ద్వారా ఇతరుల పోస్టులను కొందరు సేవ్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇకపై అలా చేయటం కుదరదు. అందుకోసం ఓ ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం... ఒకవేళ మీరు ఇతరుల స్టోరీలను స్క్రీన్ షాట్ల రూపంలో సేవ్ చేయాలనుకుంటే వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాప్ అప్ నోటిఫికేషన్ వస్తుంది. ‘మీరు చేసే పని పోస్టు చేసేవారికి తెలిసిపోతుంది’ అని అందులో ఉంటుంది. ఒకవేళ మీరు ఓకే బటన్ గనుక క్లిక్ చేస్తే వెంటనే పోస్టు చేసిన వారికి అలర్ట్ వెళ్తుందన్న మాట. స్టోరీ వ్యూవ్స్లో కూడా ఎవరైతే స్క్రీన్షాట్ల రూపంలో మీ పోస్టులను సేవ్ చేస్తారో.. వారి పేరుతోపాటు సూర్యుడి ఆకారంలోని సింబల్ ఒకటి దర్శనమిస్తుంది. ఆ లెక్కన్న మీ స్టోరీలను స్క్రీన్ షాట్లు తీసేవారి వివరాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండొచ్చు. ఇదే తరహాలో వీడియోల రికార్డింగ్ విషయంలోనూ సేఫ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఇన్స్టాగ్రామ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండగా.. త్వరలోనే ఈ ఫీచర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
టీఎస్పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట!
పస్తుతం లక్షలాది విద్యార్థుల లక్ష్యం... టీఎస్పీఎస్సీ గ్రూప్స్! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు ఎంతో కసరత్తు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంత చేస్తున్నా జయాపజయాలపై సందేహాలు కలవరపెడుతున్నాయి. కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే పోటీ గురించి ఆందోళన చెందనవసరం లేదని, వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే గెలుపు మార్గం దిశగా, సాఫీగా సాగిపోవచ్చంటున్న సబ్జెక్టు నిపుణుల సలహాలతో ప్రత్యేక కథనం... గ్రూప్స్ అంటే ఖాళీలతో సంబంధం లేకుండా పోటీ లక్షల్లోనే ఉంటుందనేది నిస్సందేహం. ఉమ్మడి రాష్ర్టంలో గ్రూప్స్ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య దీనికి నిదర్శనం. తెలంగాణలో తొలిసారిగా జరగనున్న గ్రూప్స్ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించనుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలన్నీ గ్రూప్స్ ఔత్సాహికులతో నిండిపోయాయి. ఇంత తీవ్రంగా ఉన్న పోటీని చూసి, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సందిగ్ధత వీడి, సంసిద్ధత దిశగా నడవాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి దూరం.. దూరం! గూప్స్ ఔత్సాహికులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు తావివ్వకూడదు. పోటీ లక్షల్లో ఉన్నా పోస్ట్ సాధించాలనే గట్టి సంకల్పం, విజయం సాధించగలమనే నిండైన ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించగలరు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లగలరు. అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధానం. సమయ పాలన విషయంలో కొందరు ‘వారం ఆధారిత’ విధానాన్ని అనుసరిస్తారు. ఒక వారంలో ఒక సబ్జెక్టు, మరో వారం మరో సబ్జెక్టును చదువుతారు. ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని, రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది. అంతకుముందు చదివిన అంశాలను రివిజన్ చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి. గుర్తుంచుకోండిలా... చదివిన అంశాలన్నింటినీ గుర్తుంచుకోవటం కొంత కష్టమే. మెమరీ టిప్స్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ టిప్స్ అభ్యర్థుల స్వీయసామర్థ్యం మేరకు వేర్వేరుగా ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా చదివిన అంశాలను గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు జనరల్ సైన్స్‌లో ఏదైనా వ్యాధికి సంబంధించిన సమాచారం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ప్రచురించిన బొమ్మలు, సమాచార పట్టికలను మైండ్‌లో నిక్షిప్తం చేసుకుంటారు. చదివిన అంశాలను గుర్తుంచుకునేందుకు మరో మార్గం షార్ట్ నోట్స్ రూపకల్పన. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా, లేదా తమకు అనుకూలమైన రీతిలో (చార్ట్‌లు, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి.చదివిన అంశాలను ఇతరులతో చర్చించటం కూడా మెమరీ పరంగా బాగా ఉపయోగపడే విధానం. సొంత నోట్స్‌తో ప్రయోజనం సొంత నోట్స్ రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. నోట్స్ రూపకల్పనలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలి. చదివిన ప్రతి అంశాన్నీ నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. గణాంకాలు, సంవత్సరాలు, నివేదికలు-సిఫార్సులు వంటి ముఖ్యాంశాలను మాత్రమే రాసుకోవాలి. క్విక్ రివిజన్‌కు ఉపయోగపడేలా నోట్స్ రూపొందించుకోవాలి. అసలు చదువుతున్న అంశాల్లో ఏవి ముఖ్యమైనవనే సందేహం కలుగుతుంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించటం వల్ల ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ప్రశ్న అడిగే విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు కూడా ముఖ్యమైనవి. సీనియర్ ఫ్యాకల్టీ, గత విజేతలు సూచనల మేరకు ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. కష్టంగా కాదు.. ఇష్టంగా కొందరు అభ్యర్థులు పుస్తకాలను ముందేసుకొని, అది ఒక విధిగా, చాలా కష్టంగా భావిస్తూ చదువుతారు. ఇలాంటి దృక్పథం వల్ల తక్కువ సమయంలోనే అయిష్టత ఏర్పడుతుంది. దీనికి పరిష్కారం.. జాయ్‌ఫుల్ రీడింగ్. ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తూ చదవాలి. చదవటాన్ని, సబ్జెక్టు అధ్యయనాన్ని హాబీగా మార్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతుంటే దానికి సంబంధించిన మరో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. -
100 % లవ్
ప్రేమ.. ఇష్క్.. లవ్.. రెండక్షరాల కావ్య గీతిక రెండు మనసుల కలరుుక మనసెరిగి.. మనువుతో ముడివేసి.. మరణం వరకు వీడిపోని అనుబంధాల దీపిక జీవితం ఎన్నో బంధాల సమాహారమైతే.. అన్నింటిలోనూ అపురూపం ప్రేమబంధం.. మాటలకందని అనురాగ చిహ్నం.. మమతానురాగాల తారకమంత్రం.. మనసును ఊహల లోకంలోకి తీసుకెళ్లి కలకాలం.. చిరకాలం.. చిరస్మరణీయంగా నిలిపేదే ప్రేమ ప్రపంచం.. నేడు (శనివారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మనజిల్లాలో ప్రేమకు పట్టాభిషేకం చేసిన ప్రేమ పక్షులపై స్పెషల్ ఫీచర్.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం ‘మేమిద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి విషయం పెద్దలకు చెప్పాం.. మొదట్లో కాదన్నా తరువాత ఒప్పించాం.. వారే దగ్గరుండి మావివాహం జరిపించారు..’ అంటూ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, సుజాత దంపతులు ‘సాక్షి’తో తమ ప్రేమబంధాన్ని పంచుకున్నారు. 1993 మే ఒకటో తేదీన మా వివాహం జరిగింది. కులాంతర వివాహం. 22ఏళ్లుగా సుఖసంతోషాలతో జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు సిద్థార్థ, రవితేజ. ప్రేమ వివాహాలు బాధ్యతతో కూడినవి. ఏ సమస్య వచ్చినా స్వయంగా పరిష్కరించుకోవాలి. పెద్దల సహకారం ఉండదు. రక్షణ ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమ తప్పంటూ తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం మంచిది కాదు. ప్రేమికులు కూడా తల్లిదండ్రులను కన్వీన్స్ చేయాలి. ప్రేమను నిరాకరించిందని ప్రేయసిపై దాడులు చేయడం అవివేకం. ప్రేమ పెళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా పరస్పర అవగాహన లేకపోతే ఎక్కువ కాలం నిలవవు. కొన్ని సమయాల్లో సర్దుకుపోవాలి. అప్పుడే ప్రేమ వివాహం సాఫీగా జీవితాంతం సాగుతుంది.. అని ఆ జంట పేర్కొంది. ‘ప్రజాప్రతినిధి కావడంతో ఎక్కువ సమయం కుటుంబసభ్యులతో గడపలేని పరిస్థితి..’ అని ఉమా అంటే.. ‘పరిస్థితి తెలుసు కదా. అర్థం చేసుకుంటా..’ అంటూ సుజాత చెప్పి అన్యోన్య దాంపత్యానికి అర్థంగా నిలిచారు. - గాంధీనగర్ ఇది ప్రేమ విజయం ప్రేమ ఒక్కటే కాదు.. ప్రేమతో పాటు అనుబంధాలు కూడా ముఖ్యమేనని నిరూపించారు మధురానగర్‌కు చెందిన గంటా కరుణ్‌కుమార్, రేవతి దంపతులు. 2007లో మొదలైన వీరి ప్రేమకు మొదట్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యూరుు. కులాలు వేరు కావడంతో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. ‘నా’ అన్న వారిని బాధపెట్టి సుఖంగా ఉండలేమనుకున్న వారిద్దరూ పెద్దలను ఒప్పించాకే ఒక్కటవ్వాలని నిర్ణరుుంచుకున్నారు. అందుకు రెండేళ్ల పాటు కష్టపడ్డారు. చివరికి ప్రేమే విజయం సాధించింది. కరుణ్, రేవతి శ్రమ ఫలించి పెద్దలు అంగీకారం తెలిపి వారికి ఘనంగా వివాహం జరిపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారిద్దరూ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘మా దృష్టిలో ప్రేమకు, కుటుంబ సభ్యులకు, పెద్దలకు ప్రాధాన్యం ఒక్కటే. ప్రేమించిన తరువాత పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకోవడమే ముఖ్యం.’ - మధురానగర్ వైకల్యాన్ని ఎదిరించిన మనసులు ప్రేమకు పేదరికమే కాదు అంగవైకల్యం కూడా అడ్డుకాదని నిరూపించారు కొండపల్లికి చెందిన పఠాన్ షబ్బీర్‌ఖాన్, సనాభీతూన్. అందరూ ఖాన్‌లోని లోపాన్నే చూస్తే సన మాత్రం ఆయన మంచి మనసును ప్రేమించింది. రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న ఖాన్‌కు అండగా నిలిచింది. వీరి పెళ్లికి సన బంధువులు అడ్డుచెప్పినా ఎదిరించి 2010లో వివాహం చేసుకుంది. తరువాత కొద్దిరోజులకు ఖాన్, సన అన్యోన్య దాంపత్యానికి ముగ్ధులైన బంధువులు మనస్పర్థలు పక్కనపెట్టి కలిసిపోయూరు. ఇప్పుడు వారి ప్రేమకు గుర్తుగా కలిగిన ఇద్దరు మగపిల్లలతో సంతోషంగా బతుకుతున్నారు. - కొండపల్లి (ఇబ్రహీంపట్నం) విలువలు కలిగిన ప్రేమ అవసరం ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ, సమాజాన్ని అర్థం చేసుకోగల పరిణితి ఉన్నవారే ప్రేమలో విజయం సాధిస్తారు. ప్రేమ పేరుతో చిన్న వయసులోనే వ్యామోహంలో పడకుండా తొలుత చదువుపై దృష్టిపెట్టాలి. 18 సంవత్సరాలు దాటే వరకు ఆ ఆలోచన రాకూడదు. సరిగా అర్థం చేసుకునే యుక్త వయసులోని ప్రేమ మాత్రమే పరిపూర్ణమవుతుంది. ప్రేమిస్తే.. తల్లి దండ్రులకు చెప్పి ఒప్పించగలిగే ధైర్యం ఉండాలి. కులమతాలకతీతంగా ప్రేమ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు త్యాగం, సెల్ఫ్ డిసిప్లేన్ ప్రేమికులకు అవసరం. - పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణుడు మనసున మనసై.. బతుకున బతుకై.. ప్రేమలో ఆనందపు జల్లులే కాదు.. కష్టాల కడగండ్లు కూడా ఉంటారుు. నగరంలోని 51వ డివిజన్ కార్పొరేటర్ కోటిబోరుున దుర్గా భవానీ, మహేశ్‌ల ప్రేమకథ ఇందుకు మినహారుుంపేమీ కాదు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్న వీరు మొదట్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలుపెరగక శ్రమించిన ఈ జంట చివరకు విజయతీరాలకు చేరుకుంది. కులాలు ఒక్కటి కాకపోవడంతో వారిద్దరి ప్రేమను పెద్దవారు అంగీకరించలేదు. వారిని కాదని బయటకు రావడంతో ఆర్థికంగా ఆదుకునేవారే కరువయ్యూరు. బొమ్మల వ్యాపారం చేసినా అంతంత మాత్రంగానే సాగింది. అరుునా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మహేష్ తన భార్య దుర్గాభవానీని డిగ్రీ, పీజీ చదివించడంతో పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించారు. ఒకరికి ఒకరు సహకరించుకుని రాత్రనక, పగలనక కష్టపడి వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుర్గాభవానీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యూరు. - మధురానగర్