ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్‌ చెల్లింపుల్లోనే..! | Sakshi
Sakshi News home page

ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్‌ చెల్లింపుల్లోనే..!

Published Mon, Mar 25 2024 11:58 AM

Guwahatis Digital Beggar Seeks Alms With A PhonePe QR Code - Sakshi

ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్‌ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్‌పేతో చకచక​ అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్‌ చెల్లిపులే, క్యూర్‌ కోడ్‌ స్కానింగ్‌లే. ఇప్పుడు ఆ డిజిటల్‌ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్‌ పే క్యూర్‌ కోడ్‌తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ సోమాని సోషల్‌ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు.

అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్‌ కోడ్‌తో ఉన్న ఫోన్‌పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్‌ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకుడు సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో దీన్ని మానవత్వంలో డిజిటల్‌ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్‌తో వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్‌ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్‌లో ఒక డిజటల్‌ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్‌ కోడ్‌ ప్లకార్డ్‌తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్‌ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్‌ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్‌విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది.

(చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్‌..!)

Advertisement
Advertisement