నేలకు సారం.. పంటకు ప్రాణం
కరీంనగర్‌రూరల్: చెరువు మట్టిలో సాగు భూములకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పూడిక మట్టిని పొలాలకు తరలించడంతో నేల సారవంతమవుతోంది. ఉపాధిహామీ పథకంలో పూడిక మట్టి కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఉపాధి కూలీలతో చెరువుల నుంచి మట్టిని తవ్వించి ట్రాక్టర్లలో పొలాలకు తరలిస్తున్నారు. కరీంనగర్ మండలంలో మూడేళ్ల నుంచి చెరువులు, కుంటల్లో పూడిక తీత పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం బహుదూర్‌ఖాన్‌పేటలోని ఊరచెరువు, బొమ్మకల్‌లోని నల్లచెరువు, గోధుమకుంట, చేగుర్తిలోని అయ్యవారి కుంట, గోపాల్‌పూర్‌లోని చింతలచెరువు, మొగ్ధుంపూర్‌లోని మన్నెంకుంట, చామనపల్లిలోని అప్పన్నచెరువు, నగునూరులోని పెద్ద చెరువుల నుంచి పూడిక మట్టి తవ్వకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో దాదాపు 42మంది రైతులు పూడికమట్టి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 1150 ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టిని రైతుల పొలాలకు సరఫరా చేశా రు. పూడిక మట్టిని రైతులు పొలాల్లో ఉపయోగిస్తుండటంతో ఎరువుల వాడకం తగ్గి పెట్టుబడి ఖర్చు తగ్గిపోతుండగా కూలీలకు ఉపాధి లభిస్తోంది.
పుష్కలంగా నత్రజని, పొటాష్
చెరువు మట్టిని రైతులు పొలాల్లో వేసుకోవడంతో అనేక లాభాలున్నాయి. వివిధ పంటల మొక్కలకు అవసరమైన నత్రజని, పొటాష్, జింక్, మెగ్నీషియం పూడిక మట్టిలో పుష్కలంగా ఉంటాయి. నత్రజని మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుండగా, పొటాష్ తెగుళ్లను తట్టుకునే శక్తినిస్తుంది. చెలక భూములకు చెరువుమట్టి సేంద్రియ ఎరువుగా పనిచేస్తోంది. పూడిక మట్టితో రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుండటంతో రైతులపై ఎరువుల కొనుగోలు భారం కొంతమేరకు తగ్గుతోంది.
పూడిక మట్టితో బహుళ ప్రయోజనం
ఉపాధి కూలీలతో
ఉచితంగా చెరువు మట్టి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment