billion dollar
-
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్‌బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్‌గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
తెలుగు కాఫీ కంపెనీ కొత్త రికార్డు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిలియన్ డాలర్ (రూ.8,200 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా 1995లో ప్రారంభమైన ఈ కంపెనీ 100కుపైగా దేశాల్లో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్క ప్లాంటు ఉంది. ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000కిపైగా కప్పుల సీసీఎల్ కాఫీని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. అనతికాలంలోనే కాఫీ రిటైల్‌లో భారత్‌లో టాప్–3 స్థానానికి ఎగబాకినట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఫౌండర్, చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామన్నారు. కాఫీ రుచులు 1,000కిపైగా.. సీసీఎల్ ప్రొడక్ట్స్ 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేస్తోంది. వీటిలో ఫంక్షనల్ కాఫీ, కోల్డ్ బ్రూ ఇన్స్టంట్, మైక్రోగ్రౌండ్ ఇన్ఫ్యూజ్డ్, స్పెషాలిటీ ఇన్స్టంట్ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ‘ఈ స్థాయి ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లో కాంటినెంటల్ పేరుతో సొంత బ్రాండ్స్‌ను పరిచయం చేయడానికి, స్థిరమైన బిజినెస్ టు కన్సూమర్ కంపెనీగా రూపొందించడానికి విశ్వాసాన్ని ఇచ్చింది. బీటూసీని పటిష్టం చేయడానికి లాఫ్బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు బ్రాండ్లను దక్కించుకున్నాం. ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలవాలన్నది మా కల. ఇందులో భాగంగా గ్రీన్‌బర్డ్ పేరుతో మొక్కల ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాం’ అని వివరించారు. ఏపీలో మరో ప్లాంటు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న కాంటినెంటల్ కాఫీ పార్కులో సీసీఎల్ కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈడీ మోహన్‌కృష్ణ వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యం 16,000 మెట్రిక్ టన్నులు. 2024 మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
ఎగుమతుల్లో రికార్డ్ సృష్టించనున్న వాల్‌మార్ట్ - 2027 నాటికి..
న్యూఢిల్లీ: దేశం నుంచి 2027 నాటికి ఏటా 10 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను వాల్‌మార్ట్ ఎగుమతి చేయడంలో సహాయపడటానికి అపూర్వ సరఫరాదారుల వ్యవస్థ దోహదం చేస్తుందని రిటైల్ వాల్‌మార్ట్ తెలిపింది. భారతీయ సంఘాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, స్థానిక వ్యాపారాలకు అవకాశాలను విస్తరించడానికి, దేశం నుండి ప్రపంచానికి రిటైల్ కోసం పరివర్తన, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించాలన్న సంస్థ ప్రణాళికను వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈవో డాగ్ మెక్‌మిలన్ పునరుద్ఘాటించారు. భారతీయ సరఫరాదారులు, భాగస్వాములను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘వాల్‌మార్ట్ భారతదేశానికి కట్టుబడి ఉంది. దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లు, సభ్యుల కోసం నాణ్యమైన, సరసమైన, స్థిర ఉత్పత్తులను తయారు చేసే భారతీయ సరఫరాదారులు, భాగస్వాముల గురించి మేము సంతోషిస్తున్నాము. ఉద్యోగాలను సృష్టించడం, సంఘాలను బలోపేతం చేయడం, తయారీ కేంద్రంగా భారత పురోగతిని వేగవంతం చేయడం ద్వారా మా వ్యాపారం దేశ వృద్ధికి తోడ్పడగలదని గర్విస్తున్నాము’ అని వివరించారు. -
ఎస్బీఐ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రికార్డు స్థాయిలో అంతర్జాతీయంగా ఒక బిలియన్ డాలర్ల సిండికేటెడ్ సోషల్ రుణ సమీకరణ జరిపింది. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం, ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఒక వాణిజ్య బ్యాంక్ ఈ స్థాయిలో సేకరించిన అతిపెద్ద ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెర్స్) రుణం ఇది. బిలియన్ డాలర్ల రుణ సమీకరణలో 500 మిలియన్ డాలర్లు ప్రైమరీ ఇష్యూ ద్వారా సమీకరించగా, అంతే సమానమైన మొత్తం గ్రీన్షూఆప్షన్ ద్వారా సమీకరించినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం, బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,200 కోట్లకు సమానం. -
యూనికార్న్‌గా బీఎల్ఎస్
న్యూఢిల్లీ: టెక్ ఆధారిత సర్వీసుల సంస్థ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ తాజాగా యూనికార్న్ హోదాను అందుకుంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ షేరు గత ఆరు నెలల్లో 110 శాతం దూసుకెళ్లింది. దీంతో మార్కెట్ విలువ బిలియన్ డాలర్లను దాటింది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 14 శాతమే బలపడటం గమనార్హం! 2005 నుంచీ కంపెనీ ప్రభుత్వాలు, ఎంబసీలకు ఔట్సోర్సింగ్ వీసాలు, పాస్‌పోర్టులతోపాటు.. సిటిజన్ సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో కంపెనీ ఆదాయం 71 శాతం జంప్‌చేసి రూ. 630 కోట్లను తాకగా.. నికర లాభం సైతం 71 శాతం ఎగసి రూ. 82 కోట్లకు చేరినట్లు బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. (బీఎల్ఎస్ షేరు బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 198.5 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 8,153 కోట్లుగా నమోదైంది.) -
రెండేళ్లలో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా మాజా
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని మాజా సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. -
వారు చెప్పింది తప్పు అని నిరూపించాం: ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్‌లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్‌లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ చైర్‌పర్సన్‌గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
క్యూ1లో పీఈ పెట్టుబడులు డీలా!
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు దేశీ కంపెనీలలో 17 శాతం క్షీణించాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో 6.72 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 53,000 కోట్లు)కు పరిమితమయ్యాయి. డీల్స్ సైతం 15 శాతం నీరసించి 344కు చేరాయి. గతేడాది(2021–22) క్యూ1లో 8.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇక గతేడాది జనవరి–మార్చి(క్యూ4)లో తరలివచ్చిన 8.97 బిలియన్ డాలర్లతో పోలిస్తే త్రైమాసికవారీగా 25 శాతం తగ్గాయి. లావాదేవీల సమీక్షా సంస్థ, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ గ్రూప్ కంపెనీ రెఫినిటివ్ వెల్లడించిన గణాంకాలివి. కాగా.. ఈ క్యాలండర్ ఏడాది(2022)లో తొలి ఆరు నెలల(జనవరి–జూన్)ను పరిగణిస్తే.. దేశీ కంపెనీలలో పీఈ పెట్టుబడులు 26 శాతం పుంజుకుని 15.7 బిలియన్ డాలర్లను తాకాయి. టెక్నాలజీ స్పీడ్ 2022 జనవరి–జూన్ మధ్య పీఈ పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం పెట్టుబడుల్లో 73 శాతానికిపైగా అంటే 6.53 బిలియన్ డాలర్లను టెక్ రంగం సొంతం చేసుకుంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇండియా ఆధారిత ఫండ్స్ రెట్టింపునకుపైగా 7 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు రెఫినిటివ్ పేర్కొంది. ఈ పెట్టుబడులు సైతం వెచ్చించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇక పరిశ్రమలవారీగా చూస్తే ఇంటర్నెట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రవాణా గరిష్టంగా పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే బయోటెక్నాలజీ, మెడికల్– హెల్త్ విభాగాలకు పెట్టుబడులు భారీగా నీరసించాయి. కాగా.. తొలి అర్ధభాగంలో 10 పీఈ డీల్స్‌లో వెర్సే ఇన్నోవేషన్(82.77 కోట్ల డాలర్లు), థింక్ అండ్ లెర్న్(80 కోట్ల డాలర్లు), బండిల్ టెక్నాలజీస్(70 కోట్ల డాలర్లు), టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(49.47 కోట్ల డాలర్లు), ఎన్‌టెక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్(330 కోట్ల డాలర్లు), డెల్హివరీ(30.4 కోట్ల డాలర్లు) బిజీబీస్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్(30 కోట్ల డాలర్లు) చోటు చేసుకున్నాయి. -
బీభత్సం, స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సెమి కండక్టర్ల కొరతే అయినా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ ప్రకారం..ఈ పండుగ సీజన్లో దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 7.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,858 కోట్లు) చేరువలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ రిటైల్ సగటు అమ్మకపు ధర 14 శాతం వృద్ధితో 230 డాలర్ల (దాదాపు రూ. 17,200)కు చేరింది. మిడ్,ప్రీమియం విభాగాలలోని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని తాజాగా విడుదలైన కౌంటర్ పాయింట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్‌పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ..దసరా,దీపావళి ఫెస్టివల్ సీజన్లో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉందని, అందుకే భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం ఉండడంతో $200 కంటే (ఇండియన్ కరెన్సీలో రూ.14,974.98) ఎక్కువ ధర ఉన్న ఫోన్ అమ్మకాలు పెరగడానికి కారణమైందన్నారు. ఈ సేల్స్ ఇలాగే కొనసాగితే పండుగ సీజన్లో దాదాపు 7.6 బిలియన్ డాలర్ల విలువైన, లేదంటే అంతకంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు అమ్మకాలు జరుగుతాయనే అంచనా వేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. 2021 పండుగ సీజన్లో మార్కెట్ విలువలో 1శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ..యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం సంవత్సరానికి 14 శాతం పెరిగిందని చెప్పారు. ఇక ఈ పండగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందన్నారు. చాలా మంది వినియోగదారులు చేసిన సేవింగ్స్‌లో వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ ధోరణి పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుపడిందని అన్నారు. చదవండి: అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్ -
ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
ముంబై: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న పబ్లిక్ ఇష్యూల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ) మరింత బలపడనున్నట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ప్రైమరీ మార్కెట్లో జోష్ కారణంగా రానున్న మూడేళ్లలో దేశీ మార్కెట్ క్యాప్‌నకు 400 బిలియన్ డాలర్లు జమకానున్నట్లు తెలియజేసింది. దీంతో 2024కల్లా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా వేసింది. వెరసి ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాపిటటైజేషన్ కలిగిన దేశాలలో 5వ ర్యాంకుకు చేరే వీలున్నట్లు అభిప్రాయపడింది. గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బూమ్ నేపథ్యంలో తాజా అంచనాలను రూపొందించినట్లు యూఎస్ బ్రోకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచీ చూస్తే పబ్లిక్ మార్కెట్ ద్వారా కంపెనీలు 10 బిలియన్ డాలర్లను సమీకరిస్తున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత మూడేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. రానున్న 12–24 నెలల్లోనూ ఇది కొనసాగనున్నట్లు అంచనా వేసింది. యూనికార్న్‌ల దన్ను నవ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొస్తున్న యూనికార్న్‌లు, ఐపీవోల ద్వారా లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలు మార్కెట్ క్యాప్ అంచనాలకు బలాన్నిచ్చినట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ఇటీవల బిలియన్ డాలర్ల విలువను అందుకోడం ద్వారా యూనికార్న్ హోదాను పొందుతున్న స్టార్టప్‌లలో స్పీడ్ నెలకొన్నదని తెలియజేసింది. ఇంటర్నెట్ వృద్ధి, ప్రయివేట్ పెట్టుబడుల లభ్యత, నియంత్రణ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు దన్నునిస్తున్నట్లు వివరించింది. ఫలితంగా ఇటీవల 3.5 ట్రిలియన్ డాలర్లను అందుకున్న దేశీ మార్కెట్ క్యాప్ 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. గత వారం ఫ్రాన్స్‌ను అధిగమిస్తూ దేశీ మార్కెట్ విలువ ప్రపంచంలో ఆరో ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ జోరు ప్రస్తుతం దేశీ ఈక్విటీ ఇండెక్సులలో పాతతరం ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలదే అధిపత్యమని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. 20 ఏళ్ల సగటు లిస్టింగ్ వయసు కారణంగా పురాతన సూచీలుగా నిలుస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అయితే అతిపెద్ద డిజిటల్ ఐపీవోల ద్వారా కొత్త తరానికి చెందిన రంగాలకు ప్రాధాన్యత పెరగనున్నట్లు అంచనా వేసింది. దీంతో నవతరం ఆర్థిక, టెక్ రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు 5 శాతం నుంచి 12 శాతానికి(50 శాతం ఫ్లోట్) పెరగనున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటో లిస్ట్‌కాగా.. ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎమ్‌సహా పలు ఇతర కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలియజేసింది. -
విదేశీ ఫండ్స్‌పై భారీగా తగ్గిన పెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్‌పై దృష్టిపెట్టే ఆఫ్‌షోర్ విభాగంలోని ఫండ్స్, ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) నుంచి మరోసారి పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఈ కేలండర్ ఏడాది(2021) రెండో త్రైమాసికం(ఏప్రిల్– జూన్)లో నికరంగా 1.55 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 11,500 కోట్లు) ఔట్‌ఫ్లో నమోదైంది. వెరసి వరుసగా 13వ త్రైమాసికంలోనూ ఈ ఫండ్స్ నుంచి విత్‌డ్రాయల్స్ చోటుచేసుకున్నట్లు మార్నింగ్‌స్టార్ తాజా నివేదిక పేర్కొంది. కాగా.. 2021 క్యూ1(జనవరి–మార్చి)లో నమోదైన 37.6 కోట్ల డాలర్ల(రూ. 2,790 కోట్లు)తో పోలిస్తే పెట్టుబడులు భారీ స్థాయిలో వెనక్కి మళ్లడం గమనించదగ్గ అంశం! 2020 అక్టోబర్–డిసెంబర్‌లోనూ 98.6 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో ప్రధానంగా ఆఫ్‌షోర్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే జూన్ క్వార్టర్లో ఆఫ్‌షోర్ ఫండ్ విభాగంలో 1.7 బిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 1.1 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా.. 37 నెలల ఔట్‌ఫ్లో తదుపరి మార్చిలో 3.32 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ట్రెండ్‌కు వెంటనే బ్రేక్ పడింది. ఇక మరోవైపు సానుకూల పరిస్థితులను కొనసాగిస్తూ వరుసగా మూడో క్వార్టర్లోనూ ఆఫ్‌షోర్ ఈటీఎఫ్‌లకు నికరంగా పెట్టుబడులు తరలివచ్చాయి. జూన్ త్రైమాసికంలో 15.3 కోట్ల డాలర్ల ఇన్‌ఫ్లో నమోదైంది. మార్చి త్రైమాసికంలో నమోదైన 76.7 కోట్ల డాలర్లతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్‌లోనూ 88.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలానికి..: సాధారణంగా ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో పెట్టుబడులు దీర్ఘకాలానికి సంబంధించినవికాగా.. ఆఫ్‌షోర్ ఈటీఎఫ్‌ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు. 2018 ఫిబ్రవరి మొదలు ఈ రెండు ఫండ్స్ నుంచి నిరవధికంగా పెట్టుబడులు తరలిపోతూ వస్తున్నాయి. ఈ ట్రెండ్ 2020 మార్చికల్లా గరిష్టానికి చేరింది. దాదాపు 5 బిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి ఒక త్రైమాసికంలో అత్యధిక స్థాయి ఔట్ఫ్లోస్గా రికార్డు నమోదైంది. ఈ బాటలో 2021 జూన్‌కల్లా ఆఫ్‌షోర్ ఫండ్స్ నుంచి 20.8 బిలియన్ డాలర్లు, ఆఫ్‌షోర్ ఈటీఎఫ్‌ల నుంచి 2.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. జూన్ క్వార్టర్లో పెట్టుబడులు తరిగిపోయినప్పటికీ ఈ ఫండ్స్ ఆస్తుల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం బలపడి 46.3 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం! చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు -
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు రెట్టింపు
ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జూన్‌లో విదేశాల్లో ప్రత్యక్షంగా పెట్టిన పెట్టుబడులు 2.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్ నాటి 1.39 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే, వార్షికంగా పెరిగినప్పటికీ నెలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది మేలో నమోదైన 6.71 బిలియన్ డాలర్ల కన్నా జూన్‌లో పెట్టుబడులు సుమారు 58 శాతం తక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు పూచీకత్తు రూపంలో, 1.21 బిలియన్ డాలర్లు రుణంగాను, మరో 427 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి రూపంలోను నమోదైంది. భారీ పెట్టుబడుల్లో టాటా స్టీల్ .. సింగపూర్‌లోని తమ అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, విప్రో తమ అమెరికా విభాగంలో 787 మిలియన్ డాలర్లు, టాటా పవర్ .. మారిషస్‌లోని యూనిట్లో 131 మిలియన్ డాలర్లు మొదలైన డీల్స్ ఉన్నాయి. డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ విదేశ్, పహార్పూర్ కూలింగ్ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలైనవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవి 45 మిలియన్ డాలర్ల నుంచి 56 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇది ప్రాథమిక డేటా మాత్రమేనని, అధీకృత డీలర్ బ్యాంకుల నివేదికలను బట్టి మారవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన
సాక్షి,వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది. మూడు విదేశీ ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డిఎల్) సంస్థ ఫ్రీజ్ చేయడంతో అదానీ షేర్లు బాగా నష్టపోయాయి. దీంతో తిరిగి మళ్లీ లాభాల బాట పట్టేందుకు అదానీ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. అదానీ భవిష్యత్ కార్య చరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. • ఇవి 2-3 సంవత్సరాల ఓల్డ్ కంపెనీలు. 5-7 సంవత్సరాల తరువాత లాభాల్ని గడిస్తాయి. మాది వేగంగా అభివృద్ది చెందుతున్న సంస్థ. • నష్టపోయిన షేర్ల వ్యాల్యూ పెరుగుతుంది. ప్రస్తుతం యుటిలిటీ ప్లాట్‌ఫామ్ సేవల్ని మాత్రమే అందిస్తున్నాం. కానీ మనదేశంలో యుటిలిటీ ఇండెక్స్ లేదు. • అదానీకి డైవర్సిఫైడ్ రిజిస్టర్ ఉంది. దానిపై పనిచేస్తున్నాం. • సిటీ గ్యాస్ చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది బి-టు-సి వ్యాపారం. ఇది 2టైర్ , 3 టైర్ కేటగిరీ పట్టణాలకు కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతానికి దానిపైనే దృష్టి సారించినట్లు అదానీ సీఎఫ్ఓ చెప్పారు. కాగా ఎన్ఎస్డీఎల్ మూడు విదేశీ ఖాతాలను స్తంభింపజేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 5శాతం - 25 శాతానికి పడిపోయాయి. దాదాపు ఒక దశాబ్దంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 25 శాతం పడిపోయింది. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) కూడా 19 శాతం పైగా కుప్పకూలింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం అదానీ నికర విలువ 7.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 55,000 కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. చదవండి: పుకార్లు షికార్లు,అదానీ ‘ఫండ్స్’ కలకలం! -
180 బిలియన్ డాలర్లకి రియల్టీ పరిశ్రమ!
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ న్యూఢిల్లీ: దేశీ రియల్టీ పరిశ్రమ 2020 నాటికి 180 బిలియన్ డాలర్లకి చేరుతుందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) అంచనా వేసింది. స్మార్ట్ సిటీల నిర్మాణం, రీట్స్‌కు పన్ను ప్రోత్సాహకాలు వంటి పలు అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా నిలుస్తాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పలు సంస్కరణల కారణంగా దేశీ రియల్టీ రంగం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి చూరగొంటుందని, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తుందని ఎన్‌హెచ్‌బీ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో శ్రీరామ్ కల్యాణరామన్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. జీఎస్టీ బిల్లు అమలులోకి వస్తే.. వేర్‌హౌస్ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. రియల్టీ వృద్ధికి సమతుల్యంతో కూడిన నిబంధనలు సహా పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన చాలా అవసరమని సీబీఆర్ఈ చైర్మన్ (ఇండియా, దక్షిణ తూర్పు ఆసియా) అన్సుమన్ మేగజిన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగం సహకారం లేకుండా రియల్టీలో వృద్ధి కష్టసాధ్యమని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త రియల్టీ చట్టం.. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి దోహదపడుతుంద ని సీఐఐ చైర్పర్సన్ రుమ్జుమ్ చటర్జీ తెలిపారు.