video game
-
ఆటల రాజ్యంలో.. గెలుపు పాట!
గేమ్ ప్లేలోకి వెళితే... యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘ఫైనల్ ఫాంటసీ’లో క్లైవ్ రాస్పెల్ అవుతారు. సాహస దారుల్లో ప్రయాణం చేస్తారు. జియోలొకేషన్–బేస్డ్ రోల్‌ప్లేయింగ్ గేమ్ ‘డ్రాగన్ క్వెస్ట్ వాక్’లోకి వెళ్లి మాన్స్టర్లతో తలపడతారు. హిట్ పాయింట్స్ కొడతారు. గేమింగ్ జోన్లోకి అడుగు పెడితే యూత్‌కు ఉత్సాహమే ఉత్సాహం. నిన్నటి వరకు అయితే ‘గేమింగ్’ అనేది యూత్‌కు ప్యాషన్ మాత్రమే. ఇప్పుడు మాత్రం ఫ్యాన్సీ కెరీర్ కూడా. గేమ్ డెవలపర్ నుంచి నెరేటివ్ డిజైనర్ వరకు ఎన్నో అవకాశాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు చేయడం నుంచి పుస్తకాలు చదవడం వరకు ఎన్నో విధానాల ద్వారా గేమింగ్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలపై పట్టు సాధిస్తున్నారు...వీడియో గేమ్స్ అనేవి యూత్‌కు ఇక ‘జస్ట్ ఫర్ ఫన్’ ఎంతమాత్రం కాదు. తమకు నచ్చిన రంగంలోనే యువత ఉపాధి అవకాశాలు చూసుకుంటోంది. వీడియో గేమ్‌లపై అంతకంతకూ పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో డెవలపర్లు, డిజైనర్లు, టెస్టర్స్... మొదలైన నైపుణ్యవంతులకు డిమాండ్ పెరిగింది.‘గేమింగ్ అనేది ఇప్పుడు కేవలం రీక్రియేషన్ కాదు. సీరియస్ కెరీర్ ఆప్షన్’ అంటుంది భోపాల్‌కు చెందిన అనీష. ఆమె గేమింగ్ లోకంలోకి వెళితే మరో లోకం తెలియదు. అలాంటి అనీష ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోనే కెరీర్‌ను వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది.‘గేమింగ్’ అనే మహాప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు... ఇన్–డిమాండ్ రోల్స్, స్కిల్స్, కోర్సులు....మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది యువతరం. ‘గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వ్యయప్రయాసలు అక్కర్లేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు’ అంటుంది ముంబైకి చెందిన కైరా. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఆన్లైన్ కోర్సు చేయడంతో పాటు బుక్స్ చదువుతోంది. గేమ్ డిజైన్‌కు సంబంధించి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ చేసింది.గేమ్ మెకానిక్స్ క్రియేట్ చేసే గేమ్ డెవలపర్లు, వోవరాల్ కాన్సెప్ట్, స్టోరీలైన్, క్యారెక్టర్లు, గేమ్‌ప్లేపై దృష్టి పెట్టే గేమ్ డిజైనర్లు, బగ్స్ బాధ లేకుండా చూసే అసూరెన్స్ టెస్టర్లు, విజువల్ ఎలిమెంట్స్‌ను క్రియేట్ చేసే గ్రాఫిక్ ఆర్టిస్లు, యానిమేటర్లు, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ వోవర్లాంటి ఆడియో యాస్పెక్ట్స్కు సంబంధించిన సౌండ్ డిజైనర్లు...గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ యువతరం తమను తాము నిరూపించుకోవడానికి గేమింగ్ ఇండస్ట్రీలో బోలెడు అవకాశాలు ఉన్నాయి’ అంటున్నాడు వీఆర్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆటోవీఆర్’ సీయివో, కో–ఫౌండర్ అశ్విన్ జైశంకర్. ‘ఎలాంటి అవకాశాలు ఉన్నాయి’ ‘ఏ కోర్సు చేస్తే మంచిది’లాంటి వాటి గురించి అశ్విన్ జైశంకర్లాంటి నిపుణులు చెబుతున్న విషయాలను యువతరం జాగ్రత్తగా వింటోంది.‘అన్రియల్ ఇంజిన్ డెవలపర్ కోర్సు, యూనిటీ సర్టిఫైడ్ డెవలప్ కోర్సు, గేమ్ డిజైన్ అండ్ క్రియేషన్ స్పెషలైజేషన్... మొదలైనవి గేమ్ క్రియేషన్‌కు సంబంధించిన సరిౖయెన దారులు’ అంటున్నాడు అశ్విన్ జైశంకర్. గేమింగ్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్, గేమింగ్ కంపెనీల విస్తరణ కారణంగా గేమింగ్ పరిశ్రమలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో కంపెనీలు తమప్రాజెక్ట్లను దృష్టిలో పెట్టుకొని యూనివర్శిటీల నుంచి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటున్నాయి.మరోవైపు గేమింగ్ సెక్టార్లో ‘ఫ్రీలాన్సింగ్ ట్రెండ్’ పెరుగుతోంది. గేమ్ డెవలప్మెంట్కు సంబంధించి కీలక దశలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ డెవలపర్ల నుంచి నెరేటివ్ డిజైనర్ల వరకు ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.మార్పు వచ్చింది..గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే విషయంలో పిల్లల ఆసక్తి సరే, తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అనే విషయానికి వస్తే... కొన్ని సంవత్సరాల క్రితం వరకు ‘గేమింగ్ అనేది కెరీర్ ఆప్షన్ కాదు’ అనే భావన వారికి బలంగా ఉండేది. ఈ పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది.‘ఒకప్పుడు గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సందేహాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం తమ పిల్లలను గేమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కోర్సులలో చేర్పించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్నాడు గేమింగ్ కంపెనీ ‘బ్యాక్‌స్టేజ్ పాస్’ ఫౌండర్ సూర్య. -
టెట్రిస్ గేమ్‌ను జయించిన బాలుడు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా వీడియోగేమ్ ప్రియులకు చిరపరిచితమైన టెట్రిస్ గేమ్‌ను 13 ఏళ్ల అమెరికన్ టీనేజర్ ఎట్టకేలకు మొత్తం పూర్తిచేశాడు. ఈ గేమ్ విడుదలైన దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. చివరి 157వ లెవల్ దాకా ఆడి చరిత్ర సృష్టించాడు. ఓక్లహామాకు చెందిన ఈ బుల్లోడి పేరు విల్లీస్ గిబ్సన్. తాను సాధించిన రికార్డు చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ‘మొదటిసారి ఆట మొదలెట్టినపుడు దీన్ని పూర్తి/క్రాష్ చేయగలనని అస్సలు అనుకోలేదు. గెలుపుతో నా చేతి వేళ్ల స్పర్శనూ నేను నమ్మలేకపోతున్నా’ అంటూ గేమ్ చిట్టచివరి 38 నిమిషాల వీడియోను మంగళవారం యూట్యూబ్‌లో గిబ్సన్ పోస్ట్చేశాడు. టెట్రిస్ గేమ్ ఇప్పటిదాకా కనీసం 70 విధానాల్లో 200కుపైగా అధికారిక వేరియంట్లలో విడుదలైంది. కిందకు పడిపోతున్న భిన్న ఆకృతుల ‘బ్లాక్’లను వరసగా కిందివైపు పేర్చడమే ఈ ఆట. ఇవి చదవండి: ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు! -
‘స్ట్రెస్’ నుంచి బయట పడేందుకు ఎలాన్ మస్క్ చేసే పని ఇదా!
ఒత్తిడి! పోటీ ప్రపంచంలో సర్వసాధారణం అయ్యింది. ఈ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు సినిమాలు చూడడం, క్రికెట్ ఆడుతుంటారు. దిగ్గజ కంపెనీల సీఈఓలు రోజూ వారి ఒత్తిడిల నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేస్తుంటారు. గోల్ఫ్ లేదంటే, సెయిలింగ్ క్లబ్బులకు వెళుతుంటారు. మరి ఎలాన్ మస్క్ ఏం చేస్తారని మీకెప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? ప్రంపచంలో అపరకుబేరుడు, పదుల సంఖ్యలో కంపెనీలకు అధినేత ఎలాన్ మస్క్ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు ఏం చేస్తుంటారో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. మస్క్ ఒత్తిడిలో ఉన్నప్పుడు వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతానని చెప్పారు. పరిమితులు లేని నా ఆలోచనల్లోని అల్లకల్లోలాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్ కాస్ట్లో మస్క్ మాట్లాడుతూ.. నా మెదడు తుఫాను లాంటింది. ఒకేసారి పదిపనులు చేయాల్సినప్పుడు నా మైండ్ నా కంట్రోల్లో ఉండదు. నా గురించి తెలియని వారు నాలా ఉండాలని, లేదంటే పనిచేయాలని అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన (మస్క్)తో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన గ్రైమ్స్..ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ ఐజాక్సన్ ఎలాన్ మస్క్ జీవితం గురించి రాసిన ‘ఎలాన్ మస్క్’ ఆటో బయోగ్రఫీ బుక్‌లో చెప్పారు. మస్క్ ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌లలో ‘ది బ్యాటిల్ ఆఫ్ పాలిటోపియా’, ‘ఎల్డెన్ రింగ్’లు ఉన్నాయి. ‘ది బ్యాటిల్ ఆఫ్ పాలిటోపియా’ నాగరికతను నిర్మించడం, యుద్ధానికి వెళ్లడం గురించిన వ్యూహాత్మక గేమ్ కాగా.. ఒక సీఈఓకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ గేమ్ ఉపయోగపడుతుందని మస్క్ భావిస్తారని పేర్కొన్నారు. మరో వీడియో గేమ్ ‘ఎల్డెన్ రింగ్’. యుద్ధంపై దృష్టి సారించడం, రాజ్యాన్ని నిర్మించడమే ఈ గేమ్ లక్ష్యమని పాడ్‌కాస్ట్‌లో వివరించారు. తన మెదడును ఒక నిర్దిష్ట స్థితికి తీసుకెళ్లడానికి వీడియో గేమ్స్ ఉపయోగపడతాయి. గేమ్‌లో ముందుకు వెళుతున్న కొద్దీ పురోగతి సాధిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని ఎలాన్ మస్క్ పాడ్ కాస్ట్లో వివరించారు. -
మైక్రోసాఫ్ట్, యాక్టివిజన్ డీల్‌కు బ్రేకులు
లండన్: వీడియో గేమ్‌ల తయారీ సంస్థ యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు బ్రిటన్ బ్రేకులు వేసింది. క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో పోటీని ఈ డీల్ దెబ్బ తీసే అవకాశం ఉందని భావించడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే విలీన ఒప్పందాన్ని ఆమోదించకుండా ఉండటం ఒక్కటే పరిష్కార మార్గమని కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ తన తుది నివేదికలో పేర్కొంది. మరోవైపు బ్రిటన్ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. టెక్నాలజీ రంగంలో నవకల్పనలకు, పెట్టుబడులకు ఇలాంటివి విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. తాము ఇప్పటికీ యాక్టివిజన్ డీల్‌కు కట్టుబడి ఉన్నామని, దీనిపై అప్పీలు చేసుకుంటామని వివరించింది. గేమింగ్ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయిలో 69 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌ను పూర్తి నగదు రూపంలో మైక్రోసాఫ్ట్ ప్రతిపాదిస్తోంది. అయితే, పోటీని దెబ్బతీసేలా కాల్ ఆఫ్ డ్యూటీ వంటి పాపులర్ గేమ్‌లపై మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం దక్కించుకుంటుందనే ఉద్దేశంతో అమెరికా, యూరప్ దేశాల నియంత్రణ సంస్థలు ఈ ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. సోనీ తదితర ప్రత్యర్థి సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. -
అతడి అడుగులో ప్రతి అంగుళం ఆయుధమే!
రోల్–ప్లేయింగ్ వీడియో గేమ్ ‘ఆక్టోపా త్ ట్రావెలర్–2’ నేడు విడుదల అవుతోంది. 2018లో వచ్చిన ‘ఆక్టోపాత్ ట్రావెలర్’కు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ ఇది. ఈ ఆటలో ఎనిమిది క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. ‘హికారి’ ఒక యోధుడు...ఏ జర్నీ ఫర్ హోమ్ ‘అగ్నేయ’ ఒక డాన్సర్...ఏ జర్నీ ఫర్ స్టార్డమ్ ‘పా ర్టిటియో’ ఒక వ్యాపా రి...ఏ జర్నీ ఫర్ప్రా స్పెరిటీ ‘బస్వాల్ట్’ ఒక విద్యావేత్త....ఏ జర్నీ ఫర్ రివెంజ్ ‘థ్రోన్’ ఒక దొంగ...ఏ జర్నీ ఫర్ ఫ్రీడమ్ ‘టెమోనస్’ ఒక మతగురువు...ఏ జర్నీ ఫర్ ట్రూత్ ‘వొచెట్’ ఒక హంటర్...ఏ జర్నీ ఫర్ లెజెండ్స్ ‘కస్టీ’ ఒక మందుల వ్యాపా రి...ఏ జర్నీ ఫర్ మెమోరీస్. ఈ టర్న్–బేస్డ్ బ్యాటిల్ గేమ్‌లో ప్రతి ఎనిమీకి కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే సులభంగా కనుక్కునేలా ఉండవు. అవి ఏమిటో తెలుసుకుంటే ఆటలో అడుగులు ముందుకుపడతాయి. ఈ గేమ్‌లో డే టైమ్, నైట్ టైమ్ అనే రెండు సెగ్మెంట్లు ఉంటాయి. డే టైమ్‌లో ఆడే విధానానికి, నైట్ టైమ్‌లో ఆడే విధానానికి తేడా ఉంటుంది. డే టైమ్‌లో ఆడాల్సి వస్తే కొత్త స్కిల్స్లోప్రా వీణ్యం సంపా దించాల్సి ఉంటుంది. జానర్: రోల్ ప్లేయింగ్ మోడ్స్: సింగిల్ ప్లేయర్ ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్, ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్ -
ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్‌ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్‌లో పెంచుతోంది. డిష్‌బ్రెయిన్‌గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్‌కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్‌లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్‌ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మహాసముద్రంలో మిస్టరీలు.. మరి మీరు రెడీనా!
సముద్రంలో కనివిని ఎరగని జీవజాలాలే కాదు... ఎన్నో మిస్టరీలు దాగున్నాయి. వాటిని ఛేదించాలనుకుంటున్నారా? ఉత్సాహం ఉందా? అయితే పదండీ... ఈ నెలలో విడుదలైన సర్రియల్ అండర్ వాటర్ అడ్వెంచర్ గేమ్ ఫజిల్... స్లీట్. సముద్రాన్ని బయటి నుంచి చూడడం వేరు, సముద్రగర్భంలోకి వెళ్లడం వేరు. ఇప్పుడు మనం లో లోపటికి వెళుతున్నాం. అదిగో... తిమింగలానికి బాప్‌లాంటి రాక్షస తిమింగలం ఎదురొస్తుంది. అది నోరు తెరిస్తే... కోరల రూపంలో పదునైన గునపాల వనం కనిపిస్తుంది. అది మళ్లీ నోరు మూసే లోపే మనం తప్పించుకోవాలి. (క్లిక్: యూట్యూబ్‌లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే!) కమ్మని సంగీతం వినిపిస్తే అటువైపు వెళతాం. ఏదో జంతువులాగుంది. బూర వాయిస్తుంది. వెళ్లాలా? వద్దా? అని ఆలోచించేలోపే అది మనపై ఎటాక్ చేయవచ్చు. అటు వైపు వెళితే... మన ‘పాతాళభైరవి’లో హీరోకు కనిపించే పే.....ద్ద విగ్రహంలాంటిది కనిపించి కళ్లెర్ర చేయవచ్చు. ఇంకొంచెం దూరం వెళితే... అందమైన దీపాలు అద్భుతమైన వెలుగుతో కనిపిస్తాయి. ‘ఆహా’ అనుకునే లోపే ఆ దీపాలు కాస్త భారీ గొంగళి పురుగుల ఆకారంలో మనల్ని వేటాడడానికి వస్తుంటాయి. ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు రెడీనా! జానర్: అడ్వెంచర్ ఇండీ డెవలపర్స్: స్పైరల్స్ సర్కస్ -
ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్.. మళ్లీ వచ్చాడహో!
క్లాసిక్ హారర్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ వీడియో గేమ్ రూపొందిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది! కాని ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కదా. ఈ లోటును పూరిస్తుంది ఆల్ఫ్రెడ్హిచ్కాక్–వర్టిగో. హిచ్‌కాక్ మూవీ ‘వర్టిగో’ను ఆధారం చేసుకొని రూపొందించిన ఎడ్వెంచర్ వీడియోగేమ్ ఇది. కథ అదే అయినప్పటికీ కథనం, పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. ఈడి మిల్లర్ అనే రచయిత కారు ప్రమాదానికి గురవుతాడు. భార్య, పిల్లల ఆచూకి తెలియదు. ఈ 3 డైమన్షన్ గేమ్వరల్డ్లో ప్లేయర్ 3 క్యారెక్టర్లను కంట్రోల్ చేయాలి. ‘కెన్ యూ ట్రస్ట్ యువర్ వోన్ మైండ్?’ అంటున్న ఈ గేమ్ ఫ్లాష్బ్యాక్లతో కూడిన మిస్టరీలతో ప్లేయర్ మైండ్‌కు బోలెడు పనికల్పిస్తుంది. ప్లాట్‌ఫామ్స్: విండోస్, ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్, ఎక్స్‌బాక్స్ వన్, నిన్టెండో స్విచ్ మోడ్స్: సింగిల్ ప్లేయర్ -
క్రిప్టోకరెన్సీ.. ఇలాంటి నేరాలే జరుగుతాయ్ జాగ్రత్త!
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ చెలామణిపై ఆర్బీఐ ఆందోళన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల కోణంలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఆర్థిక నేరాలతో పాటు అమాయకులూ బలి అవుతారంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ విషయంలో కొత్త తరహా నేరాలు తప్పవని సైబర్ నిపుణులు సైతం వారిస్తున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా రికార్డైన క్రిప్టోకరెన్సీ భారీ చోరీ కేసును ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఓ టీనేజర్ ఏకంగా 46 మిలియన్ కెనడా డాలర్లు( 36.5 మిలియన్ అమెరికా డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 270కోట్ల రూపాయలపైనే) క్రిప్టోకరెన్సీని కాజేశాడు. కెనడా హామిల్టన్‌కు చెందిన 17 ఏళ్ల ఆ పిలగాడు.. అంత డబ్బుతో ఏం చేశాడో తెలుసా? ఆన్లైన్ గేమింగ్‌లో అరుదైన ఓ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేశాడు. స్విమ్ స్కాపింగ్(సెల్యూలార్ నెట్వర్క్ ఉద్యోగుల్ని డూప్లికేట్ నెంబర్ల ద్వారా బురిడీకొట్టించి.. బాధితుల అకౌంట్లను హ్యాక్ చేయడం) ద్వారా ఆ టీనేజర్ ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక వ్యక్తి ఇంత భారీస్థాయిలో క్రిప్టోకరెన్సీ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. నిజానికి ఈ చోరీ జరిగింది కిందటి ఏడాదిలో. బాధితుడు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జోష్ జోన్స్!. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. క్లిక్ చేయండి: క్రిప్టోకరెన్సీ.. నీటి బుడగల్లాంటివి హామిల్టన్ సిటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగించింది ఎఫ్‌బీఐ. అయితే అరుదైన ఆ యూజర్ నేమ్ దొంగను పట్టించింది. అంతేకాదు మొత్తం సొమ్ములో కేవలం ఏడు మిలియన్ల సొమ్ము మాత్రమే రికవరీ అయ్యిందని తెలుస్తోంది. కంటికి కనిపించని ఈ కరెన్సీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి నేరాలకు గురై భారీగా మోసపోవాల్సి వస్తుందని క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. చదవండి: క్రిప్టో కరెన్సీ చేతికి రాలేదని.. ఖమ్మంవాసి బలవన్మరణం -
పిల్లలపై నజర్ పెట్టాలి.. లేకుంటే ఇలాంటివే జరుగుతాయి
ఆన్లైన్ క్లాసుల వంకతో స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతికే వెళ్లిపోతున్నాయి. అయితే తరగతులు అయిన తర్వాత కూడా చాలా సమయం ఫోన్లలలోనే గడిపేస్తున్నారు చాలామంది. ఆ టైంలో తల్లిదండ్రుల నిఘా ఉండకపోతే.. అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అలా పిల్లలపై నజర్ పెట్టక.. వీడియో గేమ్ వల్ల లక్ష రూపాయల దాకా పొగొట్టుకుంది ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ జంట. లక్నో: ఆ భార్యాభర్తలది ఉత్తర ప్రదేశ్ గోండా జిల్లాలోని ఓ గ్రామం. 12, 14 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు ఆ జంటకి. ఆన్లైన్ క్లాసులు నడుస్తుండడంతో పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చారు. భర్త బయట పనులకు వెళ్లగా.. భార్య ఇంటి పనుల్లో మునిగిపోయింది. అయితే క్లాసులు ముగిశాక కూడా. ఫోన్ వాళ్ల చేతుల్లోనే ఉండనిచ్చారు. ఇంకేం సరదాగా ఆన్లైన్ గేమ్ ఇన్స్టాల్ చేసుకుని.. అందులో మునిగిపోయారు ఆ అన్నదమ్ములు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. ఓసారి ఏడువేలు, మరోసారి 90 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతా ఖర్చుపెట్టి ఆటలో డైమండ్స్, క్యారెక్టర్ల కోసం బట్టలు కొన్నారు వాళ్లు. విషయం తెలియని ఆ పిల్లల తండ్రి.. వాళ్ల ఫీజుల కోసం డబ్బు డ్రా చేయడానికి బ్యాంక్‌కి వెళ్లాడు. అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆపై అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. అయితే గేమ్‌కు సంబంధించి లీగల్ ట్రాన్జాక్షన్ కావడంతో ఏం చేయలేమని పోలీసులు చెప్పారు. ఈ విషయం తెలిసిన గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా.. ఆ పేరెంట్స్‌కి కొంత ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చాడు. అంతేకాదు ఆయన స్థానికంగా ఉండే కొందరు పేరెంట్స్‌ను పిలిపించుకుని స్మార్ట్ ఫోన్లలో పిల్లల యాక్టివిటీపై నజర్ పెట్టాలని స్వయంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాడు. -
గూగుల్‌లో ఈ బుల్లి డైనోసార్ ఎలా పుట్టిందో తెలుసా?
గూగుల్‌లో కనిపించే బ్రౌజర్ గేమ్ ‘డైనోసార్’ తెలుసు కదా. ఇంటర్నెట్ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్‌కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త అప్డేట్ ఏంటంటే.. ఒలింపిక్స్ మినీ గేమ్స్. సాక్షి, వెబ్‌డెస్క్: అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్. స్పేస్ బార్‌తో ఈ గేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్‌ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్‌కు ఒలింపిక్స్ గేమ్స్ తరహా ఫీచర్స్‌ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్(డైనోసార్), ఒలింపిక్స్ మినీ గేమ్స్, ఒలింపిక్ ఫ్లేమ్, రింగులు, మెడల్స్.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్ కంటే ముందే ఓ రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని గుర్తించి అప్డేట్ ఇవ్వడం విశేషం. Might need to work on my surfing skills 🌊 chrome://dino/ pic.twitter.com/OqDn3RHLGg — Sundar Pichai (@sundarpichai) July 23, 2021 అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్ గాబ్రియల్ ఆలోచన నుంచి పుట్టింది ఇది. 2014లో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్ డిజైనర్ డైనోసార్ గేమ్‌ను లాంఛ్ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ టీ రెక్స్ పేరు మీద ఈ గేమ్‌ను రూపొందించాడు సెబాస్టియన్. మొదట్లో ప్రాజెక్ట్ బోలన్ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్ బోలన్ ఎవరంటే.. టీ-రెక్స్ లీడ్ సింగర్. 2014 సెప్టెంబర్‌లో ఈ గేమ్ రిలీజ్ కాగా..పాత డివైజ్‌లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్లో అప్డేట్ వెర్షన్‌తో రీ-రిలీజ్ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్‌ను ఆడుతుంటారని గూగుల్ చెబుతోంది. తర్వాతి కాలంలో గేమ్‌కు అప్డేట్స్ రాగా.. డినో స్వార్డ్స్ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్‌ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్‌కు తగిలించుకుని ఆడే వీలుంది. తాజా ఒలింపిక్స్ అప్డేట్ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌కి వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. టీ-రెక్స్ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్ లైన్ లక్క్ష్యంగా గేమ్ భలేగా ఉందని సదరు రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్ మాగ్జిమమ్ పాయింట్లు 99999 రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్ వేగం శరవేగంగా ఉంటుంది. -
వీడియో గేమ్: గంటలో లక్ష ఫసక్.. కారు అమ్ముకున్న తండ్రి
వీడియో గేమ్‌ల పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్న కేసులు చూస్తూనే ఉన్నాం. అయితే అధికారిక గేమ్ వంకతో ఓ వ్యక్తిని నిలువునా దోచిన వైనం బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అతని ఏడేళ్ల కొడుకు వీడియోగేమ్ ఆడుతూ చేసిన పనితో.. కారు అమ్మేసి మరీ ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది. లండన్: నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో ‘డ్రాగన్స్: రైజ్ ఆఫ్ బెర్క్’ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా.. మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. అలా గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంట్ 1,289 పౌండ్లకు(మన కరెన్సీలో లక్షా ముప్ఫై వేలదాకా) చేరింది. ఈ-మెయిల్స్ ద్వారా యాపిల్ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి ముహమ్మద్ ముతాజా.. షాక్ తిన్నాడు. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అయిన ముతాజా.. అంత స్తోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు. ఆషాజ్కు ఫోన్ పాస్ వర్డ్ తెలిసినప్పటికీ.. ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది. పచ్చి మోసం నిజానికి అది ఫ్రీ వెర్షన్ గేమ్. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడోచ్చు. కానీ, అంతేసి అమౌంట్ యాప్‌ల కొనుగోలు యాడ్లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోళ్లను.. అందులో పెద్ద మొత్తం ఎమౌంట్తో అనుమతించడం పెద్ద మోసమని ముతాజా వాపోతున్నాడు. ఇదొక పెద్ద స్కామ్‌గా భావిస్తూ.. యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే కొంతలో కొంత ఊరటగా.. 207 పౌండ్లు(సుమారు 21 వేలు) వెనక్కి వచ్చాయి. మరోవైపు పిల్లల గేమ్‌ల్లో పరిమితులు లేని కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు. చదవండి: వయసు 24.. సంపాదన ఊహించలేనంత! -
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
‘సబ్‌నౌటిక: బిలో జీరో’ నేడే విడుదల
ఓపెన్ వరల్డ్ సౖర్వేవల్ యాక్షన్–అడ్వెంచర్ వీడియోగేమ్ ‘సబ్‌నౌటిక’ 2014 నుంచి గేమర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. తాజా వెర్షన్ ‘సబ్‌నౌటిక: బిలో జీరో’ నేడు విడుదల అవుతుంది. ఏలియన్ ఎన్విరాన్మెంట్ను ఎక్స్ప్లోర్ చేయడం, సౖర్వేవ్ కావడం గేమ్ ప్లాట్. ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాప్ట్ విండోస్, ప్లేస్టేషన్–4,5, ఎక్స్‌బాక్స్ వన్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ ► ఫ్యూచర్ టెన్స్ వీడియో వారిది–భాష మనది! వీడియో టైటిల్స్, డిస్క్రిష్షన్స్, కాప్షన్స్ స్థానిక భాషలలో ఆటోమెటిక్‌గా ట్రాన్స్లెషన్ చేసే కొత్త ఫీచర్‌ను వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తీసుకురానుంది. వెబ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ రెండిట్లోనూ ఈ సౌకర్యం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ నుంచి పోర్చ్‌గీస్, టర్కిష్లకు మాత్రమే ఇది పరిమితం. స్థానిక భాషలకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. ►సోషల్ మీడియా ట్విట్టర్ టిప్ జార్ సోషల్ మీడియా ప్లాట్ఫ్లామ్ ట్విట్టర్ ‘టిప్ జార్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన కంటెంట్ క్రియేటర్లకు ఎంతో కొంత డబ్బును డొనేట్ చేయవచ్చు. సెలెక్ట్ యూజర్లు (జర్నలిస్టులు, నిపుణులు...మొదలైవారు) ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో ట్విట్ చేసేవారికే ఇది పరిమితం. -
నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు
దక్షిణ కొరియాలో 24 ఏళ్ల ఒక కుర్రాడు ఇంట్లో నుంచే గేమ్స్ ఆడటం ద్వారా ప్రతి నెలా రూ.36 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అంటే ఏడాదికి సుమారు 4.32 కోట్లు. ఇంత మొత్తాన్ని బ్యాంక్ లేదా కంపెనీ ఎండి కూడా సంపాదించలేరు. కానీ ఈ యువకుడు కంప్యూటర్లో గేమ్స్ ఆడటం ద్వారా చాలా సంపాదిస్తున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్-క్యో ఆ దేశ రాజధాని సియోల్‌లోని తన అపార్ట్మెంట్ పైన ఏర్పరుచుకున్న ఒక రూమ్‌లో కూర్చుని రోజుకు 15 గంటలు వీడియో గేమ్స్ ఆడుతాడు. ఇలా యూట్యూబ్ లో ఆ గేమ్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ప్రతి నెల 50,000 డాలర్లు సంపాదిస్తున్నాడు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.36 లక్షలకు సమానం. చాలా మంది కిమ్ అభిమానులు ఆటను ప్రత్యక్షంగా చూస్తారు. తన అభిమానులను అలరించడానికి మధ్య, మధ్యలో ఫన్నీ కామెంట్స్ చేస్తాడు. దక్షిణ కొరియాలో ఇటువంటి ప్రత్యక్ష ప్రసారాలు చేసే వారిని బ్రాడ్ కాస్టింగ్ జాకీలు లేదా బిజెలు అని కూడా పిలుస్తారు. దక్షిణ కొరియాలో అత్యధికంగా సంపాదించే వారిలో టాప్ 1 శాతం మందిలో కిమ్ కూడా ఉన్నారు. కానీ, అతని జీవన విధానం గొప్పగా లేదు అని చెప్పుకోవాలి. ఎప్పుడు అదే గదిలో ఉండటం వల్ల కొన్ని సార్లు అసౌకర్యానికి గురైనట్లు పేర్కొన్నారు. తినడం, నిద్రపోవడం అన్ని ఆ స్టోర్ రూమ్‌లోనే జరుగుతున్నాయి. Kim Min-kyo plays #VideoGames for up to 15 hours a day — and makes a fortune from the thousands of fans watching him. https://t.co/eC3zfAsbdR #Livestreamer #Millionaire #Socialmedia — Digital Journal (@digitaljournal) March 26, 2021 4,00,000 మందికి పైగా చందాదారులను కలిగి ఉన్న అతను ఇతర వనరుల ద్వారా కూడా సంపాదిస్తాడు. ప్రకటనలు, స్పాన్సర్షిప్, అభిమానుల విరాళం లేదా లైవ్‌స్ట్రీమ్‌ల మధ్య ఎనర్జీ డ్రింక్స్ తాగడం ద్వారా యూట్యూబ్‌లో డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే తన వీడియోలను ఆఫ్రికా టీవీ, యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా కూడా సంపాదిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది లైవ్ స్ట్రీమర్లకు వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. లాక్ డౌన్ వల్ల దక్షిణ కొరియాతో సహా ప్రపంచ వ్యాప్త యూట్యూబ్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీనితో లైవ్ స్ట్రీమర్లు భారీగా డబ్బు సంపాదించారు. చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్ -
సారీ.. ఇతడు మన కట్టప్ప కాదు!
నోర్సు పురాణం ఆధారంగా రూపుదిద్దుకున్న యాక్షన్ అడ్వెంచర్ గేమ్ గాడ్ ఆఫ్ వార్ (2018) పాప్లర్ అయింది. దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీతో పాటు, టైటిల్ గురించి కూడా ఆసక్తి పెరిగింది. ఆమధ్య రిలీజ్ అయిన టీజర్లో ‘రాగ్నరాక్ ఈజ్ కమింగ్’ అనే సౌండ్ వినిపించింది. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ‘గాడ్ ఆఫ్ వార్: రాగ్నరాక్’ అనేదే టైటిల్ అంటున్నారు. ఈ సింగిల్ ప్లేయర్ వీడియో గేమ్ సరికొత్త సాంకేతిక సొబగులతో ముందుకు రానుంది. చదవండి: ‘ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే’ ‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’ -
భారత్‌లో పబ్జీ కథ ముగిసినట్లేనా?
(వెబ్ స్పెషల్): ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్తగా పరిచయం అక్కర్లేని ఆట పబ్జీ. ఈ గేమ్‌కు ఉన్నంత క్రేజ్ కొంతమంది సినీ నటులకు కూడా లేదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొబైల్ గేమ్స్ ఆడే వారిపై ఈ గేమ్ ఎంతలా ప్రభావం చూపిందో చెప్పటానికి వందల సంఖ్యలో నమోదైన ఆత్మహత్యలు, హత్యలే ఓ ఉదాహరణ. భారత్-చైనాల మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే పబ్జీ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జీ కార్పొరేషన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ గేమ్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు మొదలయ్యాయి. పబ్జీ ప్రస్థానం 'ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్'(పబ్జీ)ని దక్షిణ కొరియాకు చెందిన బ్రెండన్ గ్రీన్ అనే వ్యక్తి రూపొందించాడు. పబ్జీ కార్పొరేషన్ అనే గేమింగ్ సంస్థ 2017లో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 2017 మార్చిలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లకు గేమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం 2018 సంవత్సరంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు, 2020 సంవత్సరంలో ప్లేస్టేషన్ 4, స్టాడియా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే పబ్జీ మొబైల్ గేమ్‌గానే చాలా మందికి సుపరిచితం. అంతేకాదు మిగిలిన అన్ని ప్లాట్‌ఫాంల కన్నా మొబైల్ వర్సన్లోనే పబ్జీకి క్రేజ్ ఎక్కువ. దీన్ని ఇప్పటివరకు 600 మిలియన్ల మందికి పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ( భారత్‌లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్ ) ఇండియాలో పబ్జీ హవా ఇండియాలో 2018 నుంచి బాగా పాపులర్ అయిన ఈ గేమ్ రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక పబ్జీ ప్లేయర్స్ కలిగిన దేశంగా మారింది. దీన్ని ఇప్పటి వరకు 116 మిలియన్ల మంది భారతీయులు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్లకు పైగా మంది పబ్జీ ప్లేయర్స్ ఉండగా మన దేశంలోనే 22% ఉన్నారు. మొబైల్లో గేమ్ ఆడుతున్నట్లు కాకుండా మనమే యుద్ధ రంగంలోకి దిగి గేమ్ ఆడుతున్న ఫీల్ ఉండటంతో జనం ఎక్కువగా దీనికి బానిసలయ్యారు. కొంతమంది గేమ్ ఆడకపోతే ఊపిరాడదు అన్నట్లుగా మారిపోయారు. పబ్జీ క్రైం రేటు కూడా ఇండియాలో బాగానే పెరిగిపోయింది. ఇండియాలో పబ్జీ బ్యాన్ భారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు నెలల క్రితం 59, జూలై నెలాఖరున 47 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. తాజాగా గత బుధవారం చైనాకు చెందిన మరో 118 యాప్‌లను నిషేధించింది. వీటిలో దక్షిణ కొరియాకు చెందిన, చైనాతో భాగస్వామ్యం ఉన్న పబ్జీ కూడా ఉండటం గమనార్హం. సదరు యాప్స్ భారత పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, డేటా భద్రతకూ, దేశ సార్వభౌమత్వానికి ఇవి ముప్పు కలిగిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ( పబ్జీ బ్యాన్ : పబ్జీ కార్పొరేషన్ కీలక ప్రకటన ) పబ్జీ రాకపై కొత్త ఆశలు దేశంలో పబ్జీ బ్యాన్‌తో పెద్ద మార్కెట్‌ను కోల్పోయింది గేమ్ రూపకర్త దక్షిణ కొరియాకు చెందిన పబ్జీ కార్పొరేషన్. దీనిపై కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ గేమ్‌లకు పబ్లిషింగ్ హక్కులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇకపై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. ఇండియాలో పబ్జీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చైనా స్టేక్ హోల్డర్స్‌కు బై చెప్పి ఓ ఇండియన్ గేమింగ్ దిగ్గజంతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌లో ఈ గేమ్‌ను నిషేధించటానికి ప్రధానం కారణం చైనాతో సంబంధాలే. ఒక వేళ పబ్జీ కార్పొరేషన్ చైనాకు దూరమై, భారత్‌కు దగ్గరైతే కనుక ఈ గేమ్ ఇండియాలోకి తిరిగొస్తుందన్నది నిర్వివాదాంశం. -
‘వీడియో గేమ్ ఆడితే 83 ఏళ్లు ఫ్రీ’
ముంబై: గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులను ఆకర్శించే ప్రణాళికను నెట్‌ఫ్లిక్స్ రచించింది. అయితే వినియోగదారులు ఉచిత సేవలను పొందాలంటే ‘ద ఓల్డ్ గార్డ్’ అనే వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్ తెచ్చుకోవాలని షరతు పెట్టింది. వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన వినియోగదారులకు 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్ ఉచిత సేవలను పొందవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ఈ వీడియో గేమ్‌ను జులై 17 8గంటల నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఉచిత సేవల ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020) ఎన్నో ప్రతికూలతలున్న రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్డౌన్, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో కుటుంబ సమేతంగా సినిమాలు వీక్షించే వారికి నెట్‌ఫ్లిక్స్ మంచి క్వాలిటీ అందిస్తు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న విషయం తెలిసిందే. (చదవండి: శాంసంగ్ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్’ కట్) -
ఆన్లైన్లో ఆటలొద్దు
పంజాబ్‌లో 17 ఏళ్ల బాలుడు ఇటీవల పబ్జీ గేమ్ ఆడుతూ రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు. గేమ్‌లో తాను ఎంపిక చేసుకున్న పాత్ర(యానిమేషన్ బొమ్మ)కు కాస్మోటిక్ ఐటెమ్స్, గన్స్,టోర్నమెంట్ పాస్, రాయల్‌పాస్,రంగు రంగుల డ్రెస్‌ల కోసం తల్లితండ్రుల డెబిట్ కార్డులతో డబ్బులు చెల్లించాడు. విత్‌డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌లను తల్లిదండ్రులకు తెలియకుండా డిలీట్ చేశాడు. ఉద్యోగి అయిన తన తండ్రి వైద్య ఖర్చుల కోసం తెచ్చుకున్న ప్రావిడెంట్ ఫండ్ రూ.16 లక్షలను కొడుకు ఇలా సైబర్ నేరగాళ్ల పాలు చేశాడు. సాక్షి, అమరావతి: ఆన్లైన్ గేమ్స్ మనకు తెలియకుండానే జేబులు గుల్ల చేస్తూ బతుకు చిత్రాలను తల్లకిందులు చేస్తున్నాయి. ఎక్కడో పొరుగు దేశాల్లో ఉండే గేమ్స్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఆకట్టుకుని అందినంత కాజేస్తుండటంతో సరికొత్త సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. అసలే కరోనా నేపథ్యంలో ఇంటి పట్టునే ఉంటున్న పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసీ తెలియక ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై ఏ మాత్రం అవగాహన లేని లింక్‌లు క్లిక్ చేయడం, బ్యాంకు డీటైల్స్ ఇవ్వడం, ఓటీపీలు ఎంటర్ చేయడం వంటి అనేక స్వయం కృతాపరాధాలతో డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. వీడియో గేమ్స్ పేరుతో ఎర ► ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలు ఫ్రీఫైర్, పబ్జీ, ఫోర్ట్‌నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ గేమ్స్‌కు.. పెద్దలు ఆన్లైన్ రమ్మీ(పేకాట)కి ఆకర్షితులవుతున్నారు. ► ఈ వీడియో గేమ్స్‌లో ఒకేసారి వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్లో 50 మంది నుంచి 100 మంది వ్యక్తులు వారు ఎంపిక చేసుకున్న క్యారెక్టర్ల (యానిమేటెడ్ బొమ్మలు) రూపంలో అధునాతన ఆయుధాలతో కదులుతూ పోరాడుతారు. ► గేమ్‌ను బట్టి ఒక్కొక్కరు సుమారు రూ.100 నుంచి రూ.5 వేల వరకు ఆన్లైన్లో ఎంట్రీ ఫీజుగా చెల్లిస్తారు. వీరందిరిలో వీడియోగేమ్ నిర్ధేశించిన క్యారెక్టర్లు ఒకరికొకరు గన్ ద్వారా కాల్చుకుంటారు. చివరలో మిగిలిన ముగ్గురు విజేతలకు బహుమతులు ఇస్తారు. పిల్లల బలహీనతలే వారి బలం ► ఆన్లైన్ గేమ్‌లను పిల్లలకు, యువతకు ఆసక్తికరంగా మలిచి ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్, ఈ మెయిల్ ఐడీ, ప్రత్యేక యాప్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ► పిల్లలు, యువతలోని బలహీనతను గమనించి వీడియో గేమ్‌లలో వారు ఎంపిక చేసుకున్న పాత్ర (యానిమేషన్) బొమ్మలకు ఆకర్షణీయమైన వస్త్రధారణ, అధునాతన ఆయుధాల కొనుగోలుకు డబ్బులు ఆన్లైన్లో చెల్లించేలా నిబంధన పెడతారు. ఈ పాత్రలను రాయల్‌పాస్ ఆటగాళ్లుగా పిలుస్తారు. ► చాలా మంది పెద్దలు ఆన్లైన్లో జంగల్ రమ్మీ, క్లాసిక్ రమ్మీ, ప్లే రమ్మీ, ఏసి ఈ టూ త్రీ డాట్ కామ్, పేటీఎం, ఫస్ట్ గేమ్స్ డాట్ కాం, డక్కన్ రమ్మీ డాట్ కాం వంటి వెబ్సైట్లలో పేకాట ఆడుతూ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. 20 రోజుల్లో రూ.5.40 లక్షలు హుష్ అమలాపురం టౌన్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 9వ తరగతి విద్యార్థి 20 రోజులపాటు సరదాగా తన తల్లి షేక్ రజియా బేగం స్మార్ట్ ఫోన్ ద్వారా ఆడిన ఆన్లైన్ గేమ్ రూ.5.40 లక్షలు దోపిడీకి గురయ్యేలా చేసింది. తండ్రి కువైట్‌లో ఉంటున్నాడు. తల్లికి పెద్దగా చదువురాదు. ఈ బాలుడు ‘ఫ్రీ ఫైర్’ అనే ఆన్లైన్ వీడియో గేమ్ యాప్‌ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే నిర్దేశించిన లింక్ ఓపెన్ చేసి తన తల్లి డెబిట్ కార్డుల వివరాలు ఇచ్చాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా సొమ్ము కాజేశారు. దిక్కుతోచని ఆమె తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లి సోమవారం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా వద్ద గోడు వెళ్లబోసుకుంది. కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న గుండ్ర రవితేజ ఆన్లైన్లో రమ్మీ(పేకాట), క్యాసినో ఆటలతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరకు బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.1,56,56,587 డబ్బును కాజేశాడు. ఆ డబ్బునూ ఆటల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. తుదకు ఇతనిపైనే కేసు నమోదైంది. ఆన్లైన్ గేమ్స్‌లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఈ తరహా నేరగాళ్లను పట్టుకోవడం క్లిష్టంగా మారుతోంది. ఒకవేళ పట్టుకున్నా, చట్టపరంగా కఠిన శిక్షలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ గేమ్స్ నిషేధించేలా, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని ప్రతిపాదన చేశాం. పిల్లల ఆటల పట్ల పెద్దలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. – సునీల్‌కుమార్ నాయక్,డీఐజీ, సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం -
90 ఏళ్ల బామ్మ.. 39 ఏళ్లుగా వీడియో గేమ్స్
ఏదైనా విషయం పట్ల అభిరుచి ఉన్నా ఈ వయసులో మనకెందుకులే అని వదిలేస్తారు చాలామంది. ఫోన్ ఆపరేటింగ్ కూడా కష్టమయ్యే వయసులో ఓ బామ్మ ఏకంగా యూట్యూబ్ గేమర్గా గిన్నిస్ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. ఈ బామ్మ వయసు 90 ఏళ్లు. యూట్యూబ్‌లో కుర్రకారును ఆకర్షించే గేమ్స్‌ని ఈ బామ్మ టకటకా ఆడేస్తుంది. ఎన్నాళ్లుగానో తెలుసా! దాదాపు 39 ఏళ్లుగా. ప్రపంచంలోనే ఇన్నేళ్లుగా గేమింగ్ చేసేవారు ఎవరూ లేరట. ఇంత విశేష ప్రాచుర్యం పొందిన ఈ బామ్మ పేరు హమాకో మోరీ. జపాన్వాసి. అందరూ ఆప్యాయంగా ‘గేమర్ గ్రాండ్’ అని పిలుస్తారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్తో 2015లో యూ ట్యూబ్ ఛానెల్లోనూ ఎంటరయ్యింది. ఇప్పుడు తన గేమింగ్ ఛానెల్లో 2,70,000 మంది చందాదారులు ఉన్నారు. ప్రతి నెలా తన ఛానెల్లో నాలుగైదు వీడియోలను అప్లోడ్ చేసే ఈ గేమింగ్ బామ్మ వీడియోలను చూసేవారి సంఖ్యా పెరుగుతోంది. కాల్ ఆఫ్ డ్యూటీ, డూన్స్, ఎన్ఐఇఆర్ ఆటోమాట తో సహా అనేక ఆన్లైన్ గేమ్స్ ఆడుతోంది. ఇది మాత్రమే కాదు ఈ బామ్మ జీటీయే వి ఎక్కువ ఆడటానికి ఇష్టపడుతుంది. మోరీని గేమింగ్ గురించి పలకరిస్తే ‘మొదట్లో ఇది చాలా సరదాగా అనిపించింది. కానీ ఇది నా వయసుకు సరైంది కాదులే అనుకున్నాను. కొన్నాళ్లు వదిలేశాను. మొదట్లో ప్లే స్టేషన్లో ఆడేదాన్ని. మోడర్న్ గేమ్స్‌లోకి రావడానికి కొంతసమయం పట్టింది. వచ్చాక అంతే... నా ముందు ఎవరూ నిలవలేనంతగా గేమింగ్ చేస్తూనే ఉన్నాను. రోజూ 7–8 గంటల పాటు ఆడుతాను. ఈ మధ్య వచ్చే యాక్షన్ గేమ్స్ చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు నా ఫేవరేట్ గేమ్ గ్రాండ్ థెప్ట్ ఆటో 5’ అని గడగడా చెప్పేస్తుంది మోరీ. ‘ఇది కూడా సినిమా చూడటం లాంటిదే. పిల్లలకున్నట్టు నాకు గేమింగ్‌లో ఏజ్ లిమిట్స్ లేవు. ఎవ్వరూ అడ్డు చెప్పరు’ అని సంబరంగా చెబుతుంది ఈ గేమింగ్ బామ్మ. -
వీడియో గేమ్ ఎంత పని చేసింది..
మెక్సికోలోని కోహులియా రాష్ట్రంలో శుక్రవారం ఓ ప్రైవేటు పాఠశాలలో 11ఏళ్ల ఆరవ తరగతి విద్యార్థి.. ఓ టీచర్‌ను రెండు పిస్టళ్లతో కాల్చి చంపడంతోపాటు మరో టీచర్, ఐదుగురు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 1999లో అమెరికాలోని కొలంబైన్లోని ఓ పాఠశాలలో ఓ టీచర్‌ను, 12 మంది విద్యార్థులను ఇద్దరు విద్యార్థులు కాల్చి చంపిన సంఘటన ఆధారంగా రూపొందించిన ఓ వీడియో గేమ్ ప్రభావంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. జోస్ ఏంజెల్ రామోస్ అనే విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి మరణించడంతో గ్రాండ్ పేరెంట్స్‌తో జీవిస్తున్నాడు. అతనికి వీడియో గేమ్స్ ఆడే అలవాటు బాగా ఉందని తెల్సింది. ‘నేచురల్ సెలక్షన్’ అనే వీడియో గేమ్లోలాగా తెల్లటి చొక్కా, దాని మీదుగా నల్లటి పట్టీలు వచ్చే నల్లటి ప్యాంట్ ధరించి రెండు చేతుల్లో రెండు పిస్టళ్లను పట్టుకొని పాఠశాల గదిలోకి వచ్చాడు. వాటిని ఎందుకు పట్టుకొచ్చావ్ అంటూ మేరియా మెడినా అనే 60 ఏళ్ల టీచరు అడగడంతోనే ఆమెను అక్కడికక్కడే కాల్చి చంపాడు. అడ్డు వచ్చిన ఆల్డో ఒమర్ అనే 40 ఏళ్ల టీచరును, ఐదుగురు విద్యార్థులపైకి కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ధరించి తెల్లటి చొక్కాపై గేమ్‌లా ‘నేచురల్ సెలక్షన్’ అని రాసి ఉంది. వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ రెండు పొడువాటి తుపాకులను పట్టుకోగా, రామోస్ రెండు పిస్టళ్లను పట్టుకొచ్చాడు. నిన్న అతను స్కూల్‌కు వచ్చినప్పటి నుంచి తోటి విద్యార్థులతో ‘టు డే ఈజ్ ద డే’ అని పలుసార్లు అన్నాడట. బహూశా అది ఆ వీడియో గేమ్‌లోని పదం అయి ఉండవచ్చు. నేచురల్ సెలక్షన్ గేమ్‌ను శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అన్నోన్ వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్’ కంపెనీ తయారు చేసింది. దీనిపై మెక్సికన్ మీడియా ఆ కంపెనీ ప్రతినిధులను సంప్రతించగా, వారు స్పందించేందుకు నిరాకరించారు. రామోస్ సౌమ్యుడే కాకుండా పాఠశాలలో మంచి మార్కులు తెచ్చుకునే తెలివిగల విద్యార్థి అని, మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
మొదటి వారంలోనే 100 మిలియన్ల డౌన్లోడ్లు!
నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వీడియో గేమ్స్ ఆడుతూ హల్చల్ చేస్తున్నారు. బ్లూవేల్, పబ్ జీ వంటి డేంజరస్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా.. వాటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ పేరిట మరో సరికొత్త గేమ్ ప్లే స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ సాధించిన తొలి గేమ్‌గా రికార్డుకెక్కింది. టిమీ స్టూడియోస్ డెవలప్ చేసిన ఈ గేమ్ హవా ఇలాగే కొనసాగితే.. ప్రత్యర్థి కంపెనీలు పతనం కావడం ఖాయమని విశ్లేషణా సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ మేరకు ఐఓఎస్‌లో 56.9 మిలియన్, ఆండ్రాయిడ్‌లో 45.3 మిలియన్ డౌన్లోడ్లు సాధించిన కాల్ ఆఫ్ డ్యూటీ ఆయా ప్లాట్‌ఫాంలలో వరుసగా 9.1 మిలియన్, 8.3 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టిందని తెలిపింది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో లాంచ్ కాకముందే రికార్డు స్థాయిలో డౌన్లోడ్స్ సాధించిన ఈ గేమ్.. అక్కడ కూడా లాంచ్ అయితే గేమింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్‌గా రూపొందిన ఈ మొబైల్ గేమ్ అక్టోబరు 1న విడుదలైందన్న విషయం తెలిసిందే. -
‘వీడియోగేమ్ అడిక్షన్ ఓ మెంటల్ డిజార్డరే’
జెనీవా: ప్రస్తుతం ఏ చిన్నారిని చూసినా మొబైల్ ఫోన్‌తోనే కనిపిస్తున్నారు. వీడియోగేమ్‌ల పేరిట ఆరుబయట ఆడే క్రీడలకు దూరమైపోతున్నారు. అయితే స్కూల్లో పాఠాలు వినడం, లేదంటే మొబైల్ ఫోన్‌ని పట్టుకుని కూర్చోవడం.. ఇదీ ఈ తరం చిన్నారుల లైఫ్‌స్టయిల్. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీడియో గేమ్‌లకు బానిసలైపోతున్న వారి మానసికస్థితి సరిగా ఉండటం లేదని డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. వీడియోగేమ్స్ కారణంగా పిల్లలు మానసిక వ్యాధులబారిన పడుతున్నారని, రోజువారి జీవితంలో ఈ వీడియోగేమ్స్ ప్రభావం కూడా ప్రతికూలంగా ఉంటోందని తేల్చింది. ఎక్కువ సేపు గేమ్స్ ఆడేవారి ఇతర ఆసక్తులను, కార్యకలాపాలను ఈ గేమ్స్ నిర్లక్ష్యం చేస్తున్నాయని, వీడియో గేమ్స్ ఆడుతూ నిద్ర, తిండి కూడా పట్టించుకోవట్లేదని వెల్లడించింది. ‘వీడియో గేమ్ అడిక్షన్’ని మెంటల్ డిజార్డర్‌గా డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ప్రకటించింది. -
మార్కెట్లోకి మరో కొత్త గేమ్
న్యూయార్క్: పబ్ జీ.. ఈ వీడియోగేమ్ ఎంతగా సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఇంకా దాని జోరు తగ్గనేలేదు.. మరో కొత్త గేమ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు అపెక్స్ లెజెండ్స్. అమెరికాకు చెందిన వీడియో గేమ్ డెవలప్మెంట్ స్టూడియో రెస్పాన్ ఎంటర్టైన్మెంట్ ఈ గేమ్‌ను రూపొందించింది. ఇది ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (ఈఏ) అనుబంధ సంస్థ. గేమ్ మార్కెట్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే కోటి మంది ప్లేయర్లను ఆకట్టుకుంది. అపెక్స్ లెజెండ్స్ ప్లేయర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లకు పైగా దాటింది. అంటే దాదాపు 10 లక్షల మంది ఒకేసారి గేమ్‌లోకి లాగిన్ అవుతున్నారని ఈఏ తెలిపింది. శుక్రవారం నాటి కల్లా చూస్తే లైవ్ స్ట్రీమింగ్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్విచ్‌లో ఎక్కువ మంది వీక్షించిన గేమ్ ఇదే. అపెక్స్ గేమ్‌ను కేవలం ఎక్స్‌బాక్స్, పీఎస్4, పీసీల్లోనే ఆడుకోవచ్చు. దీన్ని మొబైల్ వెర్షన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకావముందని చెబుతున్నారు. -
పబ్జీ.. మహాడేంజర్జీ
మొన్న పోకెమాన్.. నిన్న బ్లూవేల్.. తాజాగా పబ్జీ ఉరఫ్ ‘ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్’.. దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను గంగవెర్రులెత్తిస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్ ఇది. ఆత్మహత్యలవైపు ప్రేరేపించిన బ్లూవేల్, పోకెమాన్ల స్థాయిలో కాకున్నా పబ్జీ విద్యార్థులను హింస, నేరప్రవృత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది. స్కూళ్లు ఎగ్గొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగితేలేలా బానిసలుగా మార్చుకుంటోంది. యువతలో వివిధ శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతోంది. – సాక్షి, హైదరాబాద్ ఏమిటీ గేమ్...? ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని గేమ్‌లో ప్రవేశించగానే ఒక ఐడీ లభిస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్. ఎంత మందితో ఈ గేమ్ ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించు కుంటారు. ఈ గేమ్ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే ఇది గ్రూప్ వాయిస్ గేమ్. అంటే ఈ గేమ్ ఆడేవారంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంది. ఈ గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు. దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగతా వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపు కుంటూ పోవడమే ఈ ఆట. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేం దుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. ఒక్క సారి ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చని పోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లో ప్రవేశించాలనుకుంటారు. గుజరాత్ స్కూళ్లలో నిషేధం పబ్జీ వల్ల బానిసలుగా మారిన యువతను చూసి చైనా ఈ గేమ్‌ను ఇప్పటికే పూర్తిగా నిషేధించింది. సర్వర్ లింకులను కూడా తొలగించి నెటిజన్లకు ఈ గేమ్ లింక్ దొరకకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ ఆటను స్కూళ్లలో నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులెవరూ స్కూళ్లకు స్మార్ట్ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ గేమ్‌ను నిషేధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు సైతం చేసింది. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం హాస్టళ్లలోని విద్యార్థులు పబ్జీకి బానిసలవుతున్నారని గుర్తించి తమ సంస్థ ఆవరణలో దీన్ని ఆడటంపై నిషేధం విధించింది. 20 కోట్ల మంది యూజర్లు ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఆడేవాళ్లు దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు. ఏ సమయంలోనైనా ఈ గేమ్‌లో యాక్టివ్‌గా ఉండే వాళ్ల సంఖ్య 3 కోట్ల నుంచి 4 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈ ఆటకు ఎంత మంది బానిసలుగా మారారో అర్థంచేసుకోవచ్చు. దేశంలో పబ్జీ ప్రభావం.... పబ్జీ కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల పది, పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయని, వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని ఆ రాష్ట్ర విద్యార్థుల సంఘా లు డిమాండ్ చేశాయి. ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్‌ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పబ్జీ ప్రభావం అధికంగానే ఉంది. ఎక్కడ చూసినా విద్యార్థులు ఈ గేమ్‌లో మునిగితేలి కనిపిస్తున్నారు. బానిసలుగా ఎందుకు మారుతున్నారు? ఏదైనా ఆట ఆడేటప్పుడు గెలవాలనే కసి ఉండటం సహజం. కానీ పబ్జీ విషయంలో మాత్రం అది మరీ ఎక్కువ. ఈ గేమ్ ఆడుతున్నంతసేపూ యుద్ధం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి యువత ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లోకి ప్రవేశిస్తూ విజయం కోసం తహతహలాడుతోంది. ఈ ఆట ఆడే సమయంలో ఎవరు వచ్చినా పట్టించుకొరు. గేమ్ నుంచి క్షణం దృష్టి మరిల్చినా చనిపోతామనే భయంతో ఎవరు పిలిచినా పట్టించుకోరు. ఎవరు ఫోన్లు చేసినా కట్ చేస్తారు. మానసికంగా పూర్తిగా దానికే అంకితమవుతూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు. పబ్జీ ఆడే వారిలో కనిపించే లక్షణాలు... ►చదువులో ఏకాగ్రత లోపించడం ► కోపం, చిరాకు ప్రదర్శించడం, దుందుడుకు స్వభావం ► ఎవ్వరితోనూ కలవలేకపోవడం ► నిద్రలేమి, కంటి సమస్యలు