రాజన్న ఆలయం జిగేల్‌ | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయం జిగేల్‌

Published Thu, Oct 31 2024 12:53 AM | Last Updated on Thu, Oct 31 2024 12:53 AM

 రాజన

రాజన్న ఆలయం జిగేల్‌

వేములవాడఅర్బన్‌: దీపావళిని పురస్కరించుకొని రాజన్న ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. బుధవారం రాత్రి రాజన్న ఆలయం విద్యుత్‌ కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనల అనంతరం మహాలింగార్చన నిర్వహించారు.

భక్తుల రద్దీ..

రాజన్న ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి ధర్మగుండంలో స్నానాలు చేసి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామివారికి కోడెమొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
 రాజన్న ఆలయం జిగేల్‌1
1/2

రాజన్న ఆలయం జిగేల్‌

 రాజన్న ఆలయం జిగేల్‌2
2/2

రాజన్న ఆలయం జిగేల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement