నిబంధనలు తప్పనిసరి
బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధితశాఖల అనుమతి తప్పనిసరి. దుకాణా లు జనావాసాల్లో ఏర్పాటు చేయొద్దు. టపాసులు విక్రయించే ప్రాంతంలో బకెట్లలో ఇసుక, డ్రమ్ముల నిండుగా నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి. చట్టబద్ధంగా ఆమోదించిన, నాణ్యమైన బాణసంచా విక్రయించాలి. పండుగ ముగిశాక మిగిలిన బాణాసంచాను అగ్నిమాపకశాఖ అధికారులు ఎంపిక చేసిన గోదాముల్లో వ్యాపారులు భద్రపరచాలి. నిబంధనలకు విరుద్ధంగా నచ్చినచోట నిల్వ చేయటంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది.
పండుగ పూట వీలైనంత వరకు సిల్క్, నైలా న్ దుస్తులు వేసుకోకూడదు. అనుకోకుండా ప్రమాదం జరిగి చర్మం కాలితే ధారగా పడుతున్న నల్లా నీటికింద గాయపడిన ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. కాటన్‌తో కవర్ చేసి మంచి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.
– వై.వెంకటేశ్, చర్మ వ్యాధుల నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment