Wagnar Group
-
'బతికే ఉన్న..' వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కొత్త వీడియో వైరల్..
వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి ముందు ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలిగ్రామ్ ఛానల్లో విడుదలైన వీడియోలో ప్రిగోజిన్ తన యోగక్షేమాల గురించి అలాగే తన భద్రతపై ఉన్న అనుమానాలపై మాట్లాడారు. ఆర్మీ దుస్తులు ధరించి, చేతికి వాచ్ పెట్టి ఉన్న ఆయన మృతికి ముందు ఆగష్టు 21నాటి వీడియోగా భావిస్తున్నారు. వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ..' నేను బతికానా? ఇంకా చనిపోయానా..? ఎలా ఉన్నాను.. ఏం చేస్తున్నాను? అని చర్చించుకునేవారి కోసమే ఈ వీడియో. ఇది వీకెండ్ ఆగష్టు 2023 చివరి భాగంలో ఉన్నాం. నా జీవితాన్ని అంతం చేయడానికి నిరంతరం చర్చించుకుంటున్నారు. నా వ్యక్తిగత జీవితం, సంపాదన అంతా బాగానే ఉన్నాయ్' అని ప్రిగోజిన్ చెప్పారు. ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో షేర్ చేయగా.. ట్విట్టర్(ఎక్స్) లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూగర్భంలో ఉన్నట్లు కామెంట్ బాక్స్‌లో తమ అభిప్రాయాలను రాసుకొచ్చారు. ప్రిగోజిన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు షేర్ చేయండని మరొక నెటిజన్ స్పందించాడు. A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death. "So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine," Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi — Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023 రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా మృతి చెందారు. వీరి మరణ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు స్పష్టం చేసింది. ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్ని అవాస్తవాలని పేర్కొంది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి.. బైడెన్ షాకింగ్ కామెంట్స్
మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన విమానంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిచెందారని రష్యా పౌర విమానయాన సంస్థ ‘రోసావియాత్సియా’ ధ్రువీకరించింది. ప్రిగోజిన్ సహా విమానంలో ఉన్న మొత్తం 10 మంది చనిపోయారని నిర్ధారించింది. రష్యా కిరాయి సైనిక దళమైన వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడింది. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ కొన్నిరోజుల క్రితం రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటును రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశద్రోహం, వెన్నుపోటుగా అభివరి్ణంచారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కొన్నిరోజులు పుతిన్ వెనక్కి తగ్గారని, ప్రిగోజిన్‌కు క్షమాభిక్ష ప్రసా దించి, పొరుగు దేశమైన బెలారస్‌కు పంపించినట్లు వార్తలు వచ్చాయి. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఈ ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందని, ప్రిగోజిన్‌ను మట్టుబెట్టడానికే ఉద్దేశపూర్వకంగా విమాన ప్రమాదాన్ని సృష్టించారని ఉక్రెయిన్ సహా పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఆశ్చర్యం కలిగించలేదు: బైడెన్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కు బయలుదేరిన ప్రైవేట్ విమానం బుధవారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. మాస్కోకు ఉత్తర దిశలో 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉండగా, అందరూ దుర్మరణం పాలయ్యారు. ప్రిగోజిన్ సహా వాగ్నర్ గ్రూప్ లెఫ్టినెంట్లు మరణించినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 10 మృతదేహాలను రష్యాఅధికారులు గుర్తించారు. ఈ విమానాన్ని ప్రిగోజిన్ తరచుగా ఉపయోగించేవారని తెలుస్తోంది. వైమానిక భద్రతా నిబంధలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదం జరిగిందన్న కోణంలో అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అసలేం జరిగిందో తెలియదు గానీ ప్రిగోజిన్ మరణం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. ప్రిగోజిన్‌ను పుతినే హత్య చేయించారన్నట్టుగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై పుతిన్ మౌనం వీడలేదు. గురువారం ఆయన బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రిగోజిన్ మరణం గురించి ప్రస్తావించలేదు. ఇది కూడా చదవండి: రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి -
రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి
మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల కిరాయి సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ కూడా మృత్యువాతపడ్డారు. ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. అతని సొంత విమానమని చెబుతున్న సదరు ప్రైవేట్ బిజినెస్ జెట్ రష్యా రాజధాని మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో కుప్పకూలింది. వివరాల ప్రకారం.. మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్ కూలి.. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం. అయితే, క్రెమ్లిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన దాదాపు రెండు నెలల లోపే ప్రిగోజిన్ దుర్మరణం పాలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు రష్యా ఎయిర్ ఫోర్స్ కమాండర్ సెర్గీ సురోవికన్ను తొలగించినట్లు రష్యా మీడియా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్‌పై తిరుగుబాటు.. ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇది కూడా చదవండి: వీడియో: నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్‌లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. -
..మాటి మాటికి మా పాత్రలేదు అంటుంటేనే అనుమానం వస్తుంది సార్!
..మాటి మాటికి మా పాత్రలేదు అంటుంటేనే అనుమానం వస్తుంది సార్!