పనులు సత్వరమే పూర్తి చేయాలి
చిగురుమామిడి: మండలంలోని ఆయా గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జరుగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని డీఆర్‌డీవో అదనపు పీడీ సునీత అన్నారు. బుధవారం ఓగులాపూర్, చిన్నముల్కనూర్, గాగిరెడ్డిపల్లి, బొమ్మనపల్లి పాఠశాలల్లో జరుగుతున్న పనులను ఏఈ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. అన్ని గదుల్లో విద్యుత్ సౌకర్యం, వాటర్ సంపులు, టాయిలెట్ల మరమ్మతు పనులను వచ్చే విద్యాసంవత్సరం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నాలుగు గ్రామాల్లో జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో మధుసూదన్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐకేపీ సీసీలు, సీఏలు, పాఠశాలల విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్: గ్రామ పంచాయతీలో యూపీఎస్, పీఎస్ పాఠశాలలను జిల్లా పంచాయతీ అధికారి(అమ్మ ఆదర్శ పాఠశాలల మండల ప్రత్యేకాధికారి) రవీందర్ బుధవారం తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న పనులను పరశీలించారు. గ్రామ సమైక్య అధ్యక్షురాళ్లకు పనులు చేసే విధానంపై సూచనలు, సలహాలు చేశారు. తిమ్మాపూర్‌లో పనులు ప్రగతిలో ఉన్నందున, వెంటనే రికార్డు చేసి అందుబాటులో ఉన్న నిధుల ద్వారా వెంటనే చెల్లింపులు చేయాలని పంచాయతీరాజ్ ఏఈ, మండల విద్యాధికారికి సూచించారు. ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కిరణ్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కె.మహేందర్‌రావు, వీవో కోమలత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
గంగాధర: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, మూత్రశాలలకు సంబంధించిన పనులు వేగవంతం చేసి పాఠశాలల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ప్రత్యేకాధికారి పద్మావతి సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా పత్తికుంటపల్లి, ఇస్లాంపూర్, మంగపేట, ఇస్తారుపల్లి, లక్ష్మిదేవిపల్లి, నారాయణపూర్, నాగిరెడ్డిపూర్, నర్సింహులపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బుధవారం పరిశీలించారు. ఆమె వెంట ఎంఈవో వేణుకుమార్, ఏఈ రమేశ్ తదితరులున్నారు.
● ఏపీడీ సునీత
Comments
Please login to add a commentAdd a comment