జుకర్‌బర్గ్‌కే డొమైన్ అమ్మాడు
కొచ్చి: జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌తో ప్రపంచాన్ని ఏకం చేశాడు. అయితే ఓ డొమైన్ రిజిస్ట్రేషన్ హక్కుల కోసం భారత విద్యార్థిని సంప్రదించాల్సి వచ్చింది. కొచ్చిలోని కేఎంఈఏ కాలేజీలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న అమల్ అగస్టిన్‌కు డొమైన్‌లను రిజిస్టర్ చేసుకోవటం అలవాటు. జుకర్‌బర్గ్ కూతురు మాక్జిమ్ పేరు మీద maxchanzuckerberg.org పేరుతో వెబ్‌సైట్ రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే కూతురు పేరుమీద వెబ్‌సైట్ ఓపెన్ చేద్దామనుకున్న జుకర్‌బర్గ్‌కు అది అందుబాటులో లేదని అమల్ పేరుతో రిజిస్టర్ అయిందని తెలిసింది.
ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ హక్కులు అమ్మాలంటూ ఫేస్‌బుక్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఐకానిక్ కేపిటల్ సంస్థ ప్రతి నిధులు అమల్‌ను సంప్రదించారు. అంతపెద్ద వ్యక్తి.. తన పేరుతో రిజిస్టర్ అయిన డొమైన్ హక్కులు కావాలని అడుగుతుండటంతో అమల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అలాగని డిమాండ్ ఉందికదాని.. ఇష్టమొచ్చినంత కావాలని అడగకుండా కేవలం 700 డాలర్లు (రూ.46,655) కే ఇచ్చేశాడు.