-
గూగుల్ కొత్త డొమైన్.. కొనాలంటే రూ. కోటి ఉండాల్సిందే.. ఎందుకింత ఖరీదు!
Google New Domain: టెక్ దిగ్గజం గూగుల్ ఆన్లైన్ వెబ్సైట్లను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఓ కొత్త డొమైన్ '.ing' ప్రారంభించింది. ఈ డొమైన్ అనే సింగిల్ వర్డ్ వెబ్సైట్లను క్రియేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. mak.ing నుంచి draw.ing వరకు వినియోగదారులు సులభంగా గుర్తించడానికి డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం. .ing డొమైన్ రిజిస్టర్ చేసుకోవడానికి వన్-టైమ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చార్జీలు డిసెంబర్ 05 వరకు ప్రతి రోజూ తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సంస్థ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ధరలు ఏదైనా కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసుకోవడానికి ఇప్పుడు .ing అందుబాటులో ఉంటుంది. డొమైన్ స్టార్టింగ్ యాక్సిస్ కోటి రూపాయలు కావడం గమనార్హం. ఎందుకంటే ప్రస్తుతం ing ముగింపుతో వచ్చే పదాలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. think.ing రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 3249999, buy.ing రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 10833332.50 ఖర్చు చేయాల్సి ఉంటుంది. kin.ing, Dye.ing కోసం సంవత్సరానికి వరుసగా రూ.16249.17, రూ. 324999 చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్న సాధారణ డొమైన్స్ కంటే కూడా ఇవి చాలా ఖరీదైనవని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 18 ఏళ్ల అనుభవం.. అయినా వదలని కంపెనీ - కష్టంలో టెక్ ఉద్యోగి .ing డొమైన్‌ను పొందటం ఎలా? GoDaddy, Namecheap లేదా Google Domains వంటి డొమైన్ రిజిస్ట్రార్‌కి వెళ్లి, మీకు కావలసిన .ing డొమైన్ కోసం సర్చ్ చేయాలి. మీరు సర్చ్ చేసే డొమైన్ అందుబాటులో ఉంటే డబ్బు చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు. డొమైన్ రిజిస్టర్ చేసిన తరువాత దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు. ప్రస్తుతం .ing డొమైన్ ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంది. ఈ అవకాశం డిసెంబెర్ 5 వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. -
జుకర్‌బర్గ్‌కే డొమైన్ అమ్మాడు
కొచ్చి: జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌తో ప్రపంచాన్ని ఏకం చేశాడు. అయితే ఓ డొమైన్ రిజిస్ట్రేషన్ హక్కుల కోసం భారత విద్యార్థిని సంప్రదించాల్సి వచ్చింది. కొచ్చిలోని కేఎంఈఏ కాలేజీలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న అమల్ అగస్టిన్‌కు డొమైన్లను రిజిస్టర్ చేసుకోవటం అలవాటు. జుకర్‌బర్గ్ కూతురు మాక్జిమ్ పేరు మీద maxchanzuckerberg.org పేరుతో వెబ్సైట్ రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే కూతురు పేరుమీద వెబ్సైట్ ఓపెన్ చేద్దామనుకున్న జుకర్‌బర్గ్‌కు అది అందుబాటులో లేదని అమల్ పేరుతో రిజిస్టర్ అయిందని తెలిసింది. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ హక్కులు అమ్మాలంటూ ఫేస్బుక్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఐకానిక్ కేపిటల్ సంస్థ ప్రతి నిధులు అమల్‌ను సంప్రదించారు. అంతపెద్ద వ్యక్తి.. తన పేరుతో రిజిస్టర్ అయిన డొమైన్ హక్కులు కావాలని అడుగుతుండటంతో అమల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అలాగని డిమాండ్ ఉందికదాని.. ఇష్టమొచ్చినంత కావాలని అడగకుండా కేవలం 700 డాలర్లు (రూ.46,655) కే ఇచ్చేశాడు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement