
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి తోడుగా రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీస్తు న్నా యి. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమో దయ్యే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, గాలు లతో కూడిన వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ వారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే నమో దయ్యాయి.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమో దైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నిజామా బాద్‌లో 41.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.5 డిగ్రీ సెల్సి యస్‌గా నమోదైంది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతా వరణ శాఖ నిపుణులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment