● పెట్రోల్ బంకులు, గుడిసెలు, గడ్డివాములకు దూరంగా పటాకులు కాల్చాలి. రాకెట్లు వంటి వాటిని విద్యుత్ తీగలు, చెట్ల కింద కాల్చొద్దు. ఇంట్లో బాణసంచాను గ్యాస్‌స్టవ్, ఇతరత్రా పొయ్యిల పక్కన ఉంచొద్దు.
● చిన్న పిల్లలు, వృద్ధులు గర్భిణులు నివసించే చోట భారీ శబ్ధం చేసే పటాకులు కాల్చొ ద్దు. కాకరవత్తులు, విష్ణుచక్రాలు కాల్చిన తర్వాత వాటి ఇనుప తీగలు ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు.
● టపాసులు కాల్చే ప్రాంతంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్‌ను దగ్గర ఉంచుకోవాలి. కాటన్ దుస్తులు, కళ్లద్దాలు ధరించం మంచింది. కంట్లో ఏదైనా పడినట్లుగా అనిపిస్తే పారేనీటిలో 10నిమిషాల పాటు కంటిని శుభ్రం చేయాలి. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
● అనుకోని సంఘటన ఏదైనా జరిగితే డయల్ 100కి డయల్ చేసి పోలీసులసాయం తీసుకోవాలి. అవసరమైతే 108కి ఫోన్ చేయాలి. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment