-
ఆ సినిమా రీమేక్ హక్కులు సూర్య సొంతం
కథానాయకుడుగాను, నిర్మాతగాను దూసుకెళుతున్న నటుడు సూర్య. నటుడిగా నిర్మాతగా ఈయన గ్రాఫ్ చూస్తుంటే ఎవరికై నా ఈర్ష్య కలగక మానదు. కారణం సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా), జైభీమ్ వంటి చిత్రాలు సంచలన విజయాలే. తాజాగా 'కంగువ' అనే మరో సూపర్ హిట్ కథా చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తొలిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మరోపక్క తాను తమిళ్,తెలుగులో నటించి, నిర్మించిన సూపర్ హిట్ సినిమా సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సూర్య త్వరలో సుధా కొంగర దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటించే 43వ చిత్రం అవుతుంది మలయాళ స్టార్ నటుడు దుల్కర్సల్మాన్, విజయ్‌వర్మ, నటి నజ్రియా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం కంగువా చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా హిందీలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘టువల్త్ ఫైల్’ చిత్ర తమిళ రీమేక్ హక్కులను సూర్య పొందినట్లు సమాచారం. యదార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు విను వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర తమిళ్ రీమేక్‌లో సూర్య నటిస్తారా లేక మరో నటుడిని నటింపజేస్తారా వేచి చూడాల్సి ఉంది. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
కాంబినేషన్ రిపీట్
హీరో సూర్య – దర్శకురాలు సుధ కొంగరది హిట్ కాంబినేషన్. సూర్య హీరోగా సుధ దర్శకత్వంలో రూపొందిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి ఐదు అవార్డులు దక్కాయి. కాగా సుధ కొంగర దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సూర్య అంగీకరించారు. గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సుధ పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఆరంభానికి కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్య ‘వణంగాన్’ (తెలుగులో ‘అచలుడు’) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుధ దర్శకత్వంలో సూర్య చేసే సినిమా ఆరంభం అవుతుందని సమాచారం. పక్కా మాస్ మసాలా కథతో కమర్షియల్ చిత్రంగా సుధ తెరకెక్కించనున్నారని తెలిసింది. -
హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్
Madras High Court Green Signal To Remake Of Soorarai Pottru: సూరరై పోట్రు చిత్రం హిందీ రీమేక్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు.. కథనాయకుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన చిత్రం సూరరై పోట్రు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య అబున్డంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయరాదని, కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ ఆధారంగా రచించిన సింప్లిఫై పుస్తక హక్కులు తమకు చెందినవి అంటూ సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. వాదనల అనంతరం న్యాయమూర్తి బుధవారం 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్‌లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్‌రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement