● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంటింటి సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్ధేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఎన్యూమరేటర్లు ప్రతీఇంటి నుంచి స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. వివరాలు పూర్తిస్థాయిలో సేకరించిన తరువాత సర్వే పూర్తయినట్లు ఇంటికి స్టిక్కర్ అతికించి రావాలన్నారు. సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభమవుతుందని, ఆ లోగా ఎన్యూమరేషన్ బ్లాక్‌లు, ఫారాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం మాస్టర్ శిక్షకులు ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు సర్వేపై శిక్షణ ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment