-
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్‌తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్‌ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్‌లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్.. వాటిపై అదిరిపోయే ఆఫర్స్!
Flipkart Big Bachat Dhamaal: ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఏడాది వరుస పెట్టి ఒక సేల్ తర్వాత మరొక సేల్ తీసుకొని వస్తుంది. తాజాగా బిగ్ బచత్ ధమాల్ పేరుతో మరొక సేల్ తీసుకొని వచ్చింది. మార్చి 4 నుంచి మార్చి 6 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో యుపీఐ లావాదేవీలపై రూ.1000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్, వేరబుల్స్, టీవి మోడల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి ఫోన్ల అమ్మకాలు కూడా ఈ సేల్‌లో భాగంగా ప్రారంభమవుతాయి. అలాగే, కస్టమర్లు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ మీద ప్రత్యేక డీల్స్ పొందవచ్చ. ఇంకా, వినియోగదారులు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలకు చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉండే 'లూట్ బజార్' కూడా ఇందులో ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్, పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ పై డీల్స్, ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్ గ్రేడ్ ఆప్షన్, మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్లను కూడా తీసుకురానున్నారు. (చదవండి: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!)
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement