Virata Parvam Movie
-
వీడియో షేర్ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్ చేస్తుందెవరు..?
శివ కార్తికేయన్- సాయిపల్లవి జోడిగా నటించిన 'అమరన్' తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయితే, ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని కట్ చేసి కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ వీడియోను కొందరు పనికట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ ఆమెను తప్పు పడుతున్నారు.బాలీవుడ్ వాళ్లే టార్గెట్ చేస్తున్నారా..?'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా సాయి పల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తన ఇమేజ్ను మరింత పెంచుతామంటూ పీఆర్ ఏజెన్సీ వారు సంప్రదించారని తెలిపింది. అయితే, దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ వాళ్లు సాయి పల్లవిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.The whole hatred towards #SaiPallavi is due to bad subtitle by the TV channel.She clearly says “Pakistan people will think our Soldiers as Terrorists bacause they think we are harming, Likewise for us too…May be perspective I am not sure…”pic.twitter.com/GH9V4LTxAa— Sathyamoorthy V (@sathyaonX) October 26, 2024 -
కూలిన విరాటపర్వం శంకరన్న ఇల్లు..
కరీంనగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శిగా పనిచేసిన దొంత మార్కండేయ ఉరఫ్ శంకరన్న ఇల్లు గురువారం కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శంకరన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో 1993 జనవరి 25న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ మధ్యనే శంకరన్న పాత్రతో కూడిన విరాటపర్వం సినిమా తెరకెక్కించారు. శంకరన్న పాత్రలో దగ్గుబాటి రాణా హీరో పాత్ర పోషించారు.మూడు దశాబ్దాల క్రితం ఉద్యమానికి ఆకర్షితుడై పార్టీలోచేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శి స్థాయిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ఆయన జ్ఞాపకంగా ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా
ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమానికి(సోషల్ మీడియా) బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని రానా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘పని జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్.. బెటర్.. స్ట్రాంగర్’ అంటూ ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చాడు. (చదవండి: ఆ బాధకు కారణం తెలియదు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: దీపికా పదుకోన్) ఇటీవల ‘విరాటపర్వం’తో ప్రేక్షకులను పలకరించాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత రానా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పటికే రానా దర్శకుడు గుణశేఖర్‌తో ‘హిరణ్య కశ్యప’, దర్శకుడు మిలింద్ రావుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలి సిందే. అలాగే ‘కోడిరామ్మూర్తి’ బయోపిక్, తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వెంకటేశ్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. pic.twitter.com/A7BWh6BnhE — Rana Daggubati (@RanaDaggubati) August 5, 2022 -
వరుస ఫ్లాపులు.. సాయిపల్లవి షాకింగ్ నిర్ణయం!
వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చున్నారు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మలయాళం చిత్రం ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. కోట్ల రూపాయలను వస్తాయని ఆలోచించకుండా.. తనకు సంతృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేస్తానంటోంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి అంటే సినీ ప్రియుల్లో ఎనలేని గౌరవం పెరిగిపోయింది. ఇక ఇటీవల కాలంలో సాయి పల్లవి లేడీ ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. అందుకే సాయి పల్లవిని అభిమానులు లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సాయి పల్లకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఈ నేచురల్ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆ మధ్య భారీ అంచనాల మధ్య వచ్చిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది. ఇటీవల వచ్చిన గార్గి సినిమా కూడా ప్లాప్‌గానే మిగిలిపోయింది. ఇలా వరుసగా ఫ్లాపులు రావడానికి కారణం సాయి పల్లవి ఎంచుకున్న కథలనే తెలుస్తోంది. కేవలం సందేశాత్మక చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్తోంది. అయితే సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది. దీంతో కొన్ని విషయాల్లో మారాలని సాయి పల్లవికి నిర్మాతలు సలహా ఇచ్చారట. గ్లామర్‌కు ప్రాధన్యత ఉన్న కమర్షియల్ చిత్రాలను కూడా చేయాలని చెప్పారట. అయితే ఆఫర్స్ రాకపోతే క్లినిక్ అయినా పెట్టుకుంటా లేదా ఉద్యోగం అయినా చేసుకుంటా కానీ నా స్థాయిని తగ్గించుకొని ఇష్టంలేని సినిమాల్లో నటించలేనని చెప్పిందట సాయి పల్లవి. ఈ లెక్కన చూసుకుంటే సాయి పల్లవి కెరీర్ క్లోజ్ అయినట్లేననే టాక్ వినిప్తోంది. మరి తన పంథాల్లోనే వెళ్తూ సాయి పల్లవి హిట్ కొడుతుందా లేదా మనసు మార్చుకొని గ్లామర్ పాత్రలు ఒప్పుకుంటుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
ఓటీటీలోకి 'విరాట పర్వం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న థియేటర్స్‌లో విడుదలపై మంచి టాక్ని సొంతం చేసుంది. ముఖ్యంగా వెన్నెలగా సాయి పల్లవి యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. జూలై 1నుంచి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ఓటీటీలో కమల్ హాసన్ 'విక్రమ్'.. ఎప్పుడు ? ఎక్కడంటే ?) ఈ చిత్రంలో రానా, సాయిపల్లవితో పాటు, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నివేదా పేతురాజ్ కూడా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్ మరియు శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. A relentless quest for love and freedom! Get ready to experience the world of Virata Parvam, coming to Netflix on 1st of July in Telugu, Malayalam and Tamil! #VirataParvamOnNetflix pic.twitter.com/44ks2WaJLl — Netflix India South (@Netflix_INSouth) June 29, 2022 -
సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నక్సలిజం నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ మూవీ హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు సాధారన ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రంపై సినీ స్టార్స్, దర్శక-నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల రూపొందించాడు. చదవండి: ‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ టీం సరళ కుటుంబాన్ని కలిసిన వీడియోను తాజాగా వేణు ఉడుగుల షేర్ చేశాడు. వరంగల్‌లోని నివసిస్తున్న సరళ కుటుంబాన్ని దర్శకుడు వేణు ఉడుగుల, హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి ఇతర టీం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విరాట పర్వం మూవీ టీంకు సరళ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మూవీ టీం ఆమె కుటుంబంతో ముచ్చటించింది. ఇక చివరకు సరళ కుటుంబ సభ్యులు సాయి పల్లవి చీర బహుకిరంచి బోట్టు పెట్టారు. దర్శకుడు వేణు ఉడుగుల షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? #VirataParvam is inspired by Sarala gaaru, a woman from Warangal. @Sai_Pallavi92 played the character "Vennela" as an ode to the girl who has changed the perception of Love in Revolution. Had the opportunity to met and spend some quality time with her family in Warangal. pic.twitter.com/Z741jArcmP — v e n u u d u g u l a (@venuudugulafilm) June 20, 2022 -
మేకింగ్ ఆఫ్ మూవీ - విరాట పర్వం
-
వ్యాఖ్యల దుమారం.. వివరణ ఇచ్చిన సాయిపల్లవి
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముందని, మానవత్వం గురించి ఆలోచించాలని ఆమె అన్నారు. సాయి పల్లవి వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై సాయి పల్లవి స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవ్వరినీ కించపరిచే విధంగా తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. (చదవండి: ‘విరాట పర్వం’ సినిమాను బ్యాన్ చేయాలి.. సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు) ‘నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్ప. ఏ మతంలోనైనా హింస మంచిది కాదని గతంలోనే చెప్పాను. కానీ నా మాటల్నీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఏవోవో ప్రచారం చేశారు. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ ఏంటో నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు’అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. -
‘విరాట పర్వం’ సినిమాను బ్యాన్ చేయాలి.. సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: విరాటపర్వం అనే సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై శ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చాలావరకు అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నందున సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని కోరారు. చదవండి: Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు -
"విరాట పర్వం" తప్పక చూడవలసిన సినిమా: దర్శకుడు కె రాఘవేంద్రరావు
-
'విరాట పర్వం' సినిమాపై రాఘవేంద్ర రావు రివ్యూ..
Director Raghavendra Rao Praises Virata Parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ అనేక అంచనాల మధ్య జూన్ 17న విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రానా, సాయి పల్లవి నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు 'విరాట పర్వం' సినిమాను కొనియాడారు. 'కుర్రవాడైన వేణు ఊడుగుల దర్శకత్వం ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అనుభవమున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాగే రానా, సాయి పల్లవి నటన ఎక్సలెంట్. కచ్చితంగా చూడాల్సిన చిత్రం విరాట పర్వం.' అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కితాబిచ్చారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ?
Is Rana Sai Pallavi Virata Parvam OTT Rights Bagged Netflix: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింతగా పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే థియేటర్లో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసినట్లే సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ మూవీ సాధారణంగా ఓటీటీలో విడుదలైనట్లు నాలుగు వారాల తర్వాత రీలీజ్ కావట్లేదట. ఇలాంటి మంచి సినిమాను థియేటర్లో చూసే ఫీల్ మిస్ అవుతారని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయట్లేదట మేకర్స్. కానీ పలు నివేదికల సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న 'విరాట పర్వం' ఓటీటీ రిలీజ్ డేట్‌ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. చదవండి:👇 సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ? -
కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..
Sai Pallavi Dance In Vignan Engineering College Video Goes Viral: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. దగ్గుబాటి రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు పలు ప్రమోషన్స్లలో సాయి పల్లవి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సాయి పల్లవి, రానా, డైరెక్టర్ వేణు ఊడుగుల విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. తర్వాత తనకు బాగా గుర్తింపు తెచ్చిన 'ఫిదా' సినిమాలోని వచ్చిండే 'మెల్ల మెల్లగ వచ్చిండే' పాటకు డ్యాన్స్ చేసి అలరించింది సాయి పల్లవి. స్టూడెంట్స్ అంతా కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైక్స్, కామెంట్స్‌తో దూసుకుపోతోంది. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి The Natural Performer @Sai_Pallavi92 danced to her iconic song "vachinde" at Vignan engineering college, Vizag 💥💥💥 Receiving an ocean of love from the fans and audience ❤️❤️#VirataParvam @RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns#VirataParvamOnJune17th pic.twitter.com/ZNoglOlGw3 — Shreyas Media (@shreyasgroup) June 16, 2022 -
విరాటపర్వం పబ్లిక్ టాక్
-
రూటు మార్చిన రానా.. ఇకపై అలాంటి సినిమాల్లో నటించరట!
రానా అంటేనే ప్రయోగాలు. లీడర్‌తో కెరీర్ బిగిన్ చేసినప్పటి నుంచి ఈ దగ్గుబాటి హీరో కొత్తదారిలో వెళ్లే ప్రయత్నమే చేసాడు. అతని సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ ఇంకాస్త కొత్తగా కనిపిస్తాయి. ప్రతిసారి కొత్త కథను చెప్పేందుకు ట్రై చేస్తూ వచ్చాడు. అందుకు కారణం తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లేదని రానా ఫిక్స్ కావడమే. కానీ విరాటపర్వం చేస్తున్న సమయంలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అర్ధమైంది. అభిమానులు ఏం కోరుకుంటున్నారో అర్ధమైంది. అందుకే ఫ్యాన్స్ కోసం ఇకపై ప్రయోగాలు చేయను, విరాటపర్వం మాత్రమే లాస్ట్ అంటూ అని ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట ఇచ్చాడు. ఇకపై కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు. (చదవండి: కమల్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు: అనిరుధ్) ఇప్పటి వరకు రానా చేసిన జర్నీలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలు చేశాడు.బాహుబలిలో భల్లాలదేవ, రుద్రమదేవిలో చాలుక్య వీరభద్ర, నేనే రాజు నేనే మంత్రిలో జోగేంద్ర, భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ రోల్స్ రానాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఇకపై కంప్లీట్ గా హీరోగా మారి తాను కూడా మూవీస్ ఫర్ ఫ్యాన్స్ ట్రెండ్ ఫాలో అవుతానంటున్నాడు. మరి ఏ జానర్ చిత్రాలతో రానా అలరిస్తాడో చూడాలి. -
వివాదంలో హీరోయిన్ సాయిపల్లవి
-
Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు
సైదాబాద్: అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ప్రతినిధులు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ... తన సినిమా ప్రచారం కోసం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ హీరోయిన్ సాయిపల్లవి గో రక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదన్నారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు తమ ప్రాణాలు పణంగా పెట్టి గోవులు కబేళాలకు తరలకుండా అడ్డుకుంటున్న గో–రక్షకులను సాయిపల్లవి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గోరక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమె నటించిన సినిమాను అడ్డుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధుల బృందం గురువారం సాయంత్రం సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. చదవండి: (‘విరాటపర్వం’ మూవీ రివ్యూ) -
‘విరాటపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్ : విరాటపర్వం నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు దర్శకత్వం : వేణు ఊడుగుల సంగీతం : సురేశ్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది : జూన్ 17, 2022 టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది.ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి..ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో నక్సలిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పారు. కానీ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుకు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరంగల్‌కు చెందిన మహిళ సరళ(సినిమాలో వెన్నెల అని పేరు మార్చారు)ను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సంఘటనను కథగా తీసుకోని మంచి సంబాషణలతో అద్భుతంగా విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కించాడు. సరళ హత్య విషయంలో తప్పు పోలీసులదా? లేదా నక్సలైట్లదా? అనే అంశాన్ని దర్శకుడు ఎంతో సున్నితంగా,ఎమోషనల్‌గా తెరపై చూపించాడు. ‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ’ అంటూ సినిమా స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను వెన్నెల లవ్‌స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం వెన్నెల చుట్టే తిరుగుతుంది. వెన్నెల కుటుంబ నేపథ్యం, పెరిగిన విధానం, విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం..అతని కోసం కన్నవారిని వదిలి వెల్లడం.. చివరకు పోలీసుల చేతికి దొరకడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తన తండ్రిపై పోలీసులు దాడి చేసినప్పుడు.. వారితో వెన్నెల వాగ్వాదం చేయడం ఆకట్టుకుంటుంది. ఇక రవన్నగా రానా ఎంట్రీ అయితే అదిరిపోతుంది. రవన్న కోసం దాచుకున్న బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తే.. దానిని కాపాడుకునేందుకు వెన్నెల చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క సీన్ తెలియజేస్తుంది. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్. ఫస్టాప్‌లో కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపించినా.. సాయి పల్లవి తనదైన నటనతో బోర్ కొట్టించకుండా చేసింది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీసు స్టేషన్లో ఉన్న వెన్నెలను రవన్న దళం చాకచక్యంగా తప్పించడం..ప్రొఫెసర్ శకుంతల (నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథలో మరింత స్పీడ్ పెగుతుంది. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. రవన్న తన తల్లిని కలిసి వచ్చే క్రమంలో జరిగే ఎదురుకాల్పుల్లో రవన్న, వెన్నెల కలిసి ఫైరింగ్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశం అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే కంటతడి పెట్టిస్తుంది. చేయని తప్పుకు వెన్నెల బలైపోయిందనే బాధతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు. దర్శకుడు వేణు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వస్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. ‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు... ఆడపిల్ల ప్రేమలో ఉంది’, 'చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’, ‘రక్తపాతం లేనిదెప్పుడు చెపు.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే తెలంగాణలో అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండోవో, ప్రజల జీవన పరిస్థితి ఏరకంగా ఉండేదో చక్కగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు వేణు ఊడుగుల ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. వెన్నెల పాత్రని రాసుకున్నప్పుడే సాయి పల్లవి ఊహించుకున్నానని సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు వేణు చెప్పాడు. ఆయన ఊహకు పదిరెట్లు ఎక్కువగానే సాయి పల్లవి నటించిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తే.. యాక్షన్ సీన్స్‌లో విజిల్స్ వేయించింది. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రీక్లైమాక్స్‌లో ప్రియమణి, నవీన్ చంద్రల కారణంగానే కథ మలుపు తిరుగుతుంది. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. వారి పాత్రల నిడివి తక్కువే అయినా.. గుర్తుండిపోతాయి.రాహుల్ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా.. కథతో పాటు వస్తాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విరాట పర్వం టైటిల్ పెట్టడానికి కారణం..?
-
ఇదే చివరి ప్రయోగాత్మక చిత్రం.. ఇకపై పిచ్చెక్కిచ్చేద్దాం: రానా
‘‘విరాటపర్వం’ లాంటి సినిమాలు రావాలి. ట్రైలర్ చూసినప్పుడే ఇది చాలా మంచి సినిమా అనుకున్నాను. ఇలాంటి చాలెంజింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు నిర్మాతలను అభినందిస్తున్నాను’’ అని హీరో వెంకటేష్ అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘తొలి సినిమా ‘లీడర్’ నుంచి రానా ఏ సినిమా తీసుకున్నా చాలా క్రమశిక్షణతో ఆ పాత్ర కోసం కష్టపడతాడు. తను ‘విరాటపర్వం’ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.. ప్రేక్షకులకు తన పాత్ర నచ్చుతుంది. ‘రానా నువ్వు విన్నర్ అవుతావు.. వెంటనే కాదు కానీ తప్పకుండా విన్నర్ అవుతావు’. మన తెలుగు ఇండస్ట్రీకి వేణులాంటి ఓ నిజాయతీ గల ఫిల్మ్ మేకర్ వచ్చాడు. ‘విరాటపర్వం’ లాంటి కథను తీసుకోవడం, ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రానికి సాయిపల్లవి జాతీయ అవార్డు అందుకుంటుంది. సాంకేతిక నిపుణులందరూ కష్టపడ్డారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. (చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే! ) రానా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఆరు ముఖ్య పాత్రల్లో 5 పాత్రలను మహిళలు చేశారు.. అందుకే ఇది పెద్ద మహిళా చిత్రం. మా బాబాయ్ వెంకటేశ్‌గారికి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ నాకు ఉంటారనుకోలేదు. ‘విరాటపర్వం’ ఒప్పుకున్నప్పుడు నాకెంతమంది అభిమానులున్నారో తెలిసింది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయొద్దని అన్నారు. నటుడిగా ఇది నా చివరి ప్రయోగాత్మక చిత్రం. ఇకపై మీకోసం సినిమాలు చేస్తా.. పిచ్చెక్కిచ్చేద్దాం’’ అన్నారు. సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మూడేళ్లు కష్టపడి ‘విరాటపర్వం’ చేశాం. మీరందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి.. మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది’’ అన్నారు. -
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి
Sai Pallavi Says Her Father Jokes About Marrying Telugu Guy: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తెలుగు అబ్బాయితో పెళ్లి, సినిమాల తర్వాత కెరీర్ వంటి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన పెళ్లి గురించి మాట్లాడుతూ 'నేను ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా తెలుగు మాట్లాడుతున్నాను. ఇది చూసిన మా నాన్న నిన్ను చూస్తుంటే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావ్ అని అన్నారు. నిజానికి మేము ఇంట్లో ఎక్కువగా బడగా భాష మాట్లాడతాం. నాకు అనుకోకుండా మధ్యలో తెలుగు వచ్చేస్తుంది. ఇక నా పెళ్లి ఇప్పుడే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నా గురించి మరింత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను.' అని సాయి పల్లవి తెలిపింది. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ అలాగే సినిమాలకు స్వస్తి పలకాల్సి వస్తే ఏ కెరీర్‌ను ఎంచుకుంటారు అని అడిగిన ప్రశ్నకు.. 'ఎంబీబీఎస్‌లో డిగ్రీ చేశాను. ప్రస్తుతం మెడిసిన్ కొనసాగించడం లేదు. నాకు మొదట్లో కార్డియాలజీపై ఆసక్తి ఉండేది. ఇప్పుడు గైనకాలజీపై ఉంది. ఎందుకంటే చాలా మంది యువతులు ఇప్పటికీ తమ సమస్యల గురించి గైనకాలజిస్ట్‌తో ఓపెన్‌గా చెప్పలేకపోవడం నేను చూస్తున్నాను. ఒక డాక్టర్ మాత్రమే అలాంటి స్త్రీలను మరింత సౌకర్యవంతంగా సమస్య చెప్పుకునేలా చేయగలరని నేను భావిస్తున్నాను. అందుకు నేను ఏదో ఒకటి చేయగలను అని అనుకుంటున్నాను.' అని పేర్కొంది. చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే! -
ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే!
‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలనుకుంటాను. ఒకే క్వొశ్చన్ పేపర్‌కు మళ్లీ మళ్లీ అదే సమాధానాలు రాయడంలో మజా ఉండదు. ప్రతి సినిమాకు కాస్త ప్రెజర్, పెయిన్ ఉండటమే బెటర్ అని నా ఫీలింగ్. లేకపోతే బోర్ కొడుతుంది’’ అన్నారు సాయిపల్లవి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల17న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సాయిపల్లవి పంచుకున్న విశేషాలు. నేను తమిళనాడులో పుట్టాను. తెలంగాణాలోని పరిస్థితులపై నాకంత అవగాహన లేదు. అందుకే ‘విరాటపర్వం’ కొత్తగా అనిపించింది. అప్పటి నక్సలిజం పరిస్థితుల్లో ఏది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. మా తాతగారు మాజీ పోలీసాఫీసర్. నక్సలిజం గురించి ఆయన నాకు ఏదైనా చెప్పడానికి ఆయనకు ‘విరాటపర్వం’ గురించి తెలియదు. ఇక వెన్నెల (‘విరాటపర్వం’లో సాయిపల్లవి పాత్ర)ను ఓ పాత్రగానే చేశాను. ఈ పాత్ర నాకో లెర్నింగ్ ప్రాసెస్. వెన్నెల ఒక సాధారణ అమ్మాయి. అమాయకత్వంతో కూడిన వ్యక్తిత్వం తనది. అలాగే తను నమ్మేదాన్ని సాధించే తెగువ కూడా ఉంది. వెన్నెల, సాయిపల్లవి (తనని తాను ఉద్దేశించి) ప్రేమను చూసే విధానం ఒకేలా ఉంటుంది. అయితే తన ప్రేమ కోసం వెన్నెల ఎంతైనా ఎఫర్ట్స్ పెడితే.. పల్లవి మాత్రం అంత ప్రయత్నించదేమో! సరళగారి (వెన్నెలకు స్ఫూర్తి) కుటుంబాన్ని కలిశాను. ఎమోషనల్‌గా అనిపించింది. ప్రాజెక్ట్ స్కేల్ మారింది నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్గార్లతో పాటు వేణు ఊడుగుల ముందుగా ‘విరాటపర్వం’ గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ సురేష్‌బాబుగారి దగ్గరికి వెళ్లింది. అలా రానాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. రానాగారు స్టార్డమ్ ఉన్న హీరో. రవన్న పాత్రకు రానాగారి వాయిస్, హైట్ బాగా నప్పాయి. ఒక స్క్రిప్ట్‌ను ఒప్పుకున్నప్పుడు పేపర్ మీద ఉన్నదానికంటే ఎక్కువే చేయొచ్చని రానాగారి నుంచి నేర్చుకున్నాను. చెప్పా లంటే రానాగారు వచ్చాక ‘విరాటపర్వం’ ప్రాజెక్ట్ స్కేలే మారిపోయింది. దర్శకుడు వేణుగారు అద్భుతమైన రచయిత. తనకు తెలిసినదాని గురించి తనకంటే ఎవరూ బాగా చెప్పలేరని నమ్మే వ్యక్తి ఆయన. అలాగే అంతే స్థాయిలో రీసెర్చ్ కూడా చేస్తారు. రాసి పెట్టి ఉంటే వస్తుంది సినిమా సినిమాకు మధ్య ఉండే గ్యాప్ గురించి నేను ఆలోచించను. నాకు ఆర్ట్ (కళ)పై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం. ఇక నా కోసమే కొందరు దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారంటే అది నాకు సంతోషాన్నిచ్చే అంశమే. కథలను ఎంపిక చేసుకోవడంలో నా ఇమేజ్ను నేను ఇబ్బందిగా ఫీల్ కావడంలేదు. ఒత్తిడి కూడా లేదు. మనం ఉన్నా లేకున్నా సినిమాలు శాశ్వతంగా ఉంటాయి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను యాక్ట్ చేసిన ఓ సినిమాను చూసి ప్రేక్షకులు మెచ్చుకోవాలనే ఆలోచనతోనే సినిమా అంగీకరిస్తాను. గత జన్మలో ఇక్కడే పుట్టానేమో! ‘ఫిదా’, ‘లవ్‌స్టోరీ’, ఇప్పుడు ‘విరాటపర్వం’.. ఇలా వరుసగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేశాను. మా ఇంట్లో కూడా నేను మారిపోయానని అంటున్నారు. బహుశా.. నేను గత జన్మలో ఇక్కడే పుట్టానేమో!’ అని చెప్పిన సాయిపల్లవితో ‘మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు?’ అనడిగితే... ఇంకా పుట్టలేదని అనుకుంటున్నాను’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
థియేటర్లలో సినిమాల సందడి జోరుగా కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలో విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతుండగా, సెకండ్ వీక్‌లో రిలీజైన నాని 'అంటే.. సుందరానికీ', '777 చార్లీ' సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు జూన్ మూడో వారంలో ఇటు థియేటర్, అటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం. 1. విరాట పర్వం దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అనేకామార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17 ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. 1990 దశకంలో జరిగిన యాదార్థ సంఘటనల స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. 2. గాడ్సే విభిన్నకథలతో, మంచి పాత్రలతో ముందుకు వెళ్తున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం గాడ్సే. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి. కల్యాణ్ నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 3. కిరోసిన్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న చిత్రం కిరోసిన్. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దిప్తీ కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వీటితోపాటు హీరో, మొనగాడు తదితర చిత్రాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు 1. జయమ్మ పంచాయితీ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో అలరించిన సినిమా జయమ్మ పంచాయితీ. మే 6న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2. O2 లేడీ సూపర్‌స్టార్ నయన తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 (ఆక్సిజన్). జీఎస్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 3. రెక్కీ శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ రెక్కీ. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో జూన్ 17 నుంచి ప్రదర్శించబడనుంది. 1990లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్యకు సంబంధించిన కథాంశంతో ఈ సిరీస్ రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అవతార పురుషా-1 (కన్నడ), జూన్ 14 సుడల్ (వెబ్ సిరీస్), జూన్ 17 నెట్‌ఫ్లిక్స్ గాడ్స్ ఫేవరెట్ ఇడియట్ (వెబ్ సిరీస్), జూన్ 15 ది రాత్ ఆఫ్ గాడ్ (హాలీవుడ్), జూన్ 15 షి (హిందీ వెబ్ సిరీస్ 2), జూన్ 17 ఆపరేషన్ రోమియో (హిందీ), జూన్ 18 జీ5 ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్), జూన్ 14 ఫింగర్ టిప్ (హిందీ, తమిళ వెబ్ సిరీస్ సీజన్ 2), జూన్ 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మసూమ్ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 17 సోనీలివ్ సాల్ట్ సిటీ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 16 -
బొట్టు పెట్టి..చేతిలో చీరపెట్టారు.. సాయి పల్లవి ఎమోషనల్
‘సరళ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె అమ్మ నా చేయి పట్టుకొని తన కూతురితో ఎలా మాట్లాడిందో అలానే మాట్లాడింది. నన్ను హగ్ చేసుకొని ఎక్కడున్నావ్ బిడ్డ, ఎప్పుడొస్తావ్, ఎందుకు వెళ్లిపోయావ్ అని అనడంతో నేను ఏడుపుని ఆపుకోలేకపోయాను. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సరళ ఫ్యామిలీని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నన్ను ఆశీర్వదించి, బొట్టుపెట్టి, చీరను బహుమతిగా ఇచ్చి పంపించారు. వారిని కలిస్తే.. నా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. సరళ ఫ్యామిలీ మా సినిమా చూసి హ్యాపీగా ఫీలైతే చాలు’అని సాయి పల్లవి అన్నారు. సరళ తల్లితో సాయి పల్లవి వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. 1992వ ప్రాంతంలో వరంగల్ సమీపంలో జరిగిన ఓ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సరళ అనే యువతి ప్రేమ కథ ఇది. ఈ పాత్రని సాయి పల్లవి పోషించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. ► ‘విరాటపర్వం’ని కథగానే నేను అప్రోచ్ అయ్యాను. నిజ జీవితంలో జరిగిందా లేదా అని నాకు తెలియదు. నేనే వెన్నెల అనుకొని నటించాను. వేణుగారు ఈ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించింది. నేను తమిళనాడులో పెరిగాను. అక్కడ జరిగిన సంఘటనలు వేరు.. కానీ ఇక్కడ(తెలంగాణ)అప్పట్లో ఇలాంటి సంఘటనలు జరిగిందని తెలియదు. దర్శకుడు వేణుగారు నాకు చాలా తెలియని విషయాలను చెబుతూ ఎడ్యుకేట్ చేశాడు. సరళ ఫ్యామిలీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కేవలం అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ‘విరాటపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ► వేణు ఈ సినిమా కథను ముందుగా నాకు చెప్పారు. ఆ తరువాత నిర్మాతలు సురేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో రానా ఈ కథను చదివి, నచ్చడంతో ఈ సినిమాను చేశారు. అంతకు ముందు వేరే వారికి కూడా వినిపించారు. కానీ వారు అంగీకరించలేదు. రవన్న పాత్రని రానా పోషించడం చాలా హ్యాపీ. ఆయన ప్రాజెక్ట్‌లోకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి. గొప్పగా సినిమాను తెరకెక్కించారు ► మనకు తెలియనకుండా ఉన్న ఒక కథలో నటించినప్పుడే మనకు మజా. తెలిసినది మళ్లీ మళ్లీ చేస్తే ఎప్పుడు నేను ఉండేలానే ఉంటాను. కొత్త కొత్త పాత్రలని చేస్తేనే యాక్టర్‌గా నేను ఎదిగినట్లు అవుతుంది. ► స్క్రిప్ట్‌లో మన పాత్ర ఎలా ఉంటే అంతవరకే నటించగలమని అనుకుంటాం. మేము అలానే నటిస్తాం. కానీ రానా మాత్రం పేపర్‌పై ఉన్నదానికి కంటే ఎక్కువగా నటిస్తాడు. ఔట్పుట్ మంచిగా రావడం కోసం చాలా కష్టపడతాడు. ఓ పాత్రను పరిమితికి మించి చేయడం.. బౌండరిని ఇంకొంచెం ముందుకు పుష్ చేసి నటించడం అనేది రానా వద్ద నుంచి నేను నేర్చుకున్నాను. ► మమ్మల్ని నమ్ముకొని ఒక సినిమా చేస్తారు. మనం ఆ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి.. మనం ఎందుకు సినిమా చేశామో జనాలకు చెప్పి.. వారిని చూడమని చెబుతాం. మన సినిమాలను మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు. ► ఊర్లో అమ్మాయిలు ఎలా ఉంటారో.. ఈ చిత్రంలో నేను అలా ఉంటాను. పల్లెటూరి అమ్మాయిలాగే నేను మాట్లాడుతా. ఈ చిత్రంలో నేను ఎలాంటి మేకప్ లేకుండా నటించాను. ► ‘విరాట పర్వం’ చిత్రాన్ని సుకుమార్, త్రివిక్రమ్‌లతో కలిసి రానా చూశాడు. నన్ను మాత్రం రానివ్వలేదు(నవ్వుతూ..). వాళ్లే మాట్లాడుకున్నారు. నా గురించి ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ► లేడి పవర్‌స్టార్, లేడి సూపర్ స్టార్ అనే బిరుదలను అభిమానులు ఏదో ప్రేమతో ఇస్తున్నారు. కానీ నేను దానిని మనసుకు తీసుకోను. కథలను విన్నప్పుడు అవేవి నేను పట్టించుకోను. జనాలకు నచ్చలే మంచి మంచి సినిమాల్లో నటించాలనే నా లక్ష్యం. ► ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ కొత్తదనం వైపు అడుగులు వేస్తుండాలి. ఒకే క్వశ్చన్ పేపర్ కు అవే ఆన్సర్లు రాస్తూ వుంటే కిక్ వుండదు కదా. కొత్తగా చేశాం, నేర్చుకున్నాం అనే తృప్తి ఉండాలి. ప్రతి పాత్రకి కొంత భాద, ఒత్తిడి ఉండటమే కరెక్ట్. లేదంటే బోర్ కొడుతుంది. ► నా సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలోనే వస్తున్నాయి. తెలంగాణ అమ్మాయి పాత్రలనే ఎక్కువగా పోషిస్తున్నాను. గత జన్మలో నేను తెలంగాణలో పుట్టానేమో (నవ్వుతూ). ► తక్కువ సినిమాలు చేస్తున్నానా? ఎక్కువ సినిమాలు చేస్తున్నానా? అనేది నేను చూసుకోను. మంచి సినిమాలు చేయాలనేది నా లక్ష్యం. నేను లేకపోయినా.. అందరికి నా సినిమాలు గుర్తుండాలి. ఆ సినిమా చూసి నన్ను గుర్తు తెచ్చుకోవాలి. ► పాండమిక్ కి ముందు లవ్ స్టొరీ, విరాటపర్వం చేశాను. తర్వాత శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. అయితే నేను గ్యాప్ గురించి ఎక్కువ అలోచించను. నేను కళని ఎక్కవగా నమ్ముతాను. నా కోసం ఒక కథ ఉంటే అది తప్పకుండా నన్ను వెదుక్కుంటూ వచ్చేస్తుంది. ► మంచి కథలు వస్తే.. వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తా. తెలుగులో సినిమా కోసం స్క్రిప్ట్స్ వింటున్నాను. శివకార్తికేయన్ గారితో తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను.