రివైజ్డ్ పింఛన్ చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్
గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 11వ వేజ్‌బోర్డు రివైజ్డ్(సవరణ) పింఛన్ బకాయిల చెల్లింపులకు సింగరేణి కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ పరిధిలో 2,804 మందికి వర్తించేలా గుర్తింపు కార్మిక సంఘం చొరవ తీసుకొంది. ఇప్పటివరకు 912 మంది రిటైర్డ్ కార్మికులకు 11 వ వేజ్‌బోర్డు సవరణ పింఛన్ వివరాలను సింగరేణి యాజమాన్యం అందజేయడంతో వారికి క్లియరెన్స్ లభించింది. అయితే మిగతా కార్మికుల వివరాలను కూడా వెంటనే అందించాలని రిటైర్డ్ కార్మికులు కోరుతున్నారు.
సవరణ పింఛన్ చెల్లింపులు ఇలా..
సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులకు 2021 జూలై 01వ తేదీ నుంచి అమలైన పదకొండో వేజ్ బోర్డు ప్రకారం.. బేసిక్‌పై రివైజ్డ్ పింఛన్ లెక్కించి బకాయిలు చెల్లిస్తారు. అయితే, యాజమాన్యం 2023 మే నెలలో 11వ వేతన ఒప్పందం ఖరారు కావడంతో అప్పటి నుంచే రిటైర్డ్ కార్మికుల వివరాలను సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపించింది. దీంతో చాలామందికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో గుర్తింపు యూనియన్ చొరవతో సీఎంపీఎఫ్ అధికారులు 2021 జూలై 01వ తేదీ నుంచి అమలు చేసేందుకు అంగీకరించారు. సింగరేణి నుంచి వచ్చిన క్లెయిమ్స్ ప్రకారం అతిత్వరలో చెల్లింపులు చేస్తామని అధికారులు వెల్లడించారు.
గోదావరిఖని పరిధిలో..
గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ పరిధిలో 2021 జూలై 01వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు 2,804 మంది ఉన్నారు. వీరికి సవరణ పింఛన్ సొమ్ము రావాల్సి ఉంది. వీరిలో కేవలం 912 మందికే పింఛన్ సవరించారు. సీఎంపీఎఫ్ అధికారులకు రిటైర్డ్ కార్మికుల జాబితా పంపించడంలో ఆలస్యంతో ఈ పరిస్థితి ఎదురైందని, సింగరేణి నుంచి వివరాలు రాగానే మిగతా వారికీ పింఛన్ సవరణ పూర్తవుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్ తెలిపారు. యాజమాన్యం వెంటనే మిగతా వారి వివరాలు సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపించాలని వారు కోరారు.
గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయం పరిధిలోని రివైజ్డ్ పింఛన్ కార్మికులు
ఏరియా క్లెయిమ్స్ తాజా సమాచారం
బెల్లంపల్లి 27 –
మందమర్రి 363 265
శ్రీరాంపూర్ 642 619
ఆర్జీ–1 140 38
ఆర్జీ–2 497 –
ఆర్జీ–3 440 –
భూపాలపల్లి 695 –
11వ వేజ్‌బోర్డు సవరణ చెల్లింపులపై తొలగిన ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment