sravana bhargavi
-
కూతురితో సింగర్ హాలీడే ట్రిప్.. హేమచంద్ర ఎక్కడ?
బుల్లితెర సెలబ్రిటీలు చాలామందికి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సినీతారలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వైపు ఆకర్షితులై సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు. దీని ద్వారా తమ పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ టాప్ సింగర్ శ్రావణ భార్గవి ఈ మధ్య యూట్యూబ్ వీడియోలతోనే ఎక్కువ సందడి చేస్తోంది. అలాగే ఈ మధ్య పాడ్ క్యాస్ట్‌ల హవా ఎక్కువైపోవడంతో.. ఇదేదో బాగుందని ట్రై చేద్దాం అనుకున్నట్లు ఉంది. ఫ్లిప్‌సైడ్ విత్ శ్రావణ భార్గవి పేరిట నెల క్రితం పాడ్‌క్యాస్ట్ మొదలుపెట్టింది. ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.నీ భర్త ఎక్కడ?యూట్యూబ్ వీడియోలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ గాయని తన కూతురిని తీసుకుని హాలీడేకు చెక్కేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన జనాలు నీ భర్త హేమచంద్ర ఎక్కడ? అని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. హేమచంద్రను ఎందుకు వదిలేశారు? అని నిలదీస్తున్నారు. కొందరైతే మరీ హద్దులు దాటుతూ 'అయినా నువ్వు అతడికి ఏమీ సెట్ అవ్వలేదులే' అని సెటైర్లు వేస్తున్నారు. అప్పటినుంచి సింగిల్‌గానే..కాగా హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటగా కనిపించి రెండున్నరేళ్ల పైనే అవుతోంది. అప్పటినుంచి వీరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నా ఏనాడూ వాటిపై అటు హేమచంద్రకానీ, ఇటు శ్రావణ భార్గవి కానీ స్పందించనేలేదు. పైగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయలేదు. దీంతో నెటిజన్లు సైతం వీరు విడిపోయారని ఫిక్సయిపోయారు. View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) చదవండి: -
శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్
బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో 2010లో వచ్చిన సింహా చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' అంటూ సిల్వర్ స్క్రీన్‌పై తన వాయిస్‌తో మ్యాజిక్ చేశారు గాయని శ్రావణ భార్గవి. సంగీతంపై ఆమెకు ఉన్న ఆసక్తినే ప్రముఖ గాయనిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. కీరవాణి,దేవిశ్రీ ప్రసాద్, తమన్, చక్రి, మణిశర్మ, మిక్కీ జె మేయర్ ఇలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఆమె కలిసి పనిచేశారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఆమె టాలెంట్ చూపించారు. కెరీర్లో రాణిస్తున్న తరుణంలోనే ప్రముఖ సింగర్ హేమచంద్రతో శ్రావణ భార్గవి ఏడు అడుగులు వేశారు. మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ 2013లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. అయితే, వ్యక్తిగత కారణాలతో వీళ్లద్దరూ విడిపోయారని గతంలోనే పలు వార్తలు వచ్చాయి. ఆ వార్తలలో నిజం లేదనే అర్థం వచ్చేలా వారిద్దరూ అప్పట్లోనే తిప్పికొట్టారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ కలిసి ఎలాంటి ప్రొగ్రామ్ చేయడం కానీ.. ఒక వేదిక మీద కనిపించడం కానీ జరగలేదు. కొన్ని నెలలుగా శ్రావణ భార్గవి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా హేమ చంద్ర మాత్రం తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉన్నారు. (ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ ఆడియో లీక్.. క్రిమినల్ కేసు పెట్టిన దిల్‌రాజు) గతంలో వారిద్దరూ చాలా ప్రోగ్రామ్స్ జంటగా చేశారు.. కానీ కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి చేసిన ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. దీంతో వారిద్దరూ దాదాపు విడిగానే ఉన్నారు అనేది నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆమె హల్దీ ఫంక్షన్లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడమే. దీంతో ఆ ఫోటోలు చూసిన కొందరు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆ ఫోటోలు తన సొదరుడు అయిన హరీష్ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించినవి. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి చెందిన ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తూ.. ఆమెకు రెండో పెళ్లి అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆమె విడాకులే తీసుకోలేదు, వాటిపై క్లారిటీ ఇవ్వలేదు.. అంటే వారిద్దరూ భార్యాభర్తలే అని అర్థం. అలాంటిది రెండో పెళ్లి అని ఎలా రూమర్స్ క్రియేట్ చేస్తారని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’.. భీమ్స్ సాంగ్ అదిరింది
ఈ మధ్య కాలంలో తెలంగాణ జానపద గీతాలకు చిత్ర పరిశ్రమలో మంచి స్పందల లభిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఫోక్ సాంగ్స్ ఉంటున్నాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్గాను ఈ పాటలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నివృతి వైబ్స్ సంస్థ అత్యుత్తమమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆడియో, విజువల్ కంటెంట్‌తో ఫోక్ సాంగ్స్‌ని చిత్రీకరించి యూట్యూబ్‌లో రిలీజ్ చేసి హిట్ కొట్టేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలకు ఆడియన్స్‌ని నుంచి మంచి స్పందల లభించిన చింది. (చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? ) తాజాగా ఈ సంస్థ మరో తెలంగాణ జానపద గీతాన్ని మ్యూజిక్ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. (చదవండి: వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక ) బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్, ఇమేజ్ను దక్కించుకున్న జయతి ఈ సాంగ్‌లో అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సాంగ్ కు సంగీత సారథ్యాన్ని వహించారు. కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రావణ భార్గవి అద్భుతంగా ఆలపించారు. -
క్రేజీ అప్డేట్: బిగ్‌బాస్‌లోకి స్టార్ సింగర్స్ దంపతులు? వారెవరంటే..
దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు ఇటివలె స్టార్ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పాల్గొనే కొందరి కంటెస్టెంట్స్ పేర్లు రాగా తాజాగా ఓ స్టార్ జంట పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్గా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన ఈ స్టార్ సింగర్స్ ఈ సీజన్లో హౌజ్‌లో సందడి చేయబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ జంట ఎవరనేది ఇప్పటికే మీకో క్లారిటీ వచ్చినట్టుంది కదా. చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్! అవును మీరు అనుకుంటున్నట్టుగానే సింగర్ హేమచంద్ర ఆయన భార్య, గాయనీ శ్రావణ భార్గవిలు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారట. గత 3వ సీజన్లో వరుణ్ సందేశ్-వితిక దంపతులు హౌజ్‌లో అలరించిన సంగతి తెలిసిందే. అదే రిపీట్ చేస్తూ ఈ సారి హేమచంద్ర, శ్రావణ భార్గవిలను హౌజ్‌లోకి తీసుకువస్తున్నారట నిర్వహాకులు. ఇందుకోసం వారికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఇక వారు విడాకులు తీసుకుబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఈ జంట ఇప్పటికే ఖండిచింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? అయినప్పటికీ ఈ రూమర్స్ ఇంకా చెక్ పడలేదు. వారి మధ్య ఏదో జరుగుతుందంటూ శ్రావణ భార్గవి వ్యవహరం పట్ల పరువురు సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ జంట బిగ్‌బాస్ హౌజ్‌లోకి వస్తే ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే అంటున్నారు నెటిజన్లు. కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్ చేస్తూ షోని సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఇక ఈ ఆరవ సీజన్‌కు కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు సంబంధించిన విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారనే దానిపై సెప్టెంబర్ 4వ తేదీతో స్పష్టత రానుంది. -
సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి!
టాలీవుడ్లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. సంగీతంపై ఉన్న ఆసక్తితో సింగర్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 'సింహమంటి చిన్నోడో' అంటూ వెండితెరపై తన వాయిస్‌తో మ్యాజిక్ చేసింది. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్, దేవి శ్రీ ప్రసాద్, మిక్కీ జె మేయర్ వంటి తదితర ప్రముఖ దర్శకులతో కలిసి పాడింది. అలాగే స్టార్ హీరోలతోపాటు యువ కథానాయకుల సినిమాల్లో గాత్రం అందించింది. బుల్లితెర వేదికగా పలు సంగీతం కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రావణ భార్గవి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా అలరించింది. గబ్బర్ సింగ్, ఈగ, రామయ్యా వస్తావయ్యా సినిమాల్లో హీరోయిన్లకు వాయిస్ అందించిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరం ఉంటూ యూట్యూబ్ ఛానెల్లో భిన్నమైన వ్లోగ్స్ చేస్తూ నెటిజన్లు ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది కూడా. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తన గాత్రాన్ని వినిపించనుంది శ్రావణ భార్గవి. చదవండి: 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్ ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'లైగర్'. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో రొమాంటిక్ పాటగా వచ్చిన 'ఆఫత్' సాంగ్ తెలుగు వెర్షన్‌ను శ్రావణ భార్గవి ఆలపించింది. మంగళవారం (ఆగస్టు 16)న పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రావణ భార్గవి చివరిగా 2018లో వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో సింగర్‌గా ఆకట్టుకుంది. చదవండి: మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ చదవండి: సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖపట్నం త్వరలో పరిపాలన రాజధాని కానుందని ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం పేరిట అన్నివర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తూ ప్రస్తుత రాజకీయాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. ఆదివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, చివరకు వరద బాధితులను పరామర్శించడానికి వెళుతూ కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వరద నీటిని చూపించి తాగునీరు అంటూ మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని అన్నారు. వరద బాధితులను తక్షణ సహాయం అందిస్తూ ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. ఆ వివాదం టీటీడీకి సంబంధించినది కాదు శ్రావణ భార్గవి పాటల వివాదం టీటీడీకి సంబంధించినది కాదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిపై ఏవిధంగా స్పందిస్తామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కల్గించడం మహాపాపం అన్నారు. తొలి వాగ్గేయుకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నామని పేర్కొన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అన్నమయ్య ఏ మార్గాన్ని ఎంచుకుని నడుచుకుంటూ వెళ్లారో.. ఆ మార్గాన్ని మూడో మార్గంగా టీటీడీ అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా అన్నమయ్య పేరును ఒక జిల్లాకు పెట్టి అన్నమయ్యపై ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పామన్నారు. -
శ్రావణ మేఘాలు
శ్రావణమాసం కొద్దిరోజుల్లోనే రానుంది. ఇది ప్రకృతి మేఘమల్హరాలాపనతో పరవశించే మాసం. శ్రావణమాసానికి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకొంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకొనే మహిళలు పట్టుచీరలతోను, నగలతోను కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందుకే శ్రావణమాసాన్ని ‘నగల మాసం, శనగల మాసం’ అంటూ చమత్కరించారు ముళ్లపూడి వెంకటరమణ. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే, శ్రావణమాసంలో కనిపించే కారుమబ్బులు, అవి కురిపించే కుండపోత వర్షాలు ప్రకృతి గమనంలోని సహజ పరిణామాలు. మేఘసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు’ అంటూ కారుమబ్బుల అందాలను కళ్లముందు నిలిపారు కృష్ణశాస్త్రి. మేఘాల గురించి ‘గాథా సప్తశతి’లో ఒక అరుదైన, అపురూపమైన వర్ణన ఉంది. ‘అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ/ అపహుత్తో ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ’. అంటే, వర్షధారల దారాలతో భూమిని బంధించి పైకి లాగేయడానికి మేఘం విఫలయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మేఘం ఎంతో కష్టపడుతోంది. అందుకు నిదర్శనం– అది చేస్తున్న ఉరుముల హూంకారాలే! ఇంతటి కవి చమత్కారం మరే భాషా సాహిత్యంలోనూ కనిపించదు. మబ్బులు కమ్ముకున్నాక, అవి ఉరుములు ఉరమడం, మెరుపులు మెరవడం, చినుకులు కురవడం సహజమే! అలాగని ప్రతి మబ్బూ వాన కురుస్తుందనే భరోసా ఏమీ లేదు. మబ్బుల్లో నాలుగు రకాలు ఉంటాయని, అలాగే మనుషుల్లోనూ నాలుగు రకాలు ఉంటారని బుద్ధుడు తన శిష్యులకు ఎరుకపరచాడట! ఉరుములు ఉరిమినా చినుకు కురవకుండానే వెళ్లిపోయేవి ఒకరకం, ఉరుములు మెరుపులు లేకపోయినా చినుకులు కురిసిపోయేవి మరోరకం, ఉరుములు మెరుపుల సందడితో వాన హోరెత్తించేవి ఒకరకం, ఉరుముల శబ్దం చేయకుండా, చినుకైనా కురవకుండా తేలిపోయేవి ఇంకోరకం. మేఘాల స్వభావం లాగానే మనుషుల స్వభావాలూ ఉంటాయి. ఊరకే నీతులు చెబుతూ ఆచరించని వాళ్లు ఒక రకం, శాస్త్రాలు చదువుకున్నా వాటి సారాన్ని గ్రహించని వాళ్లు ఇంకో రకం. శాస్త్రాలు చదవకున్నా, ధర్మసారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు ఒకరకం, శాస్త్రాలు చదివి, వాటి సారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు మరోరకం. సాహిత్యంలోను, కళల్లోను మబ్బులు రకరకాల భావనలకు సంకేతాలుగా చలామణీలో ఉన్నాయి. దిగులుకు, దుఃఖభారానికి, అంతుచిక్కని రహస్యానికి, అనిశ్చితికి, ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా మబ్బులను పోల్చుతారు. అంతేకాదు, మబ్బులు క్షాళనకు కూడా సంకేతాలు. మబ్బులు కురిపించే వానలో నేల మీద ఉన్న చెత్తాచెదారం కొట్టుకుపోయినట్లే, దుఃఖ వర్షం తర్వాత గుండెలో గూడు కట్టుకున్న దిగులు కొట్టుకుపోయి మనసు తేటపడుతుందని కొందరి భావన. ‘భారమైన హృదయాలు దట్టమైన మబ్బుల్లాంటివి. వాటి నుంచి కాస్త నీటిని బయటకు పోనిస్తేనే మంచిది. అప్పుడే ఊరట చెందుతాయి’ అంటాడు అమెరికన్ రచయిత క్రిస్టఫర్ మోర్లే. మేఘతతులు ఎరుకకు, పరివర్తనకు, కలలకు కూడా సంకేతాలు. అయితే, ఎక్కువగా మబ్బులను దిగులుకు, ప్రతికూలతలకు సంకేతంగానే భావిస్తారు. సాహిత్యంలోనూ ఇలాంటి వర్ణనలే కొంత ఎక్కువగా కనిపిస్తాయి. ‘భారమైన మేఘాలు నక్షత్రాలను ఆర్పేస్తున్నాయి’ అని తన ‘నైట్ ఫ్లైట్’ నవలలో వర్ణించాడు ఆంటోయిన్ డి సెయింట్ ఎక్సు్యపెరీ. పైలట్‌గా పనిచేసినప్పుడు నక్షత్రాలను మేఘాలు కమ్మేసిన దృశ్యాలను క్లోజప్‌లో చూసిన అనుభవం ఉన్నవాడాయన. దట్టంగా కమ్ముకున్న మబ్బులు పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను కనపించనివ్వవు. అలాగని ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు అదృశ్యమైపోవు. తాత్కాలికంగా అలా అనిపిస్తాయంతే! మబ్బులు మటుమాయం కాగానే, మళ్లీ తమ సహజకాంతులతో కనిపిస్తాయి. గుండెలోని గుబులు, మనసులోని దిగులు కూడా అంతే! దిగులు మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన మనసులోని ఆశలు పూర్తిగా అడుగంటిపోవు. అందుకే, ‘మబ్బులకు ఆవల సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు’ అంటాడు అమెరికన్ రచయిత పాల్ ఎఫ్. డేవిస్. ఉరిమే ప్రతి మబ్బూ కురవదని లోకోక్తి. వ్యర్థ ప్రసంగాలతో హోరెత్తించే వారికి ఇది చక్కగా వర్తిస్తుంది. ‘వాగ్దానం మబ్బు మాత్రమే, అది నెరవేరినప్పుడే వాన కురిసినట్లు’ అని ఇంగ్లిష్ సామెత. వాగ్దానకర్ణులైన రాజకీయ నాయకులకు ఇది అక్షరాలా సరిపోతుంది. ‘ఎంతటి రాగి గొలుసులతోనైనా మబ్బులను బంధించలేము’ అనే సామెత కూడా ఉంది. నింగిలోని మబ్బులు స్వైరవిహారం జరిపే స్వేచ్ఛాసంచారులు. వాటి మానాన అవి ముందుకు సాగుతూనే పోతాయి. ప్రపంచంలో వాటిని బంధించే శక్తి ఏదీ లేదు. ఎక్కడైనా, ఎవరైనా స్వాభావికమైన స్వేచ్ఛను బంధించబూనితే, దాని పర్యవసానం మేఘవిస్ఫోటం కూడా కావచ్చు! ఇటీవల శ్రావణ భార్గవి అనే గాయని అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుని పదాన్ని పాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అనవసర దుమారానికి దారితీసింది. కొందరి అభ్యంతరాల ధాటికి ఆమె వెనక్కు తగ్గి, ఆ వీడియోను తొలగించింది. ఈ దుమారం సద్దుమణిగినా ఇదంత మంచి సంకేతం కాదు. ప్రజాస్వామ్య ప్రభలను మూకస్వామ్య దౌర్జన్యపర్జన్యాలు కబళించడం వాంఛనీయం కాదు. -
అన్నమయ్య సంకీర్తనలను కించపరిచేలా సింగర్ భార్గవి వ్యవహరించింది
-
దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్..
Singer Sravana Bhargavi Deleted Okapari Song: టాలీవుడ్లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. తన యూట్యూబ్ ఛానెల్లో విభిన్నమైన వ్లోగ్స్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. అయితే ఆమె గతకొంతకాలంగా వివాదస్పదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి పేరు మారుమోగిపోతోంది. ఇందుకు కారణం ఆమె చిత్రీకరించిన 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోనే. అన్నమయ్య కీర్తనను వెకిలీ చేష్టలతో చిత్రీకరించి వీడియో రిలీజ్ చేసిందని అన్నమయ్య వంశస్తులు ఆమెపై మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆమె చేసిన వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్న అశ్లీలంగానే కనిపిస్తుందని శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కదని, అందుకే వీడియోను డిలీట్ చేసేది లేదని తేల్చిచెప్పింది. ఇక తీవ్ర ఆగ్రహానికి లోనైన తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు. చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ దీంతో చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ నుంచి 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏందయ్యా రాహుల్ ఈ తమాషా.. నటుడి న్యూడ్ పిక్ వైరల్ -
కాళ్లు పైకెత్తి ఊపడమేంటి? బొట్టు లేదు, మెట్టెలు లేవు: కరాటే కల్యాణి
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె రిలీజ్ చేసిన ఒకపరి పాట పెద్ద వివాదంగా మారింది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి స్పందించింది. 'శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు. ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు. కె.విశ్వనాథ్ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు నేను పుట్టలేదు. వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే! భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే!' అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. మరోవైపు ఏదేమైనా సాంగ్ డిలీట్ చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు ఆ పాటను తొలగించడం గమనార్హం. చదవండి: నా జీవితంలో ఆనందం, ప్రశాంతత లేకుండా పోయాయి మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల -
సింగర్ శ్రావణి భార్గవి ఆడియో లీక్
-
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
వివాదంలో గాయని శ్రావణ భార్గవి
-
చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక
Annamayya Family Fires On Sravana Bhargavi: అనేక గీతాలను ఆలపించి టాలీవుడ్ ప్రముఖ సింగర్‌గా గుర్తింపు పొందింది శ్రావణ భార్గవి. అయితే గత కొద్ది కాలంగా ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తాజాగా వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం ఆమె పాడిన పాటే. విషయంలోకి వెళితే..తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది. శృంగార సంకీర్తన పట్ల గాయని శ్రవణా భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు మండిపడుతున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు. అలాగే ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతరాహిత్యంగా సమాధానిచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. -
విడాకుల వార్తలపై స్పందించిన హేమచంద్ర దంపతులు!
టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే! కొన్నినెలల నుంచి వీరికి మాటల్లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై హేమచంద్ర దంపతులు స్పందించారు. నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ హేమచంద్ర సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అటు శ్రావణ భార్గవి సైతం స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోలకు వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది' అని రాసుకొచ్చింది. మొత్తానికి విడాకులనేవి వట్టి పుకారు మాత్రేమనని సింగర్స్ కుండ బద్ధలు కొట్టారని కొందరు నెటిజన్లు అంటుంటే, ఇప్పటికీ సరిగా క్లారిటీ ఇచ్చినట్లు కనిపించడం లేదని మరికొందరు అంటున్నారు. కాగా శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by Vedala Hemachandra (@vedalahemachandra) చదవండి: మీనా భర్త హఠాన్మరణం పట్ల సెలబ్రిటీల సంతాపం.. ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది: డైరెక్టర్ -
లక్కీ లవ్
ప్రముఖ నేపథ్య గాయకులు శ్రావణ భార్గవి, హేమచందర్లతో రూపొందిన లఘుచిత్రం ‘లక్కీ లవ్’. ప్రేమకు మంచి నిర్వచనమిస్తూ తీసిన అందమైన ఆమని కావ్యం ఈ మూవీ. లవ్ నిజంగానే లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో ఇష్టంగా ఒకరినొకరు ప్రేమించుకున్నప్పటికీ, వాస్తవ ప్రపంచంలోకి వ చ్చేసరికి ఆ ప్రేమ కాస్తా విఫలమైపోతుంటుంది. అలా విఫలం కాని ప్రేమే ఈ లక్కీ లవ్. నిజ జీవితంలోనూ భార్యాభర్తలైన హేమచందర్, శ్రావణభార్గవి ఇందులో ఎంతో సహజంగా నటించారు. అందంగా కనిపించారు. దీన్ని ఓ అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్డాడు దర్శకుడు సుశాంత్ చింతకింది.రెండు రోజులకే ఈ షార్ట్ ఫిల్మ్ వ్యూయర్స్ 60 వేలు దాటింది. మంచి సంగీతం, కెమెరా, మాటలు, లొకేషన్స్, ఎక్స్ప్రెషన్స్... అన్నీ అద్భుతంగా కుదిరాయి ఇందులో. ‘22 వరకు ఏ అమ్మాయికైనా తన తండ్రే అన్నీ. 24 ఏళ్లు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా పెళ్లనే భయం ఏర్పడుతుంది. నాకొచ్చే అమ్మాయికి మాత్రం రాజ్యం మారుతుంది కానీ, స్థానం మారదు. యూ ఆర్ మై ప్రిన్సెస్’ అని చెప్పిన ఈ డైలాగుతో భర్త కాబోయే భార్యను ఏ విధంగా చూసుకోవాలో చూపాడు ఈ దర్శకుడు. నిజమైన ప్రేమ అందరికీ దక్కదు. దొరికినప్పుడు ఎన్ని ఒడిదుడుకులెదురైనా కలిసే ఉండాలి... అంటూ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. హైదరాబాద్ గీతం యూనివ ర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన సుశాంత్ చింతకింది తీసిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ ఇది. తనకు సినిమాలంటే చాలా ఇష్టమనీ, ఆ ప్యాషన్‌తోనే స్నేహితులందరితో కలిసి ఈ ఫిల్మ్ తీశానని చెప్పాడు. తొలి షార్ట్ ఫిల్మే అయినా... హేమచందర్, శ్రావభార్గవ్ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారని దర్శకుడు అభినందనలు కురిపించాడు. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి వాళ్లు ఈ చిత్రం చేసినందుకు ప్రత్యేకంగా హేమచందర్, శ్రావణ భార్గవి జంటకు కృతజ్ఞతలు’ చెబుతున్నాడు ఈ యువ దర్శకుడు. డా. వైజయంతి -
మేమిద్దరం హీరో హీరోయిన్లుగా చేస్తున్నాం!
శ్రావణ భార్గవిని కేవలం సింగర్ అనే చెప్పలేం. ఆమె పాటలు రాస్తుంది. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. గాత్రదానం చేస్తుంది. భర్త హేమచంద్రతో కలిసి అనేక టీవీ షోస్ చేస్తోంది. త్వరలో నటిగా కూడా నిరూపించుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రావణ భార్గవి ‘సాక్షి’కి చెప్పిన ముచ్చట్లు. ఓ వైపు పాటలు, మరో వైపు టీవీ షోలు... మీ భార్యాభర్తల కెరీర్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నట్లుంది? అవునండీ... ఇద్దరం ఒకే వృత్తిలో ఉండటం వల్ల వచ్చే సౌలభ్యం ఇదే. మొన్నటిదాకా ‘బోల్ బేబీ బోల్’కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం. ఇప్పుడు అదే కార్యక్రమానికి మేం న్యాయనిర్ణేతలం. ఇంకో వైపు స్టేజ్ షోలు. ఇక సినిమా పాటలు ఎలానో ఉన్నాయి. అడపా దడపా డబ్బింగులు కూడా చెబుతున్నా. ‘గబ్బర్‌సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్‌కి డబ్బింగ్ చెప్పాను. ‘ఈగ’ సినిమా ‘హిందీ’లో ‘మక్కీ’ పేరుతో అనువాదమైతే, అందులో సమంతకు డబ్బింగ్ చెప్పాను. వీటితో పాటు ఈ ఏడాది మరో కొత్త నిర్ణయం తీసుకున్నాం. అదే యాక్టింగ్. హైదరాబాద్ ‘గీతం’ కళాశాల విద్యార్థులు ఓ లఘు చిత్రం ప్రతిపాదన మా ముందుకు తెచ్చారు. పేరు ‘లక్కీ లవ్’. ఈ లఘు చిత్రంలో నన్ను, నా భర్త హేమచంద్రను హీరోహీరోయిన్లుగా నటించమని అడిగారు. కాన్సెప్ట్ నచ్చడంతో ‘ఓకే’ చేశాం. షూటింగ్ అయిపోవచ్చింది. త్వరలో ఆ షార్ట్‌ఫిలింకి సంబంధించి మేం పాడిన పాటను అధికారికంగా విడుదల చేయబోతున్నాం. నటించమని ఇంతకు ముందేమైనా అవకాశాలొచ్చాయా? మా ఇద్దరికీ చాలా అవకాశాలొచ్చాయండీ. పెద్ద పెద్ద డెరైక్టర్లే కొన్ని పాత్రల కోసం మమ్మల్ని అడిగారు. కానీ... పాత్రలు నచ్చకపోవడం వల్ల చేయలేదు. సరైన అవకాశం వస్తే సినిమాల్లో కూడా నటించాలని ఉంది. అసలు మేం నటించగలమా? లేదా? అనేది ఈ లఘు చిత్రం చెప్పేస్తుంది. పాటలు కూడా రాసినట్టున్నారు? అవును. ‘బద్రినాథ్’ సినిమా కోసం ‘ఇన్ ది నైట్’ అనే ఇంగ్లిష్ పాట రాశాను. ఆ పాట పాడిందీ నేనే. తర్వాత ‘ఈగ’ హిందీ వెర్షన్ ‘మక్కీ’ కోసం ఓ హిందీ పాట రాశాను. మరి తెలుగు పాట ఎప్పుడు రాస్తారు? రాయాలనుంది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. సాహిత్యం మీద పట్టుందా? అలాంటిదేం లేదు. చిన్నప్పటి నుంచీ చదువుకున్న తెలుగే నాతో పాట రాయిస్తుందని నమ్మకం. అసలు కళలపై మమకారం ఎలా మొదలైంది మీకు? మా అమ్మానాన్న నాలో ఏం గమనించారో నాకు తెలీదు కానీ, నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడే నాకు ఇష్టం లేకపోయినా... బలవంతం చేసి మరీ క్లాసికల్ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేశారు. చేరి నాలుగేళ్లు గడవగానే... నాకు తెలీకుండానే సంగీతంపై మమకారం మొదలైంది. అయిదేళ్ల పాటు కర్ణాటక సంగీతం అభ్యసించాను. ‘సప్తస్వరాలు’ టీవీ కార్యక్రమంలో ఫస్ట్ రన్నర్ నేనే. ఆర్పీ పట్నాయక్‌గారు జడ్జ్. ఆయనకు నా పాట నచ్చడంతో నన్ను రమణగోగుల గారికి పరిచయం చేశారు. ఆయన నిర్మించిన ‘బోణీ’ చిత్రంతో ప్లేబ్యాక్ సింగర్‌గా నా కెరీర్ మొదలైంది. మీకు పేరు తెచ్చిన పాటలు? చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ‘సింహా’లోని ‘సింహమంటీ చిన్నోడే... వేటకొచ్చాడే’ పాటైతే నాకు చాలామంచి పేరు తెచ్చింది. అలాగే ‘రాజన్న’ చిత్రంలోని ‘లచ్చమ్మా...’ పాట కూడా. కీరవాణిగారు నాతో పాడించిన ప్రతి పాటా నాకు మంచి గుర్తింపునిచ్చింది. గొంతు మార్చి భలే గమ్మత్తుగా పాడతారే. ఎక్కడ నేర్చుకున్నారీ విద్య? వాయిస్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అనుభవంతో వస్తాయి. నాకు పేరు రావడానికి అదీ కారణమే. అసలు మీ స్వస్థలం ఎక్కడ? నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే ఇంజినీరింగ్ చదివాను. హేమచంద్రతో మీ ప్రేమ ఎలా మొదలైంది? ‘రైడ్’ సినిమాకు అతనే సంగీత దర్శకుడు. ఆ సినిమాకు ట్రాక్ పాడటానికి వెళ్లినప్పుడు తొలిసారి తనను కలిశాను. అప్పట్నుంచీ దూరంగా ఉన్నా... ఎస్సెమ్మెస్‌లతో టచ్‌లో ఉన్నాం. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నట్లు మాకు తెలుస్తోంది కానీ, వ్యక్తపరచడానికి మాత్రం ఇద్దరికీ ధైర్యం చాలలేదు. చివరకు తనే ప్రపోజ్ చేశాడు. మా ఇద్దరి పేరెంట్స్ మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా.. తర్వాత ‘ఓకే’ అనేశారు. ఇప్పుడు మా లైఫ్ కలర్ఫుల్గా ఉంది. పైగా మా అత్తయ్య శశికళాస్వామిగారు కూడా కళాకారిణే. అత్తగారింటి నుంచి కూడా నాకు మంచి ప్రోత్సాహం. అసలు నాకు పుట్టింట్లో ఉన్నట్టే ఉంది. ఇద్దరూ సంపాదనపరులే. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉన్నారు. మీ మధ్య అభిప్రాయభేదాలు రాలేదా? నాకు కొండంత నైతిక మద్దతు నా భర్త. ఆయన ఏదైనా కష్టమైన పనికి పూనుకుంటే నేను భార్యగా ఆయనకు అండగా ఉంటా. ఒకరినొకరు అర్థం చేసు కుంటే, ఇక అభిప్రాయభేదాలకు తావెక్కడ ఉంటుంది. హేమచంద్ర పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట? ‘బాణం’ సినిమాలో పాడిన ‘నాలో నేనేనా’ పాట గురించే అందరూ చెబుతుంటారు. నాకైతే మాత్రం... ‘శక్తి’ సినిమాలోని ‘ప్రేమదేశం యువరాణీ...’ పాటంటే పిచ్చి. ఎందుకంటే... ఆ పాట వింటుంటే... తను నన్నే దృష్టిలో పెట్టుకొని పాడేడా అనిపిస్తుంది. బుర్రా నరసింహ -
గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం
చిట్యాల, న్యూస్‌లైన్: సినీ గాయని శ్రావణభార్గవి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీ యరహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటి లో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బుధవా రం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. శ్రావణి ప్రమాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల శివారులో రాంగ్రూట్లో ఓ ట్రాక్టర్ రాగా, దాన్ని తప్పించబోయిన శ్రావణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు టైరు పగిలి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆనంతరం ఆమె భర్త, గాయుకుడు హేమచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని, శ్రావణభార్గవిని మరో కారులో విజయవాడకు తీసుకెళ్లారు.