సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టులో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ లో జూన్ 30 నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-06 అనుసంధానం పనులను ప్రారంభించారు. తొలి దశలో అమర్చే 5 సెగ్మెంట్లులో ఇప్పటికే నాజల్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్ అనుసంధానం చేయగా, సోమవారం మిడిల్-2 సెగ్మెంట్‌ను అనుసంధానం చేయనున్నారు.
ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ35 అనుసంధానం పనులను మొదటి ప్రయోగవేదికపై ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.