శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో

Published on Sat, 12/21/2024 - 09:37

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.

'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్‌మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)

'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను'  అని అర్జున్ కపూర్ చెప్పాడు.

1983లో బోనీకపూర్‌ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్‌, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్‌.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక)

Videos

హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్

సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?

వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్

Photos

+5

భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)

+5

#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)

+5

World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్‌ శారీ లుక్స్

+5

కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?

+5

శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)

+5

భార్యకు రోహిత్‌ శర్మ బర్త్‌ డే విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌

+5

ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)

+5

పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)

+5

సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)